వీరాట్ కొహ్లీ కే మొగుడు.. 1000 కోట్ల గ్లోబల్ బ్యాట్స్ మన్…
గ్లోబల్ స్టార్ రామ్ చరన్ సడన్ గా ఇండియన్ క్రికెటర్ వీరాట్ కోహ్లీ అవతారం ఎత్తాడా...? లేదంటే తనే మించే ప్రయత్నం చేస్తున్నాడా..?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సడన్ గా ఇండియన్ క్రికెటర్ వీరాట్ కోహ్లీ అవతారం ఎత్తాడా…? లేదంటే తనే మించే ప్రయత్నం చేస్తున్నాడా..? ఈ డౌట్ రావటానికి తన కొత్త సినిమానే కారణం. మొన్నటి వరకు ఇందులో తను శ్రీకాకులం బాహుబలి కోడి రామ్మూర్తి నాయుడిగా కనిపిస్తాడన్నారు. తన రియల్ లైఫ్ ప్రేరణతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ రాబోతోందన్నారు. కాని సీన్ చూస్తే, మెగా ట్వంటీ ట్వంటీ మ్యాచేదో ఫిక్సైనట్టుంది. ఈ మూవీ సినిమాటోగ్రాఫర్ రత్నవేల్ ట్వీట్ తో పాన్ ఇండియా ఊగిపోయేలా ఉంది. నైట్ షూట్, ఫ్లడ్ లైట్స్, క్రికెట్ పవర్, డిఫరెంట్ యాంగిల్స్ అంటూ రత్న వేల్ పెట్టిన ట్వీట్ తో సీనే మారిపోయింది. గతంలో బాలీవుడ్ నుంచి వచ్చిన లగాన్, తర్వాత 83 మూవీలు బాక్సాఫీస్ లో ట్రెండ్ సెట్ చేశాయి. ఇప్పడు రామ్ చరణ్ మూవీ వంతొచ్చినట్టుంది. సూపర్ క్రికెటర్ కాన్సెప్ట్ కి పీరియాడికల్ టచ్ ఇస్తున్నారట. ఇదే షాకింగ్ గా ఉంది… మలయాళం మూవీ మున్నాళ్ మురలి, హాలీవుడ్ ఫిల్మ్ కూంగ్ ఫూ హాసిల్ స్టైల్లో ఇది ఉండబోతోందట… అసలు నైటీంస్ ట్వీంటీకీ,, శ్రీకాకులానికి, సూపర్ క్రికెట్ కి లింకేంటి..? టేకేలుక్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ తో గ్లోబల్ గా ఫోకస్ అయ్యాడు. కాని ఆచార్య ప్లాప్ అవటం, గేమ్ ఛేంజర్ డిజాస్టర్ అని తేలటంతో, డీలా పడ్డాడు. ఇలాంటి టైంలో తన మీద ఏ వార్త వచ్చినా పట్టించుకునే నాధుడు లేడు. కాని ఆల్ ఆఫ్ సడన్ గా సినిమాటోగ్రాఫర్ రత్న వేలు పెట్టిన ట్వీట్ పాన్ ఇండియా లెవల్లో వైరలైంది. ఏకంగా ఇండియన్ క్రికెట్ టీమ్ ఇటు వైపు చూసేలా చేసింది.
ఉప్పెన డైరెక్టర్ బుచ్చి బాబు డైరెక్షన్ లో రామ్ చరణ్ చేస్తున్న మూవీ టైటిల్ పెద్ది అని ప్రచారం జరుగుతోంది. ఇక ఇది శ్రీకాకులానికి చెందిన రామ్మూర్తి నాయుడి బయోపిక్ అన్నారు. ప్రీ ఇండిపెండెన్స్ టైం పీరియడ్ లో కథ నడుస్తుందన్నారు. కాని రత్న వేలు పెట్టిన ట్వీట్ ప్రకారం చూస్తే ఇదో క్రికెట్ మ్యాచ్ సమరంగా కనిపిస్తోంది.
నైట్ షూట్, ఫ్లడ్ లైట్స్, క్రికెట్ పవర్, డిఫరెంట్ యాంగిల్స్ అంటూ తను పెట్టి ట్వీటు, దానితో అటాచ్ చేసి ఫోటో చూస్తుంటే, ట్వంటీ ట్వంటీ మ్యాచేతో సెట్లో రన్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేల ఇది 1940 టైం పీరియడ్ కి చెందిన కథే అయితే, అప్పట్లో ట్వంటీ ట్వంటీ క్రికెట్ లేదు. కనీసం వన్ డే మ్యాచులు లేవు. అసలు ఇప్పుడున్న క్రికెట్ తాలూకు ఆ గోడవే లేదు..
అలాంటప్పుడు చరణ్ మూవీ క్రికెట్ బ్యాక్ డ్రాప్ తోతెరకెక్కుతుందనుకోలేం. కాని ఫ్లడ్ లైట్లు, పవర్ క్రికెట్ అన్న పదాలు చూడగానే, ఇదేదో సైలెంట్ గా మరో లగాన్ లాంటి మూవీనే అన్నడౌట్లు పెరిగాయి. హిందీలో ఎప్పుడో జమానాలో అమీర్ ఖాన్, తెల్లోల్లతో క్రికెట్ ఆడే ఆట కాన్సప్ట్ తో సినిమా తీశాడు. అది ఆస్కార్ కి నామినేట్ కూడా అయ్యింది.
అలాంటి ఓ స్టోరీ లైన్ తోనే పెద్ది మూవీ తెరకెక్కుతోందా? లేదంటే అందులో క్రికెట్ ఆట ఓ చిన్న సీన్ లా తీస్తున్నారా మాత్రం ఇంకా తేలలేదు. ఒక వేళ ఇది క్రికెట్ నేపథ్యంతో వస్తున్న పీరియాడిక్ డ్రామా అయితే, పాన్ ఇండియా మార్కెట్ షేక్ అవటం పక్కా…..అంతేకాదు ఇందులో చరన్ దీ సూపర్ హీరో స్టైల్ పాత్రని ప్రచారం జరుగుతోంది. మలయాళ మూవీ మున్నార్ మురళి, చైనీస్ తో హాలీవుడ్ బ్యాచ్ తీసిన కూంగ్ ఫూ హాసిల్ లాంటి డార్క్ కామెడీ కమ్ సూపర్ హీరోయిజం జోనర్ లో ఈ సినిమా తెరకెక్కబోతోందని తెలుస్తోంది.