సెట్లు, వీడియోలు లీకైనా.. 1000 కోట్ల స్క్రీప్ట్ సేఫే…
సూపర్ స్టార్ మహేశ్ బాబు బాగా బక్క చిక్కాడు.. ఆవిషయం రీసెంట్ గా ఫ్యాన్స్ తోదిగిన ఫోటోతో లీకైంది. మొన్న సెట్లో జరుగుతున్న సీన్ షూటింగ్ అంతా లీకై సోసల్ మీడియాలో వైరలైంది.

సూపర్ స్టార్ మహేశ్ బాబు బాగా బక్క చిక్కాడు.. ఆవిషయం రీసెంట్ గా ఫ్యాన్స్ తోదిగిన ఫోటోతో లీకైంది. మొన్న సెట్లో జరుగుతున్న సీన్ షూటింగ్ అంతా లీకై సోసల్ మీడియాలో వైరలైంది. అంతకుముందు సెట్ తాలూకు ఇమేజ్ లతో పాటు వీడియోలు కూడా వైరలయ్యాయి. ఇక దానికి ముందు అద్దం ముందు నిలుచున్న మహేశ్ బాబు లుక్ లీకైంది. ఆ లుక్ కి, లీకైన సీన్ షూటింగ్ వీడియోలో మహేశ్ లుక్ కి పోలిక ఉంది. కాని ఫ్యాన్ తో మహేశ్ బాబు మొన్న దిగిన ఫోటోలో లుక్ మాత్రం కాస్త తేడాగా ఉంది. బేసిగ్గా మహేశ్ లుక్ రివీల్ కానీవ్వని రాజమౌలి, ఇలా ఎలా ఫ్యాన్ తో ఫోటోకి పర్మీషన్ ఇచ్చాడు.. ఇక్కడే కథలో ట్విస్ట్ ఉంది. అసలు సినిమాలో మహేశ్ లుక్ కి, బయట తను తిరుగుతున్నప్పుడు కనిపించే లుక్ కి పోలికే లేదని తెలుస్తోంది. ఇంతవరకు మహేశ్ కంటిని కనిపించకుండా కూలింగ్ గ్లాసెస్ ని పెట్టడం వెనక కూడా స్ట్రాటజీ ఉందని ఇప్పుడిప్పుడే తేలుతోంది. దీనికి తోడు ఇన్ని విషయాలు లీకౌతుంటే, స్క్రిప్ట్ కూడా లీకవ్వక తప్పదన్న ఓ వ్యక్తి స్టేట్ మెంట్ కి కౌంటర్ ని కూడా ఇచ్చేడు రాజమౌైళి. దీనికే కాదు ఈ సినిమా వర్కింగ్ టైటిల్ మీద కూడా జరుగుతున్న ఫ్యాన్ వార్ కి కూడా సింగిల్ స్టేట్ మెంట్ తో డోర్ వేసేశాడు రాజమౌళి… సో అదేంటో చూసేయండి.
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒరిస్సాలో ఫ్యాన్స్ తో దిగిన ఫోటో చూసి తనెందుకు ఇంతగా సన్నబడ్డాడనే డిస్కర్షన్ మొదలైంది. టెన్ ప్యాక్స్ తో కనిపించబోతున్నాడు. కాబట్టే ఇలా తన లుక్ మార్చుకున్నాడనే ప్రచారం కూడా పెరిగింది. ఐతే రాజమౌలి అంత ఈజీగా తన హీరో లుక్ ని రీవిల్ చేస్తాడా..?ఖచ్చితంగా కాదు… ఎలాగూ మొన్న షూటింగ్ అయిన ఓ సీన్ లీకైంది కాబట్టి, మహేశ్ లుక్ ని ఇంకా దాచుంచలేమని, రాజమౌళినే లైట్ తీసుకున్నాడనే డిస్కర్షన్ కూడా పెరిగింది. కాని జక్కన్న లెక్కే వేరు. మొన్న లీకైన వీడియో సంగతి ఎలా ఉన్నా, ఈమధ్య సోషల్ మీడియాలో కనిపించిన మహేశ్ లుక్ ఏది సినిమాలో ఉండదట.
