అమ్మ దొంగ… రాజమౌళికే ఝలక్..? సూపర్ మహేశా…?
సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి తీస్తున్న మూవీ పేరు ఏదైనా కావొచ్చు.. కాకపోతే ప్రస్తుతానికి గోల్డ్, మహారాజా ఈ రెండు పేర్లే టైటిల్స్ గా ప్రచారంలో ఉన్నాయి. ఐతే కొత్త షాకింగ్ అప్ డేట్ ఏంటంటే ఇందులో సలార్ సైడ్ హీరో ఫ్రుథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నాడని తేలింది. మొన్నటి వరకు తను మహేశ్ బాబు మూవీలో సైడ్ విలన్ అని ప్రచారం జరిగింది.

సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి తీస్తున్న మూవీ పేరు ఏదైనా కావొచ్చు.. కాకపోతే ప్రస్తుతానికి గోల్డ్, మహారాజా ఈ రెండు పేర్లే టైటిల్స్ గా ప్రచారంలో ఉన్నాయి. ఐతే కొత్త షాకింగ్ అప్ డేట్ ఏంటంటే ఇందులో సలార్ సైడ్ హీరో ఫ్రుథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నాడని తేలింది. మొన్నటి వరకు తను మహేశ్ బాబు మూవీలో సైడ్ విలన్ అని ప్రచారం జరిగింది. తను కూడా అలాంటిదేం లేదన్నాడు. కేవలం ఓ డిస్కర్షన్ అయితే జరిగిందన్నాడు. కట్ చేస్తే ఇప్పుడు చెప్పకనే చెప్పినట్టు, తన ఇన్ స్టా పోస్టుతో తేల్చాడు. తను రాజమౌళి పేరుకాని, మహేశ్ బాబు సినిమా గురించి కాని ఎక్కడా ఎక్స్ ప్రెస్ చేయలేదు. కాని మ్యాటర్ చూస్తే తను దేని గురించిచెబుతుున్నాడో తేలిపోయింది. సరే తను ఇందులో నటిస్తున్నట్టు తేల్చాడనే అనుకుందాం, అదే నిజమైతే, ఇది రెండు నెలలుగా జరుగుతున్న ప్రచారమే.. కాబట్టి ఇందులో పెద్ద వింతేంలేదు.. కాకపోతే ఇక్కడ వింతేంటంటే సూపర్ స్టార్ మహేశ్ బాబు బిరుదు ప్రపంచ వ్యాప్తంగా ఫోకస్ కాబోతోంది. అది కూడా ఈ మూవీతోనే… ఎందుకంటే ఫ్రుథ్వీరాజ్ సుకుమారన్ పెట్టిన పోస్ట్ లో పరోక్షంగా మహేశ్ బాబు సినిమా గురించి మ్యాటర్ లీకైంది… సూపర్ పేరుతో ఈ సినిమాకున్న లింకు తేలిపోయింది…అదోంటో చూసేయండి.
సూపర్ స్టార్ మహేశ్ బాబు ని ప్రపంచం సూపర్ గా పిలిస్తే ఎలా ఉంటుంది. అదే జరిగేలా ఉంది. సూపర్ అన్న పదం రాజమౌళి తీస్తున్న మూవీకి పెట్టేలా ఉన్నారు. అంటే సూపర్ అనేది సినిమా టైటిల్ కాదు.. కాని ఆ పదం మాత్రం టైటిల్ లో ఉండేలా ఉంది. ఇప్పటి వరకు ఈ సినిమా టైటిల్ గోల్డ్ , లేదంటే మహారాజా అని ప్రచారం చేశారు. కాని సూపర్ గోల్డ్ లేదంటే సూపర్ మహారాజా నే టైటిల్ అయ్యేలా ఉందనే ప్రచారం పెరిగింది
దీనికి కారణం మలయాళం స్టార్ ఫ్రుధ్వీ రాజ్ సుకుమారన్ తను మొన్నటి వరకు రాజమౌలి మూవీలో నటించట్లేదన్నాడు. అసలు ఏది ఫైనల్ కాలేదన్నాడు. కట్ చేస్తే తను నటుడిగా ఓ మూవీ చేయబోతున్నందుకు నెర్వస్ ఫీల్ అవుతున్నాడన్నాడు. దీనికి ముందు డైరెక్టర్ గా తను తీయాల్సిన సినిమా తీసేశాడని చెప్పాడు. మళ్లీ నటుడిగా బిజీ కావాల్సిన టైం వచ్చిందన్నాడు. తన ప్రాంతానికి చెందని భాషలో తనకి లాంగ్ లెంథ్ డైలాగ్స్ ఉన్నాయన్నాడు.ఇలా ఇన్ స్టా గ్రామ్ లో కోడింగ్ లాంగ్వేజ్ లోనే రాజమౌళి, మహేశ్ బాబు మూవీ ని కన్ఫామ్ చేశాడు. కాకపోతే డైరెక్ట్ గా ఏది తేల్చలేదు. కారణం రాజమౌళి తన మూవీకి సంబంధించిన ఏ అంశం బయటికి చెప్పకూడదనే నాన్ డిస్ క్లోజర్ అగ్రిమెంట్ మీద అందరూ సైన్ చేయటమే..
నిజానికి ఫ్రుథ్వీ రాజ్ సుకుమారన్ నటించబోయేది మరే మూవీ కూడా అయ్యుండొచ్చు. కాని తమిల్, కన్నడ, హిందీ భాషల్లో తను నటించాడు. ఎన్నడూ కంగారు పడుతున్నానని చెప్పలేదు. తెలుగులో కూడా సలార్ మూవీ చేశాడు. కాబట్టి తను ఆల్రెడీ సౌత్, నార్త్ మూవీల్లో నటించాక కూడా తనది కాని మరో భాషలో నటించటానికి నెర్వస్ అవుతున్నాడంటే అర్ధం, అది ఖచ్చితంగా రాజమౌళి మూవీనే.. తను రాజమౌళిని అంతగా ఆరాధిస్తాడు.. అలాంటి దర్శకుడి మేకింగ్ లో లెంధీ సీన్స్ నటించ బోతున్నాడు కాబట్టే ఇంతగా నెర్వస్ అవుతున్నాడు. మరి దీనికి సూపర్ స్టార్ మహేశ్ బాబు బిరుదు లీకేజికి సంబంధం ఏంటి? అక్కడే కథలో ట్విస్ట్ ఉంది. ఈ పోస్ట్ తర్వాత ఫ్రుథ్విరాజ్ పెట్టినమరో పోస్ట్ లో సూపర్ … సూపర్ … అని ఉంది. మళ్లీ దాన్ని ఎందుకో డిలీట్ చేశాడు.
అంటే సూపర్ అనే పదం ఏదో రకంగా సినిమా టైటిల్ కి లింక్ అయ్యుంటుందనే అంచనాలు పెరిగాయి. లేంది అలాంటి స్టేట్ మెంట్ ని ఫ్రుథ్విరాజ్ సుకుమారన్ పోస్ట్ చేయడు… మ్యాటర్ ఏదైనా రాజమౌలి సినిమా తాలూకూ ఏ ఇన్ ఫర్ మేషన్ ని అఫీషియల్ గా చెప్పకున్నా, అన్ అఫిషియల్ గా పరోక్షంగా ఇలా లీక్ చేసినట్టున్నాడు ఫ్రుథ్విరాజ్… అంతా తను ఈ ప్రాజెక్ట్ చేస్తున్న ఖుషీలోనే అన్న మాటలు వినిపిస్తున్నాయి.