రష్మిక మందన్న బంగారు కొండ.. మరి మన విజయ్ దేవర’కొండ’ బాబేమో..!
పోలిక కొత్తగా ఉంది కదా..! కానీ ఇప్పుడు జరుగుతుంది మాత్రం ఇదే. రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ డేటింగ్ చేస్తున్నారని.. ఇద్దరూ ఘాటు ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంది.

పోలిక కొత్తగా ఉంది కదా..! కానీ ఇప్పుడు జరుగుతుంది మాత్రం ఇదే. రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ డేటింగ్ చేస్తున్నారని.. ఇద్దరూ ఘాటు ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంది. వాళ్లు బయట పడట్లేదు కానీ ఇప్పటికే చాలా సాక్ష్యాలు వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని విషయం బయట పెట్టేసాయి. త్వరలోనే ఇద్దరూ పప్పన్నం పెట్టే ఆలోచనలో కూడా ఉన్నారు. ఇదంతా ఇలా ఉంటే రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ జంట గురించి సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ బాగా వైరల్ అవుతున్నాయి. అది వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి కాదు.. ప్రొఫెషనల్ లైఫ్ గురించి..!
రష్మికను అభిమానులు ముద్దుగా నేషనల్ క్రష్ అని పిలుస్తుంటారు. ఆ ట్యాగ్ కు తగ్గట్టే ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉంది ఈ ముద్దుగుమ్మ. వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలు ఇస్తూ హీరోలకు లక్కీ ఛామ్ అయిపోయింది. ఫ్లాప్ ల్లో ఉన్న హీరోలకు రష్మిక అడుగుపెట్టగానే బ్లాక్ బస్టర్ వస్తుంది. గత ఏడాది కాలంలో యానిమల్, పుష్ప 2, ఛావా సినిమాలతో ఆల్ టైం బ్లాక్ బస్టర్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. దాంతో రష్మిక పేరు చెప్తే బాక్సాఫీస్ ఊగిపోతుందిప్పుడు.
మరోవైపు మన విజయ్ దేవరకొండ చూసుకుంటే కొన్ని సంవత్సరాలుగా నేషనల్ డిజాస్టర్స్ ