80 కోట్లు… తండేల్ 150 కష్టమేనా…? 1 మిలియన్ డాలర్లు పక్కా

నాగ చైతన్య కెరీర్ కే కాదు అక్కినేని ఫ్యామిలీకి కూడా కంప్లీట్ గా హెల్ప్ చేసిన మూవీ తండెల్. అక్కినేని ఫ్యాన్స్ తమ హీరోల సినిమాలను కూడా మర్చిపోతున్న టైంలో వచ్చిన ఈ సినిమా మంచి హిట్ కొట్టింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 14, 2025 | 01:00 PMLast Updated on: Feb 14, 2025 | 1:00 PM

Intersting Facts About Tandel Movie

నాగ చైతన్య కెరీర్ కే కాదు అక్కినేని ఫ్యామిలీకి కూడా కంప్లీట్ గా హెల్ప్ చేసిన మూవీ తండెల్. అక్కినేని ఫ్యాన్స్ తమ హీరోల సినిమాలను కూడా మర్చిపోతున్న టైంలో వచ్చిన ఈ సినిమా మంచి హిట్ కొట్టింది. నాగచైతన్య కెరీర్ లోనే ది బెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమా.. అక్కినేని ఫ్యామిలీ చరిత్రలోనే భారీ కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమాతో నాగచైతన్య ఫుల్ స్వింగ్ లోకి వచ్చేసాడు. ఇక త్వరలోనే తన తాత అక్కినేని నాగేశ్వరరావు నటించిన తెనాలి రామకృష్ణ సినిమాను రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నారు.

చందు డైరెక్షన్ లోనే ఆ సినిమా కూడా వస్తుంది . ఇక తండెల్ సినిమా కలెక్షన్స్ పరంగా సునామీ సృష్టిస్తోంది. వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా… ఐదు రోజుల్లో భారీగా కలెక్షన్స్ రాబట్టింది. అమెరికా, ఆస్ట్రేలియా, యూకే దేశాల్లో ఈ సినిమాకు వసూళ్లు భారీగా వస్తున్నాయి. ఇక మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ప్రకారం ఈ సినిమా ఐదు రోజుల్లోనే 81 కోట్లు కలెక్ట్ చేసింది. నాగచైతన్య కెరీర్ లోనే ఈ స్థాయిలో ఇప్పటివరకు ఏ సినిమా కలెక్షన్స్ సాధించలేదు. ఇక అఖిల్ కూడా ఏజెంట్ సినిమాతో వందకోట్ల క్లబ్ లో చేరాలని ప్రయత్నం చేసినా… ఆ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేదని చెప్పాలి.

ఆ సినిమా ప్రమోషన్స్ కూడా అఖిల్ చాలా గ్రాండ్ గా చేశాడు. సినిమా షూటింగ్ కూడా చాలా రోజులు జరిగింది. అయినా సరే సినిమా మాత్రం ఆకట్టుకోలేదు. ఇక నాగచైతన్య ఈ సినిమాలో చాలా న్యాచురల్ గా చేయడంతో జనాల్లోకి వెళ్ళింది. దానికి తోడు నిజజీవితంలో జరిగిన కథ కాబట్టి జనాలు ఇంట్రెస్ట్ చూపించారు. దానితోడు సాయి పల్లవి కూడా ఈ సినిమాకు మేజర్ ఎసెట్ అనే చెప్పాలి. అటు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ కూడా సినిమాను వేరే లెవల్ కు తీసుకెళ్లింది. అల్లు అరవింద్ నిర్మించిన ఈ రొమాంటిక్ డ్రామా మూవీకి వసూళ్లు మరింత పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి.

ఈ సినిమా ఫీచర్లో కచ్చితంగా 100 నుంచి 130 కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ముందు 150 కోట్లు కలెక్ట్ చేస్తుందని భావించినా ఆ రేంజ్ లో వసూళ్లు కనపడే ఛాన్స్ లేదు. ఈ సినిమాకు తొలి రోజు నుంచే భారీగా కలెక్షన్స్ రావడం మొదలైంది. ఇక అమెరికాలో మరో ఒకటి రెండు రోజుల్లో వన్ మిలియన్ డాలర్లు వసూలు చేసే అవకాశం ఉంది. ఇక ఈ వీకెండ్ లో ఈ సినిమాకు వసూళ్లు కచ్చితంగా పెరుగుతాయని మేకర్స్ అంచనా వేస్తున్నారు. అమెరికాలో కూడా ఈ వీకెండ్ కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉంది. వేరే సినిమాలు ఏమీ లేకపోవడంతో ఈ సినిమాకు కచ్చితంగా ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. విశ్వక్సేన్ లైలా సినిమా ఉన్నా సరే ఈ సినిమాను ఇబ్బంది పెట్టే స్థాయిలో ఉండకపోవచ్చు.