మీసం, జుట్టు, గెడ్డం .. పూర్తిగా మారిపోయిన రెబల్ స్టార్…
రెబల్ స్టార్ ప్రభాస్ తో హను రాఘవపూడీ తీస్తున్నమూవీ ఫౌజీ. మొన్నటి వరకు హీరోలేని సీన్లు తీశారు. తర్వాత సెట్లోకి ప్రభాస్ అడుగుపెట్టగానే యాక్షన్ సీక్వెన్స్ తీశారు. ఇప్పుడు రొమాంటిక్ డ్రామా సెట్ అయ్యింది.

రెబల్ స్టార్ ప్రభాస్ తో హను రాఘవపూడీ తీస్తున్నమూవీ ఫౌజీ. మొన్నటి వరకు హీరోలేని సీన్లు తీశారు. తర్వాత సెట్లోకి ప్రభాస్ అడుగుపెట్టగానే యాక్షన్ సీక్వెన్స్ తీశారు. ఇప్పుడు రొమాంటిక్ డ్రామా సెట్ అయ్యింది. సీన్ లోకి బాలీవుడ్ నటుడి అనుపమ్ ఖేర్ కూడా వచ్చాడు. తను రావటం అంత పెద్ద మ్యాటర్ కాదు కాని, తన వల్ల రెబల్ ఫ్యాన్స్ కి ఒక మంచి జరిగింది. తన పుణ్యమాని అసలు ఫౌజీలో ప్రభాస్ ఎలా ఉంటాడో రివీలైంది. తన గెడ్డం, మీసం, అలానే హేయిర్ స్టైల్ మొత్తంగా తన లుక్ ని పోస్టర్ లో కాకుండా ఇలా రివీల్ చేయాల్సి వచ్చింది. అంతమాత్రాన ఫౌజీ లుక్ వచ్చేసిందని సంబర పడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఫౌజీలో ఇది ప్రభాస్ పాత్ర అసలు లుక్ కాదని తెలుస్తోంది. ప్రజెంట్ ఫ్లాష్ బ్యాక్ సీన్లే తీస్తోందట ఫిల్మ్ టీం. ఇక ఈ మంథ్ ఎండ్ నుంచి ప్రభాస్ డైట్ మారబోతోంది కూడా తెలుస్తోంది.. మే ఎండ్ కి ఫౌజీ షూటింగ్ పూర్తవుతుందని, ఆలోపే ప్రభాస్ బరువు తగ్గాలనేది కండిషన్ అని కూడా ప్రచారం జరుగుతోంది. అంతా స్పిరిట్ కోసమేనా..? ఇలా చేస్తే ఆ సినిమా లుక్ కూడా రివీల్ అయ్యే అవకాశం లేదా? టేకేలుక్
రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి పూనకాలొచ్చేలా, ప్రభాస్ లుక్ షాక్ ఇస్తోంది. హను రాఘవపూడీ డైరెక్షన్ లో తను చేస్తున్న ఫౌజీ తాలూకు ఫోటో ఫ్యాన్స్ కి కిక్ ఇస్తోంది. ఇప్పటి వరకు అసలు తను ఈ సినిమాలో ఎలా ఉంటాడో ఎవరూ చూడలేదు. కనీసం పోస్టర్ వదల్లేదు. 20 రోజుల భారీ షెడ్యూల్ తో బిజీ అయిన ప్రభాస్ తాలూకు లుక్, సడన్ గా సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.హిందీ నటుడు అనుపమ్ ఖేర్ ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. అయితే ప్రభాస్ తోపాటు డైరెక్టర్ అండ్ టీం తో తను దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయగానే, అది వైరలైంది. మొత్తంగా కాస్త బొద్దుగా మారిన ప్రభాస్, కొత్త మీసకట్టు, గడ్డం, హేయిర్ స్టైల్ తో దుమ్ముదులిపేలా ఉన్నాడు. బేసిగ్గా ఫౌజీ అంటేనే సోల్చర్.. అందులోనూ ఇది వరల్డ్ వార్ టైం పీరియడ్ మూవీ.
సో అప్పుడే కాదు, ఇప్పటికీ కూడా జుట్టు తక్కువ, గడ్డంతో సోల్చర్ కనిపించటం అనేది జరగదు. కాబట్టి ఫౌజీలో ఇది తన అసలు లుక్ కాదని తేలిపోతోంది. ప్రజెంట్ 20 రోజుల లాంగ్ షెడ్యూల్ షూటింగ్ లో ఫ్లాష్ బ్యాక్ సీన్లే తీస్తున్నారు. ఇక గడ్డం తీసేసి, షార్ట్ హేయిర్ తో ప్రభాస్ కొత్తగా కనిపించబోతున్నాడట. అంతేకాదు తన డైట్ మార్చ్ నుంచి మొదలౌతుందని తెలుస్తోంది.దీనికి కారణం ఫౌజీ లో మేయిన్ క్యారెక్టర్ తాలూకు సీన్లు తీసే సమయానికి, ప్రభాస్ కాస్త బరువు తగ్గాలనేది కండీషన్. అంతేకాదు సందీప్ రెడ్డి వంగ మేకింగ్ లో తెరకెక్కే స్పిరిట్ కోసం టెన్ ప్యాక్స్ తో కాస్త స్లిమ్ కాబోతున్నాడు ప్రబాస్. అందుకోసం కూడా డైట్ అండ్ వర్కవుట్లు మార్చాల్సి వస్తోంది. అదే మార్చ్ నుంచి మొదలై జూన్ కల్ల తన లుక్ చాలా వరకు మారాల్సి ఉంటుంది.సో ఫౌజీ మూవీ చేస్తూనే ప్రభాస్ తన లుక్ మార్చుకోబోతున్నాడు. స్పిరిట్ కోసం కూడా ప్రిపేర్ అవుతున్నాడు. ఏదేమైనా కల్కీ తర్వాత తన లుక్ లో చాలా మార్పులు రావటం, కాస్త బొద్దుగా కనిపిస్తూ ఉండటంతో, ఫ్యాన్స్ థ్రిల్ అవుతున్నారు.