50,000 థియేటర్లు… 5000 కోట్ల డీల్ .. రంగంలోకి కుబేరులు..
సూపర్ స్టార్ మహేశ్ బాబులో రాజమౌలి తీస్తున్న సినిమాలకు లీకులు షాకులిస్తూనే ఉన్నాయి. ఇలాంటి టైంలో 5000 కోట్ల డీల్ సెట్ అయ్యింది.

సూపర్ స్టార్ మహేశ్ బాబులో రాజమౌలి తీస్తున్న సినిమాలకు లీకులు షాకులిస్తూనే ఉన్నాయి. ఇలాంటి టైంలో 5000 కోట్ల డీల్ సెట్ అయ్యింది. ఆల్ మోస్ట్ ఇది కన్ఫామ్ అయినట్టే తెలుస్తోంది. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 5 బడా బడా కంపెనీలు రాజమౌలి సినిమా కోసం పోటీ పడ్డాయి. పడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను మినిమమ్ 30 వేల థియేటర్స్ లో రిలీజ్ చేసే సత్తా ఉన్న సంస్థ రాజమౌళిని కలవటం వల్లే, ఈ ప్రచారం ఊపందుకుంది. ఎగ్జాక్ట్ గా ఇలా ఆ కుబేరులు రాజమౌైళిని కలిసిన కొన్ని గంటల్లోనే ఈసినిమా సీన్ లీకై ఇంటర్నెట్ లో దర్శనమిచ్చింది. ఓ సాంగో లేదంటే టీజరో రిలీజ్ చేస్తే యూ ట్యూబ్ లో ఎన్ని వ్యూస్ వస్తాయో… అంతకు మించి మిలియన్ల కొద్ది వ్యూస్ ఈ లీకైన వీడియోకొస్తున్నాయి… ఇలాంటి టైంలో హాలీవుడ్ నుంచి పెద్ద కటౌట్లు రంగంలోకి దిగి, 1500 కోట్ల సినిమాను 5 వేల కోట్ల మూవీగా మార్చేసున్నారు…
ఒక ఇండియన్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 50 వేల థియేటర్స్ లో రిలీజ్ అవటం ఎప్పుడైనా చూశామా? హాలీవుడ్ మూవీస్ మాత్రం 10 వేల నుంచి 40 వేల థియేటర్స్ లో రిలీజ్ అవటం కామన్ గా కనిపిస్తుంది.అలా వచ్చిన అవతార్ 2 మూవీ 30 వేల కోట్ల వరకు రాబట్టింది. చైనాలో అయితే ఏకంగా లక్షా ముప్పై వేల థియేటర్స్ ఉన్నాయి.కాబట్టి అక్కడ ఏ సినిమా వచ్చినా లక్షల థియేటర్స్ లోరిలీజ్ అవుతుంది. అలా అని అక్కడున్న అన్ని థియేటర్స్ లో విదేశి సినిమాలు ఆడే ఛాన్స్ లేదట. 90శాతం థియేటర్స్ లో చైనీస్ మూవీలే ఆడాలనేది రూల్ కాబట్టి, అక్కడ హాలీవుడ్ దాడి లక్షల థియేటర్స్ లో కనిపించలేదు…
ఈ సంగతి అటుంచితే, సూపర్ స్టార్ మహేశ్ బాబు తో రాజమౌలి తీసే సినిమా ప్రపంచ వ్యాప్తంగా 50 వేల థియేటర్స్ లోరిలీజ్ కాబోతోందట. దీనికి కారనం రంగంలోకి డిస్నీ సంస్థ, అలానే సోనీ సంస్థ దిగటమే…హాలీవుడ్ మూవీలు నిర్మించే డిస్నీ సంస్థకి ప్రపంచ వ్యాప్తంగా 10 వేల థియేటర్స్ ఉన్నాయి. 30 వేల స్క్రీన్స్ తో కాంట్రాక్ట్ ఉంది. కాబట్టే ఈ సంస్థ సూపర్ స్టార్ మూవీ టీం ని కలిసింది. ఇండియా మొత్తం చాలా ఈగర్ గా వేయిట్ చేస్తున్న సినిమాతో డీల్ సెట్ చేసుకుంటే, ఇక్కడ, అలానే ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీని భారీగా రిలీజ్ చేయొచ్చనేది ఇటు డిస్నీ, అటు రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు.
సోనీ సంస్థకి కూడా 30 వేల థియేటర్స్ లో లింకుంది. అది కూడా భారీ ఎత్తున థియేట్రికల్ రైట్స్ కి ఆఫర్ చేస్తోందట. 3000 కోట్లు ఈ మూవీ కి చెల్లించేందుకు సోనీ సంస్థ రెడీ అయితే, డిస్నీప్ సంస్థ ఏకంగా 5 వేల కోట్ల డీల్ ఆఫర్ ఇచ్చిందట. అదే నిజమైతే1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కే ఈ సినిమా రిలీజ్ కి ముందే 5 వేల కోట్లు రాబట్టినట్టౌతుంది.అది కూడా థియేట్రికల్ రైట్స్ రూపంలోనే… ఇంకా డిజిటల్, శాటిలైట్, ఆడియో రైట్స్ అలానే ఉన్నాయి. సో డిస్నీ ఆఫరే బాగుందని రాజమౌళి ఫైనల్ చేయటం, నిర్మాత కూడా ఆల్ మోస్ట్ సైన్ చేసేందుకు సిద్దపడటం జరిగింది. కాని సేమ్ డే ఈ మూవీ సీన్ వీడియో ఇంటర్నెట్ లో వైరలైంది. సో ఒక గుడ్ న్యూస్ వచ్చే రోజే ఒక హెవీ డ్యామేజ్ జరగటంతో జాగ్రత్తలు పెంచుతున్నాడు రాజమౌళి. మరి డిస్నీ డీల్ సెట్ అయ్యిందో లేదో తేలలేదు. ఇవన్నీ డిటేల్స్ మాత్రం ఉగాది తర్వాత ప్రెస్ మీట్ పెట్టీ మరి ఎనౌన్స్ చేయబోతున్నాడు రాజమౌళి.
సో హనుమంతుడిని ప్రేరణగా తీసుకుని హీరో క్యారెక్టర్ డిజైన్ చేసిన రాజమౌలి, ఈ సినిమాకు కనక 30 వేల స్క్రీన్స్ నుంచి 50 వేలస్క్రీన్స్ లో రిలీజ్ చేస్తే అదో ప్రపంచ రికార్డవుతుంది. హాలీవుడ్ సినిమాలనే మించేలా ఈమూవీని రిలీజ్ చేసనట్టౌతుంది. ఇప్పటి వరకు ఇండియాలో మాత్రం 18500 స్క్రిన్స్ లో రిలీజైన రికార్డు బన్నీ మూవీ పుష్ప2 కి దక్కింది. దానికి రెండు రెట్లకంటే ఎక్కువ థియేటర్స్ లో మహేశ బాబు మూవీ రిలీజ్ అయ్యేలా కనిపిస్తోంది.