మహేశ్ సినిమాతో ఆస్కార్… గురి పెడుతున్నాడా…?

సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి తీస్తున్న సినిమా ఈ రెండు వారాలుగా వార్తల్లో ఉంటూనే ఉంది. ఐతే లీకులు...లేదంటే కొత్త లొకేషన్లు.. ఇప్పడు ఆస్కార్ హంగామా కూడా మహేశ్ మూవీ వార్తల్లో నిలిచేలా చేస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 7, 2025 | 06:30 PMLast Updated on: Mar 07, 2025 | 6:30 PM

Intersting Facts About Rajamouli And Mahesh Movies 2

సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి తీస్తున్న సినిమా ఈ రెండు వారాలుగా వార్తల్లో ఉంటూనే ఉంది. ఐతే లీకులు…లేదంటే కొత్త లొకేషన్లు.. ఇప్పడు ఆస్కార్ హంగామా కూడా మహేశ్ మూవీ వార్తల్లో నిలిచేలా చేస్తోంది. కారణం ఆస్కార్ అవార్డుల మోత మోగించిన సినిమాకే, దాని డైరెక్టర్ ని రాజమౌళి తెగ పొగిడేశాడు.. ఇది కూడా ఓరకంగా పాన్ వరల్డ్ లెవల్లో తనని తాను మార్కెట్ చేసుకోవటం…లేదంటే తన సినిమాను మార్కెట్ చేసుకోవటమే అంటున్నారు. అది అటుంచితే, త్రిబుల్ ఆర్ తో ఆల్రెడీ ఆస్కార్ కి మన తెలుగు సినిమా దూరం కాదని ప్రూవ్ చేశాడు రాజమౌలి. ఇక్కడే మరి మహేశ్ బాబు మూవీకి మళ్లీ ఆస్కార్ ని ఆశించ వచ్చా, అంటే ఏకంగా ఎనిమిది కేటగిరీల్లో అటు వైపు ఆలోచనలతోనే అడుగుపెడుతున్నాడట జక్కన్న.. ఓ సినిమా తీసే టైంలోనే ఆస్కార్ ని ఆశించటం కాస్తి అత్యాశే అవుతుంది.. కాని మాంసం రుచి మరిగిన పులికి, నాన్ వెజ్ ని పరిచయం చేయక్కర్లేదు.. ఆస్కార్ రుచి చూసిన జక్కన్న టీం కి, ఆ అవార్డు మళ్లీ టార్గెట్ కాకుండా ఉండదు… సో ఆస్కార్ కోసం అస్సాం, ఒడిషాలో రాజమౌళి ఏదో గట్టిగానే వెతుకుతున్నాడా? చూసేయండి.

సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి తీసే సినిమా తాలూకు లుక్ మొన్న లీకై వైరలైంది. తర్వాత అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్ పిక్స్ బయటికి లీకయ్యాయి. కట్ చేస్తే కెన్యాలో సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ప్లాన్ చేసిన రాజమౌలి టీం, సడన్ గా ఒడిషాలో ల్యాండ్ అయ్యింది. ఇలా ప్రతీ వారం ఈ సినిమా తాలూకు లీకులు వార్తలుగా మారుతున్నాయి. వైరలౌతున్నాయి.ఇలాంటి టైంలో రాజమౌలి ట్వీట్ వైరలైంది. రీసెంట్ గా అనోరా మూవీకి నాలుగు ఆస్కార్ అవార్డులు రావటంతో, డైరెక్టర్ ని టోటల్ టీం ని మెచ్చుకుంటూ ట్వీట్ చేశాడు రాజమౌళి. ఇదే ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక్కడే తన మీద నెగెటీవ్ ట్రోలింగ్, పాజిటివ్ ట్రోలింగ్ రెండూ జరిగాయి. అదే షాకింగ్ గాఉంది

