350 కోట్ల గ్రాఫిక్స్… 200 కోట్ల సెట్స్… 300 కోట్ల స్టార్ కాస్ట్…

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 14, 2025 | 07:00 PMLast Updated on: Mar 14, 2025 | 7:00 PM

Intersting Facts About Rajamouli And Mahesh Babu Movie 3

సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి తీస్తున్న సినిమా వర్కింగ్ టైటిల్ ఏంటో ఇంతవరకు తేలలేదు. మహారాజా, గోల్డ్, గరుడు ఇవేవి టైటిల్స్ కాదన్నారు. ఒక్క బార్బారికుడు అన్న టైటిలే ఈ మధ్య కాస్ట్ గట్టిగా వినిపిస్తోంది.. అయితే మైథాలజీతో ఈ సినిమాకు లింక్ ఉందన్న ప్రచారం ఎలా ఉన్నా, ఇప్పడు మరో మ్యాటర్ లీకైంది. ఇందులో జపనీస్ ఖడ్గం, ఇండియన్ లింగం ఈ రెండూ కూడీ మేజర్ రోల్ ప్లే చేయబోతున్నాయట. ఇంతకి ఆ రెండీంటికి ఈ సినిమాతో ఉన్న లీంకేంటో ప్రెస్ మీట్ రోజు రివీల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది కాకుండా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 12 సినిమాల నుంచి ఒక్కో అంశాన్ని అఫీషియల్ గా కొనుక్కొని ఈ మూవీ తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంతకి ఆ డజర్ కాపీ రైట్స్ ఏంటి? ఎన్నడూ లేందీ ఇలా 12 సినిమాల నుంచి ఏఏ విషయాల కాపీ రైట్స్ రాజమౌళి టీం కొనేసుకుంది? టేకేలుక్

ఒడిష్సాలో మల్కన్ గిరీలో రాజమౌళి తీస్తున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు మూవీ షూటింగ్ జరుగుతోంది. పుష్ప2 తర్వాత అక్కడ ఇదే మరో భారీ ప్రాజెక్ట్ షూటింగ్ జరగటం అని, ఒడిషా డెప్యూటీ సీఎం పెట్టిన ట్వీట్ వైరలైంది. అక్కడ షూటింగ్ లోని సీన్లు, లొకేషన్లు ఇవేవి లీక్ కాకుండా ఫిల్మ్ టీంతో పాటు అక్కడి ప్రభుత్వం కూడా గట్టి జాగ్రత్తలే చేపట్టిందని తెలుస్తోంది.అంతవరకు ఓకే కాని, ఇందులో 12 సినిమాల లింకులు, బడ్జెట్ లో 850 కోట్ల ఖర్చులు ఇండియాని షేక్ చేసేలా ఉన్నాయి. కేవలం ఈమూవీలో విజువల్ ఎఫెక్ట్స్ కోసమే 350 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇక సెట్లకోసం 200 కోట్ల ఖర్చవుతాయని అంచనా వేశారట. 300 కోట్ల వరకు టోటల్ స్టార్ కాస్ట్, అండ్ క్రూ కే సమర్పించుకుంటున్నారని తెలుస్తోంది.

ఈ లెక్కలే షాక్ ఇస్తున్నాయంటే, ఈ మూవీ కోసం 12 సినిమాల నుంచి కాపీ రైట్స్ హక్కుల కొనిందట ఫిల్మ్ టీం. అందులో మొదటిది అందరికి తెలిసిన సినిమానే.. అది హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ క్రిస్టల్ స్కల్… ఈ సినిమాలో ఫైట్ సీన్ తో పాటు, ఇండియాన జోన్స్ టెంపుల్ ఆఫ్ డూమ్ కాపీ రైట్స్ కూడా ఫిల్మ్ టీం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.అసలే ఈ మూవీలో హీరో పాత్ర మన పురాణాల్లో హనుమంతుడు, బార్బారికుడు ఇలా ఇద్దరిని కలిపినట్టుంటుందనే ప్రచారం ఈమధ్య మొదలైంది. దానికి తోడు ఇందులో జపాన్ ఖడ్గాన్ని, ఓ శివలింగాన్ని ప్రత్యేకంగా చూపించబోతున్నారట. సో ఇవి మిస్ అవటమో, ఇలాంటివి ఆఫ్రికాలో ఎక్కడో ఉండటం జరుగుతుందని, వాటికోసం సాహసం చేసేందుకే హీరో బయలు దేరతాడనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న రైటర్స్ అంచనా.

అంతేకాదు మొన్న లీకైన షూటింగ్ సీన్ చూసినా అదే నిజమనిపించేలా ఉంది. ఎందుకంటే, వీల్ చైర్లో రిచ్ పర్సన్ దగ్గర హీరో మోకరిల్లితే, తనకేదో జాబ్ అప్పచెప్పినట్టు ఆ సీన్ కనిపిస్తోంది. ఇది హాలీవుడ్ మూవీ ఎక్స్ మెన్ లో ప్రొఫేసర్ ని పోలిన పాత్రంటున్నారు.
ఆల్రెడీ సౌత్ ఆఫ్రికా నవలా రచయిత రాసిన రెండు పుస్తకాల రైట్స్ కొన్న టీం, ఎక్స్ మెన్ నుంచి పాత్ర తీసుకున్నందుకు ఆ రైట్స్ కొనేసిందట. ఆఫ్రికా అడవుల నేపథ్యం, జపనీస్ కత్తి, ఇండియా శివలింగం, ఇండియాన జోన్స్ ప్రేరణతో సినిమా స్ట్రక్చర్, అందులో పాత్రకి మన పురాణాలని జోడించి ఫైనల్ గా సినిమా ఓరేంజ్ లోరాబోతోందట. ఇవన్నీ ఇండస్ట్రీలో గోస్ట్ రైటర్స్ మధ్య డిస్కర్షన్ తో బయటికి వినిపిస్తున్న ప్రచారాలే… కాని ఇప్పటి వరకు అలా వచ్చిన మాటలే నిజమయ్యాయి.. కాబట్టే రాజమౌళి సీక్రెట్ గా సినీ సునామే క్రియేట్ చేసేలా ఉన్నాడనిపిస్తోంది.