నాటు నాటు పాట తర్వాత… దేవర పాటే రెండో తూటా…?

దేవర పాట తూటాలా పేలింది. రీసెంట్ గా అమెరికన్ పాప్ సింగర్ ఈడీ షరన్ దేవర పాట నేర్చుకుని మరీ తన కాన్సర్ట్ లో పాడాడు... ఇండియన్ తో కలిసి తను పాడిన పాట సోషల్ మీడియాను రెండురోజులుగా కుదిపేస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 11, 2025 | 08:00 PMLast Updated on: Feb 11, 2025 | 8:00 PM

Intersting Facts About Tollywood Songs

దేవర పాట తూటాలా పేలింది. రీసెంట్ గా అమెరికన్ పాప్ సింగర్ ఈడీ షరన్ దేవర పాట నేర్చుకుని మరీ తన కాన్సర్ట్ లో పాడాడు… ఇండియన్ తో కలిసి తను పాడిన పాట సోషల్ మీడియాను రెండురోజులుగా కుదిపేస్తోంది. ఇప్పుడు సీన్ లోకి కోల్డ్ ప్లే సింగర్ వస్తున్నాడు. తను కొత్త కాన్సర్ట్ లో ఈ పాట ఉండబోతోందట. అంతగా ఆ పాటలో ఏముంది..? మొదట్లో ఆ పాట కాపీ సాంగ్ అన్నారు. ఎన్టీఆర్ కూడా రాజమౌళి సెంట్ మెంట్ కి బలౌతున్నాడన్నారు. అందుకు చుట్టమల్లే సాంగ్ కాంట్రవర్సీనే సూచన అన్నారు. కట్ చేస్తే ఆ పాట యూ ట్యూబ్ ని ఊపేసింది. తర్వాత దేవర మూవీ బాక్సాఫీస్ ని కుదిపేసింది. నెగెటీవ్ ప్రచారం నిజంగా దేవరకి కలిసొచ్చిందనే మాటే వినిపించింది. కట్ చేస్తే దేవర వచ్చిన ఇన్ని నెలలకు, చుట్టమల్లే సాంగ్ ని ఒకరి తర్వాత మరొకరు పాప్ సింగర్ పాడేస్తున్నారు. ఈ పాటని తెగ వాడేస్తున్నారు.. ఎనీ స్పెషల్ రీజన్..? టేకేలుక్

దేవర మూవీ వచ్చి5 నెల్లు కావస్తోంది. ఓటీటీలో కూడా ట్రెండ్ సెట్ చేసి నెలలు గడుస్తోంది. కట్ చేస్తే ఇప్పుడు చుట్టమల్లే సాంగ్ యూట్యూబ్ ని కొత్తగా ఊపేస్తోంది. సోషల్ మీడియాలో మళ్లీ వైరలైంది. కారనం పాప్ సింగర్ ఈడీ శెరాన్. తను ఇండియాలో తన షోలు ఇస్తున్న టైంలో, చుట్టమల్లే సాంగ్ ని ఇండియన్ సింగర్ తో కలిసి పాడాడు. స్టేజ్ మీద తను పాట పాడిన వెంటనే, మ్యూజిక్ కాన్సర్ట్ చూస్తున్న జనాల్లో ఊపొచ్చింది. ఆ ఆడిటోరియం ఊగిపోయింది.

విచిత్రం ఏంటంటే ఈ పాటని ఈ అమెరికన్ పాప్ సింగర్ ఒకసారి ప్రాక్టీస్ చేసీ మరి, స్టేజ్ మీదకొచ్చి పాడాడు. ఆ వీడియోనే రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరలైంది. ఇక్కడ ప్రశ్న ఇప్పుడే ఎందుు ఆ సింగర్ ఆ పాట నేర్చుకుని మరీ పాడాడు..? ఏదో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఖుషీ చేసేందుకే ఈ ప్రయత్నమా అంటే, ఇంచుమించు అది కూడా ఒక రీజనే..

కాకపోతే యూ ట్యూబ్ లో 2024 ని కుదిపేసిన పాటల్లో ఇది టాప్ ప్లేస్ లో ఉంది. తన పాటలకంటే కూడా భారీగా వరల్డ్ వైడ్ గా కుదిపేసిన సాంగ్ అవటం వల్లేఈడీ షెరాన్ ఈపాటని ఇండియన్ ఆడియన్స్ కోసం నేర్చుకుని మరీ స్టేజ్ మీద పాడడట. విచిత్రం ఏంటేంటే నవ్విన నాప చేనే విరగ కాస్తుందన్నట్టు… దేవర రిలీజ్ కిముందు ఈ పాటని కాపీ ట్యూన్ అన్నారు.

కొరియోగ్రాఫి బాలేదు, అసలు పాటే బాలేదన్నారు .కట్ చేస్తే ఈ పాటే అన్ని భాషల్లో కలిపితే యూట్యూబ్ లో 50 కోట్ల పైనే వ్యూస్ రాబ్టటింది. అది కూడా కేవలం 5 నెలల్లోనే… ఇక దేవర రిలీజ్ అయ్యాక ఫ్లాప్ అన్నారు. కాని 670 కోట్ల వసూళ్లు రాబట్టడమే కాదు, రాజమౌలి సెంటిమెంట్ ని కూడా బ్రేక్ చేసేందుకు కారణమైంది. మొత్తంగా దేవర సినిమా తో పాటు, పాట కూడా ఇప్పటికీ తూటాలా ఇంకా దూసుకెళుతోంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బ్రిటిష్ పాప్ బ్యాండ్ కోల్డ్ ప్లే కూడా ఈ పాటని ప్రాక్టీస్ చేస్తోందట. బెంగులూరు కాన్సర్ట్ లో ఈ పాట స్పెషల్ డిష్ అంటూ ప్రచారం జరుగుతోంది. అందరికీ ఎందుకు ఈ పాటే కనెక్ట్ అయినట్టుంది. అప్పట్లో త్రిబుల్ ఆర్ నాటు నాటు సాంగ్ ఎలాగైతే యూరోపియాన్స్ నుంచి హాలీవుడ్ స్టార్స్ వరకు అందరికీ నచ్చిందో, ఇప్పడు చుట్టమల్లే సాంగ్ అమెరికన్, బ్రిటీష్ పాప్ సింగర్స్ కి తెగ నచ్చుతున్నట్టుంది.