నెగెటీవ్ ట్రోలింగ్ విషయానికొస్తే, అనోరా టీంకి ఆస్కార్ అవార్డుల పంట పండితే, అసలు రాజమౌళి ఎవరని ట్వీట్ చేస్తాడు.. తనేమైనా హాలీవుడ్ డైరెక్టరా? లేదంటే వరల్డ్ వైడ్ గా ఫోకస్ అయిన దర్శకుడా..? లేదంటే తనని తాను ఎక్కువ ఊహించుకుంటున్నాడా? ఇవి నెగెటీవ్ కామెంట్ల రూపంలో జరుగుతున్న ట్రోలింగ్స్..వీటికే కౌంటర్ గా ఇండియన్ సినిమా స్టాండర్ట్స్ ని మార్చిన దర్శకుడు రాజమౌళి. అంతేకాదు మనసినిమాకు త్రిబుల్ ఆర్ తో గ్లోబల్ మార్కెట్ కి డోర్లు తీసిన వ్యక్తి. 140 కోట్ల భారతీయుల ద్రుష్టిలో గొప్ప దర్శకుడు.. ఇది చాలదా ? హాలీవుడ్ మూవీలు తీస్తేనో ఇంకేదో చేస్తోనో తన ట్వీట్ కి విలువ పెరుగుతుందా అన్న కౌంటర్లు పెరుగుతున్నాయి.

ఇక పాజిటివ్ ట్రోలింగ్ విషయానికొస్తే, మరో ఆస్కార్ ఎప్పుడనే ప్రశ్నలతో సూపర్ స్టార్ మూవీని, రాజమౌళిని సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తున్నారు. బాహుబలి తో సౌత్, నార్త్ మధ్య అడ్డుగోడల్ని కూల్చేయటమే కాదు, మన మూవ సౌండ్ రష్యా, జర్మనీ, జపాన్ వరకు వినిపించేలా చేశాడు రాజమౌలి. తర్వాత త్రిబుల్ ఆర్ తో ఆస్కార్ కూడా సొంతమయ్యేలా చేశాడు. సో స్టెప్ బై స్టెప్ పాన్ ఇండియా, గ్లోబల్ మార్కెట్, ఆతర్వాత ఆస్కార్ రేసులోకి తెలుగు వెలుగులు పెరిగాయి… కాబట్టి ఇక నెక్ట్స్ మహేశ్ మూవీతో ఆస్కార్ రేసులో దూసుకెళ్లటమేనా? ఇది ట్రోలర్స్ నుంచి పాజిటివ్ గా పెరిగిన ఎక్స్ పెక్టేషన్స్.ఐతే నెట్ ఫ్లిక్స్ సంస్థాదినేథ, అవతార్ డైరెక్టర్ జేమ్స్ కామేరున్ తోపాటు స్టీవెన్ స్పిల్ బర్గ్ లాంటి హాలీవుడ్ దిగ్గజాలకు నచ్చేశాడు రాజమౌలి. అలాంటి తను సూపర్ స్టార్ మహేశ్ తో తీసే సినిమాతో నిజంగానే ఆస్కార్ ని టార్గెట్ చేస్తున్నట్టే ఉన్నాడు. సినిమాటోగ్రఫి, గ్రాఫిక్స్, మ్యూజిక్, కాస్ట్యూమ్స్, బెస్ట్ ఫారన్ ఫిల్మ్, బెస్ట్ ఫిల్మ్, స్క్రీన్ ప్లేస్, డైరెక్షన్ మొత్తంగా 8 కేటగిరీల్లో సినిమా నెక్ట్స్ లెవల్ లో ఉండేలా స్టాండర్ట్స్ మేయింటేన్ చేస్తున్నాడు

ఓ తెలుగు సినిమా అమెరికన్స్, యూరోపియన్స్ ఇలా వరల్డ్ మార్కెట్ లో దూసుకెళ్లాలంటే ఆస్కార్, గోల్డెన్ గ్లోబుల్లో మన పేరుమారుమోగాలి… అలా జరగాలంటే ఆరేంజ్ లో అవార్డుల పంటపండాలి.. సో ఎప్పుడూ కమర్శియల్ గా కలెక్సన్స్ మీద ఫోకస్ చేసే జక్కన్న, ఈసారి అవార్డులు కూడా తన టార్గెట్ లో పెట్టుకున్నాడట. నిజంగానే ఆస్కార్ లాంటి అవార్డులు సొంతమైతేనే, మన సినిమా గొప్పతనాన్ని గ్లోబల్ మార్కెట్ లో ఫోకస్ చేసినట్టవుతుంది. అందుకే ఆస్కార్ రేసులో గెలిచిన వాళ్లని విష్ చేయటం, ప్రెస్ మీట్ కి జేమ్స్ కామెరున్ ని తీసుకొచ్చే ప్రయత్నం, ఇవన్నీ తన మార్కెటింగ్ స్ట్రాటజీనే అనంటున్నారు.