600 కోట్లు రెడీ… షడ్ రుచులతో స్పిరిట్..
రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ సినిమా అంటేనే ఫ్యాన్స్ లో పూనకాలు మొదలవ్వాలి...అదే జరుగుతోంది కూడా. ఈ కాంబో కూడా అలాంటి సెన్సేషనల్ కాంబినేషన్ కాబట్టే, ఈ మూవీ లాంచ్ అనగానే సౌత్, నార్త్ ఇండియా షేక్ అయ్యేలా ఉంది.

రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ సినిమా అంటేనే ఫ్యాన్స్ లో పూనకాలు మొదలవ్వాలి…అదే జరుగుతోంది కూడా. ఈ కాంబో కూడా అలాంటి సెన్సేషనల్ కాంబినేషన్ కాబట్టే, ఈ మూవీ లాంచ్ అనగానే సౌత్, నార్త్ ఇండియా షేక్ అయ్యేలా ఉంది. ఇర ఉగాదికే ఈ కాంబినేషన్ లో స్పిరిట్ లాంచ్ కాబోతోంది. మరోసారి బాలీవుడ్ లేడీ దీపికా పదుకొనే ప్రభాస్ తో జోడీ కట్టబోతోంది. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ అనుకున్నా, సినిమా లాంచ్ మాత్రం ఈ పండక్కే చేస్తోంది ఫిల్మ్ టీం. అంతా బానే ఉంది కాని, ఇందులో కొరియన్ విలన్ సంగతే తేలలేదు. ఇండోనేషియా లేడీని హీరోయిన్ గా తీసుకుంటారని ప్రచారం జరిగింది. ఎక్కడా అలాంటి ఊసే వినిపించట్లేదిప్పుడు.. కొరియా, జపాన్, మలేషియా, ఇండోనేషియా ఇలా పాన్ ఆసియా మూవీగా స్పిరిట్ ని మారుస్తున్నారన్నారు. కాని అందుకు తగ్గ అడుగులు పడుతున్నాయా లేదా అన్నది తేలలేదు… ఉగాది లాంచ్ రోజు సందీప్ రెడ్డి వంగా బాంబ్ పేల్చబోతున్నాడనే వార్త నిజమౌతుందా? జస్ట్ రూమర్ గా మిగిలిపోతుందా? హావేలుక్
నటించకున్నా నడిచొస్తే చాలు, పాన్ ఇండియా షేక్ అయ్యేలా మ్యార్కెట్… ఫ్లాప్ మూవీలైన రాధేశ్యామ్, ఆదిపురుష్ తో కూడా 300 కోట్ల నుంచి, 700 కోట్లు రాబట్టిన ఇమేజ్… ఇవన్నీ రెబల్ స్టార్ ప్రభాస్ సొంతం.. ఇక అగ్రెసీవ్ హీరోయిజంతో పాన్ ఇండియా లెవల్లో పూనకాలు తెప్పించి రికార్డులు సందీప్ రెడ్డి సొంతం..హీరో రేంజ్ లో ఓ డైరెక్టర్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే అది సందీప్ రెడ్డి వంగకే సాధ్యమైంది… సో అలాంటి డైరెక్టర్ తో రెబల్ స్టార్ సినిమా అంటే పాన్ ఇండియా సౌండ్, పాన్ వరల్డ్ మార్కెట్ వరకు రీసౌండ్ చేయాల్సిందే.. అంత దమ్మున్న కాంబినేషన్ కి, ఏమాత్రం కంటెంట్ ఉన్న కథ పడినా, హిస్టరీ క్రియేట్ అవుతుంది.
సందీప్ రెడ్డి వంగతో సినిమా అంటే, హీరోయిజం ఓరేంజ్ లో ఉంటుంది. దీనికి తోడు ప్రభాస్ ఇంతవరకు వేయని పోలీస్ పాత్రతో స్పిరిట్ తెరకెక్కబోతోంది. ఈ రెండు రీజన్స్ చాలు, ఈ కాంబినేషన్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనటానికి. కాని ఇక్కడ ఈమూవీ హిట్ గురించో, వెయ్యికోట్ల పైనే వచ్చే వసూళ్ల గురించో డిస్కర్షన్ జరగట్లేదు.పాన్ ఆసియా మార్కెట్ ని టార్గెట్ చేసిన సందీప్ రెడ్డి వంగ, కొరియన్ హీరో డాన్ లీని ఇందులో విలన్ గా తీసుకుంటాడన్నారు. దీపికా పదుకొనే హీరోయినే అయినా, అసలు హీరోయిన్ ఇండోనేషియా లేడీ అన్నారు. కాని ఆ పేర్లు వినిపించట్లేదు. ఉగాది దగ్గరకొస్తోంది. అదే రోజు స్పిరిట్ సినిమాను లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మరి లాంచింగ్ రోజు టోటల్ స్టార్ కాస్ట్ ఎనౌన్స్ చేస్తారా? లేదా అన్న విషయంలో క్లారిటీ లేదు. ఒక వేళ ఇందులో కొరియన్ హీరో డాన్ లీ వీలన్ గా నటించినట్టౌతే, కొరియా, జపాన్, ఇండోనేషియా, మలేషియాలో ఈ సినిమాకు రీచ్ పెరుగుతుంది. జపాన్ లో ప్రభాస్ కి భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కాబట్టి ఇండోనేషియా, మలేషియా, కొరియాలో కూడా తనకి మార్కెట్ క్రియేట్ అయ్యే ఛాన్స్ఉంది. చైనాలో కూడా ప్రభాస్ రేంజ్ మారిపోతుంది. సో ఈ టార్గెట్ ని రీచ్ అయ్యాక యూఎస్, యూరప్ మార్కెట్లును టార్గెట్ చేసే ఛాన్స్ఉంది…