రెబల్ స్టార్ ని ముంచాక.. మునిగిపోతూనే ఉంది…
రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి, గ్లోబల్ స్టార్ చరన్ వరకు ఒక లెగ్గు, స్టార్ హీరోలని ముంచేస్తోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా అరడజన్ స్టార్ హీరోలు ఆ లెగ్గుకి బలయ్యారు. ప్రభాస్ ని నిండా ముంచి, వెంటనే మెగా హీరోలని వణికించింది పూజా హెగ్డే.
రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి, గ్లోబల్ స్టార్ చరన్ వరకు ఒక లెగ్గు, స్టార్ హీరోలని ముంచేస్తోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా అరడజన్ స్టార్ హీరోలు ఆ లెగ్గుకి బలయ్యారు. ప్రభాస్ ని నిండా ముంచి, వెంటనే మెగా హీరోలని వణికించింది పూజా హెగ్డే. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా తనెక్కడ అడుగు పెట్టినా బాక్సాఫీస్ బుగ్గైపోతోంది…వరుసగా ఫ్లాపులు పడ్డ పాపానికి, హీరోయిన్ నే బ్లేమ్ చేయటం కరెక్ట్ కాదు. కాని ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్, చరణ్ ఫ్యాన్స్ తో పాటు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా తనని తగులుకున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటి వరకు ఒక హీరో ఫ్యాన్స్ మరో తిట్టడం చూశాం.. కాని అందరి ఫ్యాన్స్ మూకుమ్మడిగా పూజా హెగ్డేమీద దాడి చేయటం చూశామా..? అదే జరుగుతోంది. ఏదో ఒక హీరో విషయంలో తను తప్పుగా మాట్లాడితే, ఆ గొడవ కాస్త చిలికి చిలికి గాలివాన తూఫానైనట్టు, సీన్ మారిపోయింది..
రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి ది బిగినింగ్ తో 550 కోట్లు, బాహుబలి ది కన్ క్లూజన్ తో 1850 కోట్లు రాబట్టాడు. తర్వాత సాహో తో నార్త్ ఇండియాని ఊపేశాడు. అలా హ్యాట్రిక్ కిక్ సొంతం చేసుకుని, దూసుకెళుతున్న తనకి, రాధేశ్యామ్ తో పంచ్ పడింది. సరే డైరెక్టర్ సరిగా రెబల్ స్టార్ ఇమేజ్ కి తగ్గ కంటెంట్ ని రెడీ చేయలేకపోయాడు అనుకోవచ్చు..
కాని సలార్, కల్కీతో రెబల్ స్టార్ భారీ బ్లాక్ బస్టర్లు సొంతం చేసుకుంటుంటే, తనతో జోడీకట్టి రాధేశ్యామ్ తో ముంచేసిన పూజా మాత్రం, మిగతా హీరోలని అలానే ముంచుతూ దూసుకెళ్లిందంటున్నారు. ముందు రాధేశ్యామ్ తో ప్రభాస్ కి పంచ్ పడితే, తర్వాత కోలీవుడ్ స్టార్ విజయ్ కి బీస్ట్ రూపంలో షాక్ తగిలింది. ఇక సర్కస్ తో హిందీ హీరో రణ్ వీర్ సింగ్ ఫ్లాప్ ఫేస్ చేస్తే, కిసీకా భాయ్ కిసీకా జాన్ డిజాస్టర్ తో సల్మాన్ కి షాక్ తగిలింది. ఆచార్యతో చిరు, చరన్ కి మెగా డిజాస్టర్ ఎదురెళ్లింది.
ఇవన్నీ దర్శకుడు, లేదంటే రచయితల తప్పు కూడా కావొచ్చు. కాని ఆమాత్రానికే పూజా హెగ్డేని బ్లేమ్ చేయటం కరెక్ట్ కాదు. కాని రాధేశ్యామ్ తో మొదలు పెట్టి అరడజన్ పాన్ ఇండియా ప్లాపులు సొంతం చేసుకోవటం వల్ల పూజా హెగ్డేని ఐరన్ లెగ్గంటున్నారు. అంతవరకు ఏమో అనుకోవచ్చు, కాని మెగా ఫ్యాన్స్, రెబల్ ఫ్యాన్స్ తోపాటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. ఐకాన్ స్టార్ అల్లు ఆర్మీ కూడా పూజా హెగ్డే మీద విరుచుకుపడుతోంది.
దీనికి రెండు కారణాలున్నాయి. ఒకటి అల వైకుంటపురంలో లాంటి హిట్, డీజే లాంటి మాస్ హిట్ ఈరెండు తనకి టాలీవుడ్ లోనే దక్కాయి. అది కూడా బన్నీతో జోడీకట్టే ఈరెండు హిట్లతో పండగ చేసుకుంది పూజా. కాని అల వైకుంఠపురంలో మూవీ తమిల్ సినిమా అంది. డీజే ని కూడా అందులోనే కలిపేసింది. ఇన్ని హిట్లు, అంత ఇమేజ్ తో పాటు మార్కెట్ ని క్రియేట్ చేసిన తెలుగు సినిమాను మర్చిపోతావా అంటూ, అల్లు ఆర్మీ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు.
కట్ చేస్తే ఆచార్య ఫెల్యూర్ లోతన హస్తం లేకున్నా మెగా ఫ్యాన్స్, ఐరన్ లెగ్ సెంటిమెంట్ వల్ల రెబల్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో తనని సాఫ్ట్ గా ట్రోల్ చేస్తున్నారు. ఐతే పూజాకి నిజంగా కెరీర్ లో మొదటి బ్లాక్ బస్టర్ అరవింద సమేత వీరరాఘవతోనే వచ్చింది. అలాంటి మూవీని మర్చిపోతావా అంటూ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ తగులుకున్నారు. దువ్వాడ జగన్నాథం యావరేజ్ హిట్ అయితే, రంగస్థలంలో తను ఐటమ్ బాంబు మాత్రమే పేల్చింది. అలాంటి తనకు అరవింద సమేత వీరరాఘవ బ్లాక్ బస్టర్ తోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్ వచ్చింది. అయినా తొలి బ్లాక్ బస్టర్ ని తను మర్చిపోవటం వల్లే తారక్ ఫ్యాన్స్ కి కూడా మండినట్టుంది. అందుకే బన్నీ ఫ్యాన్స్ ఫైర్ అయ్యేటైంలో వీళ్లు కూడా రంగంలోకి దిగారు.