ఇది అదే… 7000 కోట్ల హాలీవుడ్ మూవీతో రిస్క్..
సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌలి తీస్తున్న సినిమా అప్ డేట్, లీకు రూపంలో షాక్ ఇస్తోంది. ఈ సినిమా కంటెంట్ కాని, మరే ఇతర విషయం కాని లీక్ కాకుండా, నో డిస్ క్లోజర్ అగ్రిమెంట్ చేయించాడు రాజమౌలి.

సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌలి తీస్తున్న సినిమా అప్ డేట్, లీకు రూపంలో షాక్ ఇస్తోంది. ఈ సినిమా కంటెంట్ కాని, మరే ఇతర విషయం కాని లీక్ కాకుండా, నో డిస్ క్లోజర్ అగ్రిమెంట్ చేయించాడు రాజమౌలి. కాబట్టి లీకులకు ఛాన్సేలేదనుకున్నారు. కాని సెట్లో జరిగిన తప్పుతో మ్యాటర్ లీకైనట్టు తెలుస్తోంది. ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరిగి వారాలు గడుస్తోంది. అలాంటి టైంలో, ఇప్పుడు ఇందులో ప్రియాంక చోప్రా ఎలాంటి పాత్ర వేస్తుందో తేలిపోయింది. అంతేకాదు హాలీవుడ్ మూవీ రైట్స్ ని కూడా ఫిల్మ్ టీం కొనేసిందని తెలుస్తోంది. ఆల్రెడీ ఆఫ్రికన్ రైటర్ తాలూకు రెండు నవల రైట్స్ కొన్న ఫిల్మ్ టీం మరో అడుగు ముందుకేసింది. ఏకంగా జురాసిక్ పార్క్ క్రియేటర్ స్టీవెన్ స్పిల్ బర్గ్ తీసిన మూవీ రైట్స్ కూడా కొనేసిందట. పూర్తిగా కాదు కాని, స్టోరీ అండ్ క్యారెక్టర్ తాలూకు రైట్స్ మాత్రం కొన్నారని తెలుస్తోంది. ఏకంగా ఏడు వేల కోట్లు రాబట్టిన హాలీవుడ్ సినిమా కథనే రాజమౌళి కొనేస్తే, కొత్తగా ఏం చెబుతాడు..? హాలీవుడ్ జనాలకు మళ్లీ కొత్తగా ఏం చూపిస్తాడు..? హావేలుక్
మహారాజా, గోల్డ్, గరుడ ఇవేవి ఇంకా మహేశ్ సినిమాకు ఫైనల్ కాలేదు. టైటిల్ వేట కొనసాగుతూనే ఉంది. అలాంటి టైం లో ఇప్పుడు రెండు హాట్ టాపిక్స్ లీకుల రూపంలో షాక్ ఇస్తున్నాయి. అందులో ఒకటి హీరోయిన్ అనుకున్న ప్రియాంక చోప్రా తను హీరోయిన్ కాదని తేలింది. పూర్తిగా నెగెటీవ్ రోల్ అంటే లేడీ విలన్ గా తన పాత్ర కన్ఫామ్ అయ్యింది.
నాన్ డిస్ క్లోజర్ అగ్రిమెంట్ మీద నటులు, స్టాప్ సైన్ చేశాక, అసలు సినిమా తాలూకు ఏ అంశం లీక్ కాకూడదు. కాని సెట్ అసిస్టెంట్ లు కొంపముంచేసినట్టున్నారు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ 5 రోజులు షూట్ చేసి, బ్రేక్ వేశారు. అప్పుడు వేసిన సెట్, దానికోసం పనిచేసిన బ్యాచ్ ఇందులో ప్రియాంక చోప్రాది నెగెటీవ్ రోలని బయటికి బై మిస్టేక్ లో రివీల్ చేశారట.ఆ నోటా ఈనోటా ఈ మాట స్ప్రెట్ అయ్యింది. అయినా అదేం పెద్ద అప్ డేట్ అనుకోవటానికి లేదు. కాని ఈ మ్యాటర్ లీకవ్వటం వల్ల మరో ప్రచారం నిజమని తేలింది. అదే హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ క్రిస్టల్ స్కల్ కథ రైట్స్ ని నిజంగానే రాజమౌళి టీం కొనేసిందని..
జురాసిక్ పార్క్ లాంటి సెన్సేషనల్ మూవీలు తీసిన హాలీవుడ్ డైరెక్టర్ స్టీవెన్ స్పిల్ బర్క్, డైరెక్షన్ లో 17 ఏళ్ల క్రితం వచ్చిందో సినిమా. అదే ఇండియానా జోన్స్ క్రిస్టల్ స్కల్. అందులో హిట్లర్ ఫాలోవర్ కమ్, నాజీ లేడీగా కనిపిస్తుంది లేడీ విలన్. అచ్చంగా ఆపాత్ర ప్రేరణతోనే ప్రియాంక చోప్రా పాత్ర డిజైన్ చేశాడట రాజమౌళి..ఆల్రెడీ 17 ఏళ్ల క్రితం వరల్డ్ వైడ్ గా 7 వేల కోట్లు రాబట్టింది ఇండియానా జోన్స్ క్రిస్టల్ స్కల్. అలాంటి సినిమా స్టోరీ రైట్స్ కొని, మళ్లీ అదే మూవీ పాన్ వరల్డ్ లెవల్లో తీస్తే ఎలా అన్న డౌట్ రావొచ్చు.. కాని ఇక్కడ రియాలిటీ ఏంటంటే, సౌత్ ఆఫ్రికన్ నవలల ఆధారంగానే సినిమా స్క్రిప్ట్ రెడీ అయ్యింది. కాని చాలా వరకు పాత్రలు, సీన్లు ఇండియానా జోన్స్ క్రిస్టల్ స్కల్ నుంచి ప్రేరణ పొందినవేనట.
ఒకప్పటిలా పలానా సినిమా సీన్స్ ని వాడేస్తానంటే కుదరదు… రాజమౌళి రేంజ్ పెరిగింది. పాన్ వరల్డ్ మార్కెట్ లోసినిమా అమ్మాలంటే, కాపీ రైట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. రైట్స్ కొనకుండా ఫ్రీమేకులకు ఛాన్సేలేదు. అందుకే 17 ఏళ్ల క్రితమే 7 వేల కోట్లు రాబట్టిన హాలీవుడ్ మూవీ లో పాత్రలను ప్రేరణగా తీసుకున్నందుకు, రైట్స్ రూపంలో ఖర్చు చేయాల్సి వచ్చిందట. మొత్తానికి ప్రియాంక చోప్రా ఇందులో లేడీ విలన్ అని రివీల్ కాగానే, మొన్నటి వరకు ప్రచారంగా మాత్రమే మిగిలిని ఇండియానా జోన్స్ క్రిస్టల్ స్కల్ మ్యాటర్ కన్పామ్ అయ్యిందనే డిస్కర్షన్ మొదలైంది.