16 రోజులు 32 కోట్లు..600 కోట్ల ఆటాడుతున్నాడా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగానే బిజీ అయ్యాడు. ఇక తన పెండింగ్ సినిమాలు పని అంతే అనుకున్నారు. కాని సడన్ గా పవన్ తన దర్శక నిర్మాతలుకు డేట్లిచ్చాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగానే బిజీ అయ్యాడు. ఇక తన పెండింగ్ సినిమాలు పని అంతే అనుకున్నారు. కాని సడన్ గా పవన్ తన దర్శక నిర్మాతలుకు డేట్లిచ్చాడు. హరి హర వీరమల్లు ఫస్ట్ పార్ట్ ని, అలానే ఓజీ ని పూర్తి చేసేందుకు సిద్దమయ్యాడు. ఒకవైపు పొలిటికల్ గా ఎంత బిజీ అయినా, తను కొత్త మూవీలు కమిట్ కాకున్నా, గత సినిమాలను పూర్తి చేసేందుకే ఫిక్స్ అయ్యాడు. అందుకోసం తన లుక్ మార్చుకుంటున్నాడు. వర్కవుట్లు షురూ చేశాడు. ఐతే రోజుకి రెండు కోట్ల చొప్పున 16 రోజులకు 32 కోట్ల పారితోషికంతో, 600 కోట్ల మార్కెట్ కోసం కష్టపడుతున్నాడు. కాకపోతే తన సినిమా అప్ డేట్లు లేవు. ఆ గోలే కొంతకాలంగా కనిపించట్లేదు. అదేదో వెటరన్ హీరోగా పవన్ మారిపోయినట్టు.. తన ఫ్యాన్స్ నుంచి కూడా సినిమా అంచనాలు, ఆశలు కనిపించట్లేదు. మరి ఇలాంటి టైంలో తన సినీ కష్టం వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? చూసేయండి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొన్నేళ్లుగా రాజాకీయాలు, లేదంటు ప్రభుత్వ ఏర్పాటు తో డిప్యూటి సీఎంగా పని బాధ్యతలతో పూర్తిగా సినిమాలకు దూరమయ్యాడు. ఎప్పుడో కమిటైన హరి హర వీరమల్లు, కొంత పూర్తైన ఓజీ మూవీలు ఎప్పుడు కంప్లీట్ చేస్తాడనే డౌట్ కూడా ఆవిరైపోతున్నటైంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు..బాధ్యత ఒకవైపు సినిమాలు పూర్తి చేయాల్సిన అవసరం మరో వైపు.. మొత్తంగా ఇప్పుడు తన పెండింగ్ మూవీలను పూర్తి చేసేందుకు రెడీ అవుతున్నాడు. సినిమాలకు దూరమయ్యాక తన లుక్ మొత్తం బొద్దుగా తయారవటంతో, మళ్లీ వర్కవుట్లు పెంచి లుక్ మార్చుకునే పనిలో ఉన్నాడు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తీస్తూనే పెండింగ్ సినిమాలను పూర్తి చేసేందుకు తనని తాను మార్చుకుంటున్నాడు.
హరి హర వీరమల్లు మూవీ ఫస్ట్ పార్ట్ ని పూర్తి చేసేందుకు 6 రోజుల కాల్ షీట్స్ కేటాయించిన పవన్, సుజీత్ మూవీ ఓజీ కోసం 10 రోజుల కాల్ షీట్స్ ఇచ్చాడట. సో 6 రోజుల షూటింగ్ తో హరి హర వీరమల్లు ఫస్ట్ పార్ట్ పెండింగ్ షూటింగ్ పూర్తవుతుంది. ఇక ఓజీ అయితే కేవలం 10 రోజుల్లో 8 మేజర్ సీన్లతో 70 శాతం టాకీ పార్ట్ పూర్తి చేసేలా ప్లాన్ చేశాడు సుజీత్.మొత్తంగా ఈ రెండు సినిమాల్లో పాటలు 4 చొప్పున తగ్గించి, ఎక్కువగా టాకీ పార్ట్ ఉండేలా కథలో మార్పులు చేశారట. ఒకప్పటిలా వారాలు, నెలలు కాల్ షీట్స్ కేటాయించే పరిస్థితుల్లో పవన్ లేడు. అలాని కమిటైన మూవీలను పూర్తి చేయకపోతే కరెక్ట్ కాదు. కాబట్టే ప్రస్థుతం ఈరెండీంటిని పూర్తిచేసేపనిలో పడ్డాడు పవన్.మే ఎండ్ లోగా ఓజీ కూడా వందకు వంద శాతం షూటింగ్ పూర్తవుతుందట. దసరాక ఓజీ వచ్చే అవకాశాలున్నాయి. ఇక హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ దసరా తర్వాత కంటిన్యూయస్ గా రెండునెలలు కేటాయించి పూర్తి చేసేలా పవన్ తన కాల్ షీట్స్ కేటాయించాడని తెలుస్తోంది. సో సమ్మర్ లో హరి హర వీరమల్లు, దసరాకు ఓజీ, వచ్చే ఏడాది సంక్రాంతికి హరీష్ శంకర్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ రావటం పక్కా అయ్యింది.
మొత్తంగా పొలిటికల్ గా గెలిచి చూపించిన పవన్, అలా దూసుకెళుతున్నందుకు ఫ్యాన్స్ ఎంత సంతోషించినా, తమ అభిమాన హీరో సినిమాలు రావట్లేదనే అసంత్రుప్టి మాత్రం ఉండనే ఉంటుంది. సో ఇప్పుడు మూడు మూవీలు ఏడాది పొడుగునా రాబోతున్నాయి కాబట్టి, ఆ వెలితి కూడా తీరబోతోంది. పవర్ స్టార్ ఫ్యాన్స్ కి కూడా సినీ పండగ వచ్చే రోజు దగ్గర్లోనే కనిపిస్తోంది.