7 సినిమాలు 5300 కోట్లు.. బాక్సాఫీస్ బంగారు బాతు.. 9 ఏళ్ళలో ప్రభాస్ ట్రాక్ రికార్డ్

ప్రభాస్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.ఇండియా వైడ్ గా ఈ పేరు ఒక సెన్సేషన్. ఈ పేరు వింటే అభిమానులకు పూనకాలు రావడం పక్కా. తన సినిమాలతో ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దుమ్ము దులిపిన ప్రభాస్.. ఏ సినిమా చేసిన సరే కచ్చితంగా సెన్సేషన్ అవుతుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 11, 2025 | 04:15 PMLast Updated on: Feb 11, 2025 | 5:11 PM

Intersting Facts About Prabhas Upcoming Movies

ప్రభాస్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.ఇండియా వైడ్ గా ఈ పేరు ఒక సెన్సేషన్. ఈ పేరు వింటే అభిమానులకు పూనకాలు రావడం పక్కా. తన సినిమాలతో ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దుమ్ము దులిపిన ప్రభాస్.. ఏ సినిమా చేసిన సరే కచ్చితంగా సెన్సేషన్ అవుతుంది. ప్రభాస్ ను స్క్రీన్ పై చూడటానికి అభిమానులతో పాటుగా నార్మల్ సినిమా పిచ్చోళ్ళు కూడా ఎగబడుతుంటారు. క్లాస్ ఆడియన్స్, మాస్ ఆడియన్స్ అనే తేడా లేకుండా అందరినీ థియేటర్ వైపు పరుగులు పెట్టించే సత్తా ప్రభాస్ కు ఉంది.

ఒక సినిమా చేస్తే ఆ సినిమా ఖచ్చితంగా ఫస్ట్ డే 100 కోట్లు వసూలు చేయాల్సిందే అనే టార్గెట్ పెట్టుకుని సినిమాలు చేస్తూ ఉంటాడు ఈ స్టార్ హీరో. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఏకంగా ఏడు నుంచి ఎనిమిది సినిమాలు రెడీగా ఉన్నాయి. ఈ ఎనిమిది సినిమాలు రాబోయే మూడు నాలుగేళ్లలో రిలీజ్ అయిపోతాయి. ఇవన్నీ కూడా భారీ బడ్జెట్ సినిమాలు. వాస్తవానికి భారీ బడ్జెట్ తో వచ్చే సినిమాలు ఎక్కువగా టైం తీసుకుంటాయి. కానీ ప్రభాస్ సినిమాలు మాత్రం చాలా తక్కువ టైంలో రిలీజ్ అయిపోతున్నాయి.

బాక్స్ ఆఫీస్ వద్ద షేక్ చేస్తున్నాయి. ఇక ప్రభాస్ కూడా తన సినిమాల విషయంలో పక్కా లెక్కలతో ఉంటున్నాడు. ఇక గత ఐదేళ్లుగా ప్రభాస్ నటించిన ప్రతి సినిమా భారీగా వసూళ్లు సాధించింది. హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు కాసుల వర్షం కురిపించాయి. దీనితో నిర్మాతలు ప్రభాస్ తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అటు డైరెక్టర్లు కూడా ప్రభాస్ తో సినిమా చేస్తే తమకు మంచి ఇమేజ్ వస్తుంది అనే టార్గెట్ పెట్టుకొని పని చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే గత ఐదేళ్లలో ప్రభాస్ నటించిన ప్రతి సినిమా ఫస్ట్ డే 100 కోట్లకు పైగా వసూళ్ల రాబట్టి సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాయి.

రెబల్ స్టార్ ఫ్యామిలీ.. నుంచి వచ్చి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రెబల్ స్టార్ ఇప్పుడు బాక్సాఫీస్ కు కింగ్ గా నిలబడ్డాడు. బాహుబలి నుంచి ఇప్పటివరకు ఈ 9 ఏళ్లలో ఆయన నటించిన ఏడు సినిమాలకు గాను ఏకంగా 5300 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఇది ఇండియన్ సినిమా హిస్టరీ లోనే సరికొత్త రికార్డుగా చెప్తున్నారు అనలిస్టులు. 2015 నుంచి ప్రభాస్ నటించిన ప్రతి సినిమా 500 నుంచి 1000 కోట్ల మధ్యలో కలెక్షన్స్ రాబట్టింది. కొన్ని అయితే ఏకంగా 900 కోట్లు క్రాస్ చేసాయి.

ప్రభాస్ సినిమాలకు విడుదలకు ముందు విపరీతమైన బజ్ క్రియేట్ అయిపోతుంది. గడిచిన 9 ఏళ్లలో కేవలం 7 సినిమాల్లోనే నటించాడు ప్రభాస్. అతని బాక్సాఫీస్ వేల్యూ మాత్రం 5300 కోట్లు. ఇండియన్ సినిమాలో ఈ ఘనత సాధించిన ఏకైక హీరోగా ప్రభాస్ రికార్డులు క్రియేట్ చేశాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో రెండు సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఈ సినిమాలు కూడా భారీగానే వసూలు చేస్తాయని అభిమానులు కాన్ఫిడెంట్ గా ఉన్నారు.