మొన్నసెట్లో క్రికెట్. ఇప్పుడు హాలీవుడ్ అవతార్…

మెగా పవర్ స్టార్ అలియాస్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మొన్నటికి మొన్న క్రికెట్ బ్యాట్ పట్టాడు. ఇండియన్ స్టార్ క్రికెట్ ప్లేయర్ విరాట్ కొహ్లీనే మించే లా పీరియాడికల్ ట్వంటీ ట్వంటీ ఆడేశాడన్నారు. భారీ సెట్టు, అంతకంటే భారీ ఫ్లడ్ లైట్లు...

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 14, 2025 | 08:40 PMLast Updated on: Feb 14, 2025 | 8:40 PM

Intersting Facts About Ramcharan

మెగా పవర్ స్టార్ అలియాస్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మొన్నటికి మొన్న క్రికెట్ బ్యాట్ పట్టాడు. ఇండియన్ స్టార్ క్రికెట్ ప్లేయర్ విరాట్ కొహ్లీనే మించే లా పీరియాడికల్ ట్వంటీ ట్వంటీ ఆడేశాడన్నారు. భారీ సెట్టు, అంతకంటే భారీ ఫ్లడ్ లైట్లు… మొత్తంగా ఆ వార్త సెన్సేషనైంది. పీరియాడికల్ డ్రామాలో ఈ ట్వంటీ ట్వంటీ క్రికెట్ ఎక్కడి నుంచి వచ్చిందనే డిస్కర్షన్ జరిగింది. కట్ చేస్తే ఇప్పుడు అవతార్ లా మారుతున్నాడు. హాలీవుడ్ మూవీ అవతార్ కే పోటీ ఇచ్చే పని చేస్తున్నాడు. నిజంగానే ఇప్పుడు ఈ మూవీ టైటిల్ కూడా అవతార్ గానే రిజిస్టర్ చేయిస్తున్నారట. శ్రీకాకులం మహాబలి కోడి రామ్మూర్తి నాయుడి బయో పిక్ గా పెద్ది తెరకెక్కుతోందనుకుంటే, కాదు క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో మరో లగాన్ అన్నారు. ఇంతలో చరణ్ ఏకంగా హాలీవుడ్ అవతార్ నే టార్గెట్ చేశాడని తెలుస్తోంది. ఆచార్య, గేమ్ ఛేంజర్ ఇలా బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు పడటంతో, లాభం లేదని గట్టిగా ఏదో ట్రై చేస్తున్నాడా? హావేలుక్

మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి ఆచార్య తో పంచ్ పడి ఉండొచ్చు… గేమ్ ఛేంజర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ కావొచ్చు. కాని అన్నిరోజులు ఇలానే ఉండవు… అలా అనుకుని లైట్ తీసుకని, కష్డపడకపోతే అడ్రస్ గల్లంతే… కంటెంట్ ఉన్న సినిమాలకు బాలీవుడ్ మొత్తం షేకై, సౌత్ సినిమాకు సలామ్ కొడుతున్నా రోజులివి..ఇలాంటి టైంలో కత్తిలాంటి కథ తో రాకపోతే, పాన్ఇండియా లెవల్లో పంచ్ పడుతుంది..అందుకే ఈ సారి హిందీ మూవీ లగాన్ లాంటి ప్రయోగం, హాలీవుడ్ సినిమా అవతార్ లాంటి సాహసం రెండూ ఒకే సారి చేస్తున్నాడు గ్లోబల్ స్టార్. తన తోటి స్టార్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ తర్వాత దేవర లాంటి బ్లాక్ బస్టర్ తో దూసుకెళ్లాడు. మరోవైపు మెగా హీరోలని లెక్క చేయకుండా, తన దారి తాను చూసుకున్న అల్లు అర్జున్ పుష్ప2 హిట్ తో దూసుకెళుతున్నాడు.

ఇలాంటి టైంలో గేమ్ ఛేంజర్ లాంటి ప్లాప్ పడటం చరణ్ కి పెద్ద దెబ్బే.. అందుకే తను బుచ్చి బాబు మేకింగ్ లో చేస్తున్న పెద్ద మూవీ మీదే భారీ ఎత్తున ఆశలు పెట్టుకున్నాడు.మొన్నటి వరకు ఇది శ్రీకాకుళం బాహుబలి కోడి రామ్మూర్తి నాయుడి బయోపిక్ అనుకున్నారు.కాని ఆ వ్యక్తి పాత్ర ప్రేరణతో, ఇటు అథ్లెటిక్స్, అటు క్రికెట్ ని కలిపి కథ సిద్దం చేసుకున్నారట.1930 లో ఓ ఆటగాడి కథగా ఈ మూవీ తెరకెక్కబోతోంది. అయితే ఇందులో క్రికెట్ సీన్లు దాదాపు 40శాతం ఉంటాయట. అక్కడ తనని తాను ప్రూవ్ చేసుకొని, మరో ఆటలో ఛాన్స్ సొంతం చేసుకోవటం, తర్వాత అనుకున్నది సాధించటం అన్నపాయింట్ తో సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఇది కాకుండా మరో మూవీ ఏకంగా హాలీవుడ్ సినిమా అవతార్ నే డికొట్టేలా ఉంది.

బాలీవడ్ ని లాస్ట్ ఇయర్ షేక్ చేసిన మూవీ కిల్. ఆ సినిమా తీసిన నిఖిల్ నగేష్ భట్ ఓ మైథాలజీ కథని చరణ్ కి చెప్పాడు. ఆల్రెడీ స్టోరీ లైన్ నచ్చి చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. శ్రీవిష్ణు అవతారాల్లో ఒక అవతారాన్ని మాడ్రల్ సొసైటీకి అప్లై చేసే, అల్ ట్రా మైథాలజీ ప్రాజెక్ట్ గా ఆ సినిమా తెరకెక్కబోతోంది. కాకపోతే సినిమా పేరు అవతార్ ఎమ్ గా పెడుతున్నారు.అంటే ఇంగ్లీష్ లో అవతార్ తర్వాత ఎమ్ లెటర్ పెట్టి, టైటిల్ ఫిక్స్ చేశారట. సో వరల్డ్ వైడ్ గా అవతార్ అంటే జేమ్స్ కామేరున్ అవతారే… అలాంటి టైటిల్ కి ఎమ్ ని యాడ్ చేసి అవతారమ్ గా మారుస్తున్నారని తెలుస్తోంది. వరల్డ్ వైడ్ గా ఇలాంటి సినిమా వస్తోందంటే అందరి అటెన్షన్ ఈజీగా వస్తుంది. కాని ఎమ్ ఫర్ మెగానా మరేదైనా అర్ధం ఉందా లేదా అనేది, ఎనౌన్స్ మెంట్ తోనే తేలుతుంది. ఇంకా మొదలు కాకుండానే ఈ టైటిల్ బయటికి రావటానికి కారనం, హిందీ, అలానే తెలుగులో ఈ సినిమా టైటిల్ ని రిజిస్టర్ చేయించటమే…