మంచివాడని ముంచేస్తున్నాడా..? 500 కోట్లతో 50 రోజుల గోల్ మాల్..
రెబల్ స్టార్ ప్రభాస్ తో మారుతి తీస్తున్న మూవీ రాజాసాబ్. ఎప్పుడో మొదలైంది. మధ్య మధ్యలో రెబల్ స్టారే సలార్, కల్కీ సినిమాలు తీయటం వల్లే, రాజా సాబ్ షూటింగ్ డిలే అయ్యింది.

రెబల్ స్టార్ ప్రభాస్ తో మారుతి తీస్తున్న మూవీ రాజాసాబ్. ఎప్పుడో మొదలైంది. మధ్య మధ్యలో రెబల్ స్టారే సలార్, కల్కీ సినిమాలు తీయటం వల్లే, రాజా సాబ్ షూటింగ్ డిలే అయ్యింది. అందులో ఎలాంటి డౌట్ లేదు. కాని ఇచ్చిన కాల్ షీట్స్ ని కరెక్టర్ గా వాడటంలో మారుతి ఫేయిలయ్యాడా? అవుతున్నాడా? ఈ డౌట్ రావటానికి 500 కోట్ల రాజా సాబ్ కొత్త తలనొప్పే కారణం. ఎందుకంటే వారంలో ఇక షూటింగ్ కి గుమ్మడి కాయ కొడతారనుకుంటే, కనీసం 50 రోజులు కాల్ షీట్స్ కావాలన్నాడట మారుతి. తిప్పి తిప్పి కొడితే 10రోజుల్లో ప్యాచ్ వర్క్ పూర్తవ్వాలి. 99 శాతం షూటింగ్ ఆల్రెడీ అయిపోయింది. అలాంటిది ఇంకా 50రోజులు దేనికనే డౌట్ వస్తుంది.. ఐతే అక్కడే ట్విస్ట్ ఇస్తున్నాడు మారితి… తన రీజన్ వెనక కూడా మంచి విజనే కనిపిస్తోంది. ఇండియన్ సినిమాల్లో ఇంతవరకు ఎవరూ చేయనంతగా ఒక్క పాటనే 20 రోజుల్లో షూటింగ్ చేయాలనుకుంటున్నారా? అంతగా ఒక్క పాటలే ఏం చూపించబోతున్నారు..? 50 రోజుల కష్టం వెనక ముందే కనిపిస్తున్న లాభం ఏంటి? హావేలుక్
రెబల్ స్టార్ రాజాసాబ్ ఎప్పుడో కల్కీ, సలార్ కంటే ముందు మొదలైంది. అవొచ్చి కూడా రిలీజై నెలలు గడుస్తోంది. కాని ఇంకా రాజా సాబ్ పూర్తి కాలేదు. మొన్నటికి మొన్న డిసెంబర్ లో టాకీ పార్ట్ పూర్తై, జనవరిలో పాటల షూటింగ్ అన్నారు. కాని మోకాలి చికిత్స వల్ల ప్రభాస్ బ్రేక్ తీసుకున్నాడు. తీరా ఇప్పుడు ఫౌజీ తాలూకు లాంగ్ షెడ్యూల్ తర్వాత రాజా సాబ్ షూటింగ్ అనుకునే సరికి, ప్రభాస్ ని 50 రోజుల కాల్ షీట్స్ అడిగాడట మారుతి.నిజానికి రాజా సాబ్ షూటింగ్ 99 శాతం పూర్తైంది. కేవలం ప్యాచ్ వర్క్ కోసమే 10 రోజుల షూటింగ్ చేయబోతున్నారు. అదైతే టాకీపార్ట్ 100 శాతం పూర్తైనట్టే. కాకపోతే ఇంకా 40 రోజుల కాల్ షీట్స్ అడగటమే రెబల్ స్టార్ నితో సహా టోటల్ టీం షాక్ అవుతోంది. ఫౌజీ లాంటి మూవీని 5 నెలల్లో హను రాఘవపూడీ పూర్తిచేయాలనుకుంటుంటే, మారుతి మాత్రం కేవలం పాటల షూటింగ్ కే 40 రోజుల కాల్ షీట్స్ తీసుకుంటున్నాడు.
యూరప్ లో రాజసాసాబ్ సింగిల్ సాంగ్ ని 20 దేశాల్లో తెరకెక్కించబోతున్నారట. అంతగా అన్ని దేశాల్లో ఒకే సాంగ్ ని తీయటానికి కారనం, శంకర్ మూవీలో జీన్స్ సాంగ్ లాంటి ప్లానింగే… జీన్స్ లో ప్రపంచ వింతలన్నీ ఒకే సాంగ్ లో ఉండేలా చేశాడు శంకర్. అలా రాజా సాబ్ లో యూరప్ లోని 20 దేశాలు, అక్కడి ప్రత్యేక మైన ప్రదేశాలని ఒకే పాటలో చూపించబోతున్నారు. ఇక మిగిలిన 3 పాటలనీ 20 రోజుల్లో తెరకెక్కించబోతున్నారట.అందుకే రాజా సాబ్ ని పూర్తిచేసేందుకు 50 రోజుల కాల్ షీట్స్ అడిగి తీసుకున్నాడు మారుతి. ప్రజెంట్ ఫౌజీ లాంగ్ షెడ్యూల్ నడుస్తోంది. అదయ్యాక రాజా సాబ్ కోసం 10 రోజులు కేటాయించబోతున్నాడు ప్రభాస్. ఆ పదిరోజుల్లో టాకీ పార్ట్ పూర్తిచేసి, మళ్లీ ఫౌజీ కోసం మరో లాంగ్ షెడ్యూల్ కి డేట్లు ఇస్తాడట ప్రభాస్. ఆతర్వాతే ఏప్రిల్ లో రాజా సాబ్ పాటల్ని యూరప్ లో తీసేందుకు రంగం సిద్దమౌతోంది. ఏకంగా 40 రోజులు అక్కడే పాటలన్నీ పూర్తి చేసి తిరిగొస్తారని తెలుస్తోంది.
ఎలా చూసినా అనుకున్న షెడ్యూల్స్ లో ఏమాత్రం లెక్కల్లో మార్పులొచ్చినా మే వరకు రాజా సాబ్ షూటింగ్ పొడిగించే ఛాన్స్ఉంది. అదే జరిగితే దసరాకే తప్ప రాజా సాబ్ మధ్యలో వచ్చే అవకాశమే లేదు. ఆగస్ట్ లో వార్ 2 ఉంది. దీపావళి, క్రిస్మస్ కి డజన్ పాన్ ఇండియా సినిమాల పోరు కన్ఫామ్అయ్యింది. కాబట్టి దసరా తప్ప రాజా సాబ్ కి మరో ముహుర్తం కుదిరే అవకాశం కనిపించట్లేదు.