కాలర్ ఎగరేసే సినిమా… 600 కోట్లతో లాఠీ ఛార్జ్….
రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ కమిటైన మూవీ స్పిరిట్. ఆల్రెడీ ఈ సినిమా జూన్ లో షూటింగ్ మొదలవ్వాలన్న కండీషన్ పెట్టాడు సందీప్.

రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ కమిటైన మూవీ స్పిరిట్. ఆల్రెడీ ఈ సినిమా జూన్ లో షూటింగ్ మొదలవ్వాలన్న కండీషన్ పెట్టాడు సందీప్. కాబట్టి పక్కాగా జూన్ లో అయితే సినిమా మొదలౌతుంది. కాని విజయ్ దేవరకొండ, షాహిద్ కపూర్, రణ్ బీర్ కపూర్ తో పోలిస్తే రెబల్ స్టార్ కి సందీప్ రెడ్డ వంగ ఎలాంటి కథని సిద్ధం చేశాడు..? ఫస్ట్ టైం ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడనే మాట తప్ప, ఇంతవరకు మరే అంశం బయటికి రాలేదు. ఎంత సేపు కొరియన్ విలన్ డాన్ లీ, ఇండోనేషియా బ్యూటీ హీరోయిన్ అంటూ ప్రచారాలే తప్ప, అఫీషిల్ ఎనౌన్స్ మెంట్లు లేవు.. సో అదే ఉగాదికి రాబోతోందా? దేవర రిలీజ్ ముందు అంతా కాలర్ ఎగరేసే సినిమా చేశాడన్నాడు ఎన్టీఆర్.. మహర్షి టైంలో సూపర్ స్టార్ అలానే అన్నాడు. సో ఇప్పుడు రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి కాలర్ ఎగరేసే టైం వచ్చిందా? ఆ మాట సందీప్ రెడ్డి వంగ నోటి నుంచి రాబోతోందా? టేకేలుక్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లాస్ట్ టైం దేవర రిలీజ్ కి ముందు ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా సినిమా ఉంటుందన్నాడు. అలానే ఈ సినిమా 670 కోట్లు రాబట్టింది. కట్ చేస్తే మహర్షి మూవీ విడుదలకు ముందు సూపర్ స్టార్ మహేశ్ కూడా ఇది కాలర్ ఎగరేసేలా ఉంటుందన్నాడు. సరిలేరు నీకెవ్వరు కూడా ఇంచుమించు ఇలాంటి స్టేట్ మెంటే ఇచ్చాడు. రెండూ బ్లాక్ బస్టర్లయ్యాయి.
సో ఇలా ఓ సినిమా రిలీజ్ కి ముందు కాలర్ ఎగరేసేలా ఆ మూవీ ఉంటుందనటం, అన్నట్టుగా బ్లాక్ బస్టర్ రావటం మహేశ్, ఎన్టీఆర్ కెరీర్ లోనే జరిగింది. విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్ అండ్ కోకి ఈ కాలర్ ఎగరేయటాలు కలిసి రాలేదు. కాని రెబల్ స్టార్ ఫ్యాన్స్ కూడా కాలర్ ఎగరేసే టైం వచ్చినట్టుంది. సందీప్ రెడ్డి వంగ మేకింగ్ లో అలాంటి భారీ మ్యాజిక్ ఏదో జరగబోతోంది. బాహుబలి కాలర్ ఎగరేసే సినిమా కాదు… అంతకు మించే రేంజ్ మూవీ… ఆల్రెడీ అలాంటి సినిమా ప్రభాస్ చేశాడు. సలార్, కల్కీతో మరో రెండు పాన్ ఇండియా హిట్లని సొంతం చేసుకున్నాడు. కాబట్టి ప్రభాస్ ఫ్యాన్స్ ఆల్రెడీ కాలర్ ఎగరేసే సినిమాలే వచ్చాయి. కాని స్పిరిటే అసలు సిసలైన మాస్ మూవీగా ప్రచారం జరుగుతోంది.
దానికి సాలిడ్ రీజనుంది.. ఎందుకంటే బాహుబలిలో వార్ వదిలేస్తే మైండ్ బ్లాంక్ చేసే మాస్ ఫైట్లు లేవు.. సాహో, సలార్ లో ఫైట్లున్నా సాలిడ్ ఎమోషన్ ఎక్కడో మిస్ అయ్యిందనే వెలితి కనిపిస్తుంది. కల్కీ సాలిడ్ గా ఉన్నా, కామెడీ కమ్ సైఫై మూవీ కావటంతో, ప్రభాస్ కటౌట్ రేంజ్ మాస్ ఫైట్స్ ఎక్కడా కనిపించలేదు..మిర్చి తర్వాత రెబల్ స్టార్ తన కటౌట్ కి తగ్గ ఫైట్ కంటెంట్ ఉన్న మూవీ చేయలేదు. ఆ వెలితే స్పిరిట్ లో తీర్చబోతున్నాడు సందీప్. ఏకంగా 20 ఫైట్ సీన్లుండే అవకాశం ఉందని తెలుస్తోంది. అసలే ఎన్నడూ వేయని పోలీస్ పాత్ర వేస్తున్నాడు తారక్. ఆ కటౌట్ లాఠీ పట్టుకుంటే, బాక్సాఫీస్ లూటీ అవ్వాల్సిందే. అలాంటి కటౌట్ ని పాత్రకు తగ్గ మాస్ ఫైట్లతో చూపిస్తే బాహుబలి తాలూకు 1850 కోట్ల రికార్డు వారం పదిరోజుల్లోనే బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫ్యాన్స్ లో పూనకాలకు టైం దగ్గర పడింది.