హిట్ మూవీ కి గుండు సున్న… పాన్ ఇండియా గుండు…

పాన్ ఇండియా లెవల్లో నాగచైతన్యకు తండెల్ తో హిట్ పడ్డట్టే అని తేలింది. 3 రోజుల్లో 60 కోట్ల పైనే వసూల్లు వచ్చాయి. కాబట్టి ఫిల్మ్ టీం పడంగ చేసుకోవాలి..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 11, 2025 | 07:20 PMLast Updated on: Feb 11, 2025 | 7:20 PM

Intersting Facts About Tollywood Movies

పాన్ ఇండియా లెవల్లో నాగచైతన్యకు తండెల్ తో హిట్ పడ్డట్టే అని తేలింది. 3 రోజుల్లో 60 కోట్ల పైనే వసూల్లు వచ్చాయి. కాబట్టి ఫిల్మ్ టీం పడంగ చేసుకోవాలి.. కాని ఈ సినిమాకు గుండు సున్నానే ఎదురైందనే కామెంట్లు పెరిగాయి. పాన్ ఇండియా లెవల్లో పంచ్ పడినట్టు కన్పామ్ అయ్యింది. మెగా, నందమూరి, రెబల్ ఫ్యామిలీస్ తర్వాత అక్కినేని ఫ్యామిలీ నుంచి పాన్ ఇండియా హిరో వస్తాడనుకుంటే, సీన్ రివర్స్ అయ్యింది. ఎవరైనా ఫ్లాప్ మూవీతో పాన్ ఇండియా లెవల్లో బొక్కబోర్లా పడటం చూశాం. కాని హిట్ మూవీతో పాన్ ఇండియా లెవల్లో పంచ్ పడిందంటే అది చైతన్యకే… తనే కాదు న్యాచురల్ స్టార్ నాని కి ఇలా రెండు సార్లు ఊహించని షాక్స్ తగిలాయి.. విచిత్రం ఏంటంటే అవి కూడా రెండు హిట్ మూవీలే… టాలీవుడ్ లో హిట్ మూవీలోతో ఫ్లాప్ ని ఫేస్ చేసిన అరుదైన పరిస్థితి నాని, నాగచైతన్యలకే ఎదురైంది ఎందుకు..? హావేలుక్

తండేల్ మూవీ హిట్ అని కన్ఫామ్ చేస్తున్నారు. ఒక్క పాకిస్థాన్ ఎపిసోడ్ తప్ప సినిమా అంతా అదుర్స్ అంటున్నారు. ఫస్ట్ డే ఫ్లాప్ టాక్ వచ్చి, తర్వాత రోజునుంచి హిట్ టాక్ వచ్చింది. కట్ చేస్తే ఈ పాన్ ఇండియా మూవీకి, పాన్ ఇండియా లెవల్లో గుండు సున్నానే ఎదురౌతోంది. ఒకవైపు సినిమా హిట్ అంటున్నారు. మరోవైపు పాన్ ఇండియా లెవల్లో తండేల్ కి పంచ్ పడిందనేస్తున్నారు. ఇదే కాస్త విచిత్రంగా ఉంది.

అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్ లో లవ్ స్టోరీ మూవీ వచ్చింది. వసూళ్ల వరదొచ్చేంత కాకున్నా అది హిట్అయ్యింది. ఇప్పుడు తండేల్ పాన్ ఇండియా లెవల్లో వచ్చి 3 రోజుల్లో 60 కోట్ల పైనే వసూల్లొచ్చాయి. దీంతో నందమూరి ఫ్యామిలీలో తారక్, మెగా ఫ్యామిలీలో చరణ్, రెబల్ ఫ్యామిలీలోప్రభాస్, ఇలా ఒక్కో ఫ్యామిలీలో ఒక్కో పాన్ ఇండియా హీరో దుమ్ముదులిపాడు. ఇక అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగచైతన్య పాన్ ఇండియా హిట్ కొడతాడనుకుంటే, హిట్ మాత్రమే కొట్టాడు.

కాని పాన్ ఇండియా లెవల్లో మాత్రం ఫ్లాప్ ఫేస్ చేశాడు. తండేల్ కేవలం తెలుగు రాష్ట్రాల్లో, అలానే యూఎస్ లోని తెలుగు జనాల్లోనే వసూళ్ల వర్షం కురిపించింది. తమిల్,మలయాళం, కన్నడ, హిందీ మార్కెట్లతో థియేటర్స్ కాలీ అన్న మాటలే వినిపిస్తున్నాయి. సాయిపల్లవి, దేవి శ్రీ మ్యూజిక్,లవ్ అండ్ ఎమోషనల్ సీన్స్ లేకపోతే తండేల్ పనైపోయేదనే కామెంట్లు కూడా పెరిగాయి

అయితే తండేల్ ని అమీర్ ఖాన్ వచ్చి ప్రమోట్ చేసినా, నార్త్ కెళ్లి చైతన్య, సాయిపల్లవి తెగ ప్రమోట్ చేసినా ప్రయోజనం లేకుండాపోయింది. కార్తికేయ 2 లాంటి పాన్ ఇండియా హిట్ ఇచ్చిన చందు మొండేటి మేకింగ్ లో వచ్చిన సినిమా అన్నపేరు కూడా పనికి రాకుండాపోయింది. ఎక్కడైనా ఓ మూవీ ఫ్లాప్ అయితే, వసూళ్ల గోల లేదంటారు

కాని ఇక్కడ తండేల్ హిట్టైంది. పాన్ ఇండియా లెవల్లో ప్రమోట్ చేసినా తమిళ,మలయాళ, కన్నడ, హిందీ మార్కెట్లో గుండు సున్నానే దక్కింది. అచ్చంగా న్యాచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం, హాయ్ నాన్నకు ఇలానే జరిగింది. తను హిందీ మార్కెట్ లో అయితే ఏకంగా 100 యూ ట్యూబ్ ఛానల్స్ కి, ఇంటర్వూలు ఇచ్చాడు. తమిల, మలయాళ మార్కెట్ లో భారీ ఎత్తున ప్రచారం చేశాడు. కాని నోయూజ్… సరిపోదా శనివరాం, హాయ్ నాన్న రెండూ ఇక్కడ హిట్టైనా, పాన్ ఇండియా లెవల్లో ఫ్లాప్ అయ్యాయి. అచ్చంగా తండేల్ కి ఇప్పుడు అదే పరిస్థితి 3 రోజుల్లో కన్ఫామ్ అయ్యింది.