అక్కినేని ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే కలెక్షన్స్.. అమెరికాలో రికార్డులు బ్రేక్

నాగ చైతన్య కెరీర్ లో తండేల్ ఖచ్చితంగా స్పెషల్ మూవీ.. ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో ఇప్పుడు రిజల్ట్ కూడా అదే రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నాడు ఈ అక్కినేని హీరో. ఎప్పటినుంచో హిట్ కోసం ఎదురుచూస్తున్న నాగచైతన్యకు ఈ సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 17, 2025 | 11:38 AMLast Updated on: Feb 17, 2025 | 11:38 AM

Intersting Facts About Tandel Movie 2

నాగ చైతన్య కెరీర్ లో తండేల్ ఖచ్చితంగా స్పెషల్ మూవీ.. ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో ఇప్పుడు రిజల్ట్ కూడా అదే రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నాడు ఈ అక్కినేని హీరో. ఎప్పటినుంచో హిట్ కోసం ఎదురుచూస్తున్న నాగచైతన్యకు ఈ సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది. ఇక అక్కినేని ఫ్యామిలీకి కూడా ఈ సినిమా మర్చిపోలేని మెమరీస్ ఇచ్చింది. ఇప్పటివరకు అక్కినేని ఫ్యామిలీలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా ఈ సినిమా చరిత్ర సృష్టించింది. అక్కినేని ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ఫుల్ జోష్లో ఉన్నారు.

చిన్న చిన్న హీరోలు వందల కోట్లు కలెక్షన్లు సాధిస్తుంటే అక్కినేని ఫ్యామిలీ నుంచి ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క సినిమా కూడా 100 కోట్ల క్లబ్లో చేరలేదు. కనీసం 80 కోట్లు కూడా ఒక సినిమా కూడా రీచ్ కాలేదు పోయింది. ఇప్పుడు తండేల్ సినిమా ఖచ్చితంగా రికార్డులు బ్రేక్ చేసింది. అక్కినేని ఫ్యామిలీ సగర్వంగా తలెత్తుకునే సినిమాగా నిలిచింది తండేల్. పర్సనల్ లైఫ్ లో ప్రొఫెషనల్ లైఫ్ లో ఇబ్బంది పడుతున్న నాగచైతన్యకు ఈ సినిమా ఖచ్చితంగా ఎనర్జీ బూస్టర్ గానే చెప్పాలి.

స్టోరీ సెలక్షన్ విషయంలో ఎప్పుడూ ఫెయిల్ అయ్యే నాగచైతన్య.. ఈ సినిమా విషయంలో మాత్రం చాలా జాగ్రత్త పడ్డాడు. ప్రతి ఒక్కటి జాగ్రత్తగా తీసుకుని సినిమా కోసం పర్సనల్ లైఫ్ ని కూడా పక్కన పెట్టాడు. ఇక పెళ్లి సమయంలో కూడా గడ్డం చేయకుండా సినిమా కోసం అలాగే చేశాడు నాగచైతన్య. దాదాపు రెండేళ్లపాటు ఆ గడ్డాన్ని అలాగే ఉంచి సినిమా కోసం వర్క్ చేశాడు. ఇక ఇప్పుడు రిజల్ట్ కూడా అదే రేంజ్ లో చూపించారు అభిమానులు, ప్రేక్షకులు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో ఓవర్సీస్ లో కూడా అదే రేంజ్ లో రికార్డులు బ్రేక్ చేసింది.

ముఖ్యంగా అమెరికా మార్కెట్లో ఈ సినిమాకు చాలా మంచి బిజినెస్ జరిగింది. రిలీజ్ కు ముందు.. రిలీజ్ తర్వాత కూడా సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చాయి. ఇక లేటెస్ట్ గా మూవీ మేకర్స్ అనౌన్స్ చేసిన లెక్కల ప్రకారం అమెరికాలో అక్కినేని ఫ్యామిలీ తల ఎత్తుకునేలా కలెక్షన్స్ వచ్చాయి తండెల్ సినిమాకు. లేటెస్ట్ గా ఈ సినిమా 1 మిలియన్ డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసింది. నాగచైతన్య కెరిర్ లో మరో మైల్ స్టోన్ గ్రాసర్ గా నిలిచింది. పెట్టుకున్న అన్ని అంచనాలను ఈ సినిమా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింది. 100 కోట్ల క్లబ్లో ఒకటి రెండు రోజుల్లో చేరే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఓవర్సీస్ లో నాగచైతన్యకు అసలు మార్కెట్ లేదు అనుకున్న వాళ్లకు ఈ సినిమా ఖచ్చితంగా ఆన్సర్ చెప్పింది అనే చెప్పాలి. వేరే సినిమాలు కూడా లేకపోవడంతో ఈ సినిమాకు చాలా బాగా ప్లస్ పాయింట్ అయింది.