ఇదెక్కడి లొల్లి… 1000 కోట్ల సినిమాకు, ఇదేం లోపం…
సూపర్ స్టార్ మహేశ్ బాబు తో రాజమౌళి తీస్తున్న సినిమాకు రెండు పెద్ద సమస్యలొచ్చాయి. ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ మొదలైంది. చిన్న బ్రేక్ తీసుకుని వెళ్లిన ప్రియాంక చోప్ర మళ్లీ సెట్లో అడుగుపెట్టబోతోంది.

సూపర్ స్టార్ మహేశ్ బాబు తో రాజమౌళి తీస్తున్న సినిమాకు రెండు పెద్ద సమస్యలొచ్చాయి. ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ మొదలైంది. చిన్న బ్రేక్ తీసుకుని వెళ్లిన ప్రియాంక చోప్ర మళ్లీ సెట్లో అడుగుపెట్టబోతోంది. సెకండ్ షెడ్యూల్ కెన్యా అడవుల్లో, అది కూడా ఏకంగా 25 రోజులు గ్యాప్ లేకుండా ప్లాన్ చేశారు. కాని త్రిబుల్ఆర్ మూవీ టైంలో రాజమౌళికి సెట్ అయిన సమస్య, ఇప్పుడు సెట్ కావట్లేదు. మొదట్లో ఇండోనేషియా లేడీ అన్నారు, తర్వాత సీన్ లోకి ప్రియాంక వచ్చింది. జపాన్, చైనా, కొరియా ఇలా ఈ దేశాల నుంచి విలన్ తెస్తారన్నారు. ఇంతలో సీన్ లోకి నానా పటేకర్ వచ్చాడంటున్నారు. తను తండ్రా? విలనా? అన్న డౌట్లకు బ్రేక్ వేయకుండానే, షూటింగ్ తో బిజీ అయ్యారు. ఎంతగా రాజమౌళి, అండ్ కో ఈ సినిమా మీద వర్క్ చేసినా టైటిల్ కాదుకదా, కనీసం వర్కింగ్ టైటిల్ కూడా ఎనౌన్స్ చేయలేకపోతున్నారు. గోల్డ్, మహారాజా ఇవన్నీ అయిపోయాయి.. ఇప్పుడు మరో టైటిల్ కోసం ట్రై చేస్తూనే, వర్కింగ్ టైటిల్ పెట్టేందుకు ధైర్యం సరిపోవట్లేదట. ఎందుకు? హావేలుక్
సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌలి సినిమా అయితే, స్టార్ట్ చేశాడు.. కాని దానికి వర్కింగ్ టైటిల్ లేదు. అసలు టైటిల్ ఎలాగూ లేదు, కనీసం వర్కింగ్ టైటిలైనా ఉంటుందా అంటే, అది కూడా దొరకట్లేదట. త్రిబుల్ ఆర్ మూవీ తీసేప్పుడు రాజమౌలి, రామారావు, రామ్ చరణ్ ముగ్గురి పేర్లలో మొదటి అక్షరం ఆర్ఆర్ ఆర్ అని పెట్టారు. ఆ వర్కింగ్ టైటిల్ నే చివరికి రైర్ రోర్ రివోల్ట్ గా మార్చారు. కాబట్టి త్రిబుల్ ఆర్ తీస్తున్నంతసేపు, లేదా రిలీజ్ టైంలో టైటిల్ సమస్యరాలేదు
కాని మహేశ్ బాబు మూవీ లాంచైంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్లో ఐదు రోజులు షూట్ చేశారు. కాని కనీసం వర్కింట్ టైటిల్ కూడా ఎనౌన్స్ చేయలేదు. మొదట్లో ఈమూవీ పేరు మహారాజా అని ప్రచారం జరిగింది. తర్వాత హాలీవుడ్ మార్కెట్ కోసం గోల్డ్ గా మార్చారన్నారు. కానీ ఇవేవి పాన్ వరల్డ్ మూవీకి సెట్టయ్యే రేంజ్ ఉన్న టైటిల్స్ కాదు
మరీ రొటీన్ ఓల్డ్ టైటిల్స్ లా కనిపిస్తున్నాయన్నారు. గరుడ టైటిల్ కూడా వినిపించింది. కాని అది కూడా గాలివార్తే అని తేలింది. విచిత్రం ఏంటంటే ఇందులో మెరవాళ్లిన ఇండోనేషియన్ బ్యూటీ చెల్సియా ప్రస్థావన లేదు. ఈలోపు ప్రియాంక చోప్రా రాక ఆగలేదు. ఇంతలో మరాఠీ నటుడు నానా పటేకర్ వచ్చాడు. తను హీరో తండ్రి పాత్రని, కాదు విలనంటూ ప్రచారం షురూ అయ్యింది
1000 కోట్ల బడ్జెట్ తో ఏడాదిగా స్క్రిప్ట్ వర్క్ ప్లాన్ చేస్తున్నారు. అలాంటి మూవీకి సింగిల్ టైటిల్ దొరకట్లేదా. చాలావరకు జనరేషన్ అని అర్ధం వచ్చే టైటిల్ నే సెర్చ్ చేస్తున్నారట. హాలీవుడ్ మూవీ అవతార్ ఎలా అయితే ఆ సినిమాకు సెట్ అయ్యిందో, అలా సంస్క్రుత పదాన్ని కూడా పరీశీలిస్తున్నట్టు తెలుస్తోంది. విచిత్రంగా వ్యోమనాట్ పేరు కూడా వినిపిస్తోంది.
అంతరిక్ష యాత్రికులని ఆస్ట్రోనాట్ అని అమెరికన్స్ అంటే, కాస్మోనాట్స్ అని రష్యన్స్ అంటారు. అలా మన భారతీయు అంతరిక్ష యాత్రికులని వ్యోమనాట్ అనటం మొదలైంది. సో ఆ పదాన్నే టైటిల్ గా పెడితే కథకి, సెట్ అవుతుందనే డిస్కర్షన్ కూడా జరిగిందట. కాని ఇదేం స్పేస్ మూవీ కాదు. కాని అడవిలో అంతరిక్ష అద్భుతాల వల్ల ఆ టైటిట్ కూడా సెట్ అవ్వొచ్చనుకుంటున్నారు. మొత్తానికి ఈ మూవీకి విలన్ సమస్య, టైటిల్ సమస్యకు మాత్రం శుభం కార్డు పడట్లేదు.