హనుమంతుడు + బార్బారికుడు =5000 కోట్లు…
రాజమౌళి డైరెక్షన్ లో మహేశ్ బాబు చేస్తున్న సినిమా పక్కాగా మైథాలజీకి లింకైందని తేలిపోయింది. మొన్నటికి మొన్న లీకైన షూటింగ్ వీడియో వల్లే ఇదంతాజరిగింది.

రాజమౌళి డైరెక్షన్ లో మహేశ్ బాబు చేస్తున్న సినిమా పక్కాగా మైథాలజీకి లింకైందని తేలిపోయింది. మొన్నటికి మొన్న లీకైన షూటింగ్ వీడియో వల్లే ఇదంతాజరిగింది. ఆ లీకైన వీడియో లో హీరో చేతికి రామబాణం కనిపించటం వల్లే ఈ స్పెక్కులేషన్స్ పెరిగాయి. రాజమౌలి కూడా రామాయణం ఇన్స్ పిరేషన్ తోనే బాహుబలి రెండు బాగాలు తీశాడు. తర్వాత త్రిబుల్ ఆర్ లో ఇటు రామాయణం, అటు మహాభారతం ఇన్స్ పిరేషన్ ఉంది. పేరుకైతే అల్లూరి సీతారామరాజు, కొమరం భీం పాత్రలని వాడుకున్నా , బేసిక్ స్టోరీ మాత్రం రామయాణమహాభారతాల నుంచే తీసుకున్నాడు. కట్ చేస్తే ఇప్పుడు మళ్లీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ అయిన మహేశ్ బాబు సినిమాకు రామాయణమే కావాల్సి వచ్చింది. కాకపోతే ఇందులో కూడా త్రిబుల్ఆర్ లానే రామాయణ, మహాభారతాల్లో రెండు పాత్రలని కలిపేస్తున్నాడు… మొన్నీ మధ్య లీకైన వీడయోలో మహేశ్ బాబు ట్యాటూతో మ్యాటర్ రివీలైంది. బార్బారికా టైటిల్ రిజిస్ట్రేషన్ కూడా నిజమే అని తెలుస్తోంది.
సూపర్ స్టార్ మహేశ్ బాబుని పురానాల్లో ఇద్దరు గొప్ప బలశాలులుగా చూపించబోతున్నాడు డైరెక్టర్ రాజమౌళి. బేసిగ్గా తన పాన్ ఇండియా ప్రాజెక్టులన్నీంట్లో రామాయణ, మహాభారతాల ఇన్ ప్లూయెన్స్ కనిపిస్తుంది. అదే తన పాన్ వరల్డ్ మూవీలో కూడా రిఫ్లెక్ట్ కాబోతోంది. హనుమంతుడు, బార్బారికుడు ఇద్దరు కలిస్తే మహేశ్ బాబు.. ఇది పాన్ వరల్డ్ ప్రాజెక్టుకి రాజమౌళి ఎంచుకున్ ఫార్ములా
రామాయణంలో హనుమంతుడు, మహాభారతంలో బార్బారికుడు రెండు వేరు వేరు యుగాలు, రెండు వేరు వేరు పురాణాలు… అందులోనుంచి అతి శక్తిమంతమైన పాత్రల్ని మిక్స్ చేసి మ్యాజిక్ చేయబోతున్నాడు రాజమౌళి.
ఓసారి తన ప్రీవియస్ మూవీస్ బాహుబలి, త్రిబుల్ ఆర్ చూస్తే, ఇందులో పురాణాలే రిఫ్లెక్ట్ అవుతాయి. బాహుబలిలో హీరో రాముడిలా ఉంటే, కట్టప్ప, హనుమంతుడిగా, దేవసేన సీతగా ఇలా కనిపిస్తారు.. ఆ పాత్రల ప్రేరణ రామాయనం నుంచే అని ఈజీగా అర్ధమౌతుంది.
త్రిబుల్ ఆర్ లో కొమరం భీం, అల్లూరి సీతారామ రాజు పాత్రల్ని తీసుకున్నా, ఈరెండు కూడా రాముడు, భీముడినే రిప్లెక్ట్ చేసేలా ఉంటాయి. కూల్ గా ఉండే రామ్, దూసుకెళ్లే ఎమోషనల్ భీమ్ పాత్రలు రామాయణంలో రాముడు, మహాభారతంలో భీముడిని గుర్తు చేస్తాయి..
ఇలా మైథాలీజీ టచ్ లేకుండా లార్జర్ దేన్ లైఫ్ మూవీలు తీయని జక్కన్న, మహేశ్ బాబుతో అంతకుమించే సాహసం చేస్తున్నాడు. ఏకంగా దేవుడైన హనుమంతుడిని, ఘటోత్కజ కొడుకైన బార్బారికుడిని కలిపేసి ఓ హీరో పాత్రనే స్రుష్టించాడు. ఎలా చూసినా హీరో లుక్కు, లీకైన సీన్ లో విజువల్స్ స్టన్నింగా ఉండటమే కాదు, అందులో హీరో చేతిమీదున్న రామబాణం గుర్తు, తను హనుమంతుడి అంశ అనే మాటని నిజం చేస్తోంది. ఇక తన పేరు బార్బారిక్ గా పెట్టడం వెనక మహాభారతం ఇన్ ఫ్లూయెన్స్ ఉందని తెలుస్తోంది. సినిమా టైటిల్ కూడా బార్బారిక గా రిజిస్టర్ చేయటం వల్లే ఇలా అంతా కన్ క్లూజన్ కి వస్తున్నారు..
బాహుబలి, త్రిబుల్ ఆర్ లాంటి మూవీలతో ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళి సినిమాలకు గుర్తిందపు వచ్చింది కాబట్టే, డిస్నీ లాంటి సంస్థ రంగంలోకి దిగింది. 50000 థియేటర్స్ లో ఒకేసారి రిలీజ్ చేసేలా 5 వేల కోట్ల డీల్ సెట్ అయినట్టే ప్రచారం జరుగుతోంది. సో సెట్స్ పైకెళ్లిన వెంటనే పాన్ వరల్డ్ స్థాయిని ఈ సినిమా పట్టేసినట్టు తేలిపోతోంది. లీకులెలా ఉన్నా సినిమా స్తాయి పెరిగిపోతోంది.