మహేశ్ బాబు ఏ ఫోటో చూసినా కళ్లకి కూలింగ్ గ్లాసెస్ కనిపిస్తున్నాయి. సో తన కళ్లు ఖచ్చితంగా బ్లూ ఐస్ లేదంటే గ్రీన్ కలర్ లో కనిపించబోతున్నాయనే ప్రచారం నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు లీకైన షూటింగ్ సీన్ వీడియోకి , మహేశ్ తన అభిమానులతో దిగిన ఫోటోకి చాల వ్యత్యసం ఉంది. సో ఇందులో ఇప్పటి వరకు కనిపించిన మహేశ్ లుక్ కి, సినిమాలో మేజర్ సీన్స్ లో కనిపించే సూపర్ స్టార్ లుక్ కి అస్సలు పోలిక ఉండదనే మాటే వినిపిస్తోంది.అంతేకాదు పాన్ వరల్డ్ మూవీ కాబట్టి, అందుకు తగ్గట్టు మహేశ్ బాబుని, ఇండో అమెరికన్ గా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం కూడా ఆమధ్య జరిగింది. అదే నిజమేమో, కాబట్టే మహేశ్ బాబు కళ్లు బయటి జనాలకు కనిపించకుండా ఇలా కవర్ చేస్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎస్ ఎస్ ఆర్ ఎంబీ అన్న టైటిల్ మీద కూడా ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. దానికి కూడా రాజమౌళి చెక్ పెట్టాడు
గరుడ, గోల్డ్, సూపర్ మహారాజా, బార్బారికా లాంటి టైటిల్స్ మీద బయట ప్రచారం ఎలా ఉన్నా, ఈ సినిమా వర్కింగ్ టైటిల్ మాత్రం ఎస్ ఎస్ ఆర్ ఎం బీగా రాజమౌళి వాడుతున్నాడు. ట్విట్టర్లో కూడా ఇలాంటి పేరే వాడుతున్నాడు. ఇదే సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ కి నచ్చలేదు. ఎస్ ఎస్ రాజమౌళి మహేశ్ బాబుకి షార్ట్ కట్ లా అది ఉండటం వాల్లకి కనెక్ట్ కావట్లేదనే ట్వీట్లు తెగ పెట్టడంతో, ఎస్ ఎస్ ఆర్ ఎంబీని కాస్త ఎస్ ఎస్ ఎంబీ అంటే, సూపర్ స్టార్ మహేశ్ బాబు 29 గా మార్చాడు రాజమౌళి. ఆ టైటిల్ తోనే తను ఒరిస్సా ప్రభుత్వానికి, పెట్టిన ట్వీట్ వైరలైంది. ఏదేమైనా, ఇటు వర్కింగ్ టైటిల్, మహేవ్ బాబు లుక్కు వీటిమీదే సోషల్ మీడియాలో భారీగా డిస్కర్షన్ కనిపిస్తోంది. ఇది కాకుండా సోషల్ మీడియాలో ఈ సినిమామీదే ప్రచారం జరగటానికి రీజన్, లీకులు. ఇంతవరకు లుక్కులు, సెట్లు మాత్రమే లీకయ్యాయి. దమ్ముంటే స్క్రిప్ట్ ని లీక్ చేయండంటూ ట్విట్టర్ తాలూకు ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ కి ట్వీట్ చేశాడో మహాత్ముడు.. దానికి అది మాత్రం కుదరదు భయ్యా అని ఏఐ టూల్ తేల్చింది. కాకపోతే, ఇది 2027, 2029 లో ఇలా రెండు భాగాలుగా మూవీ రాబోతోందని మాత్రం తేల్చింది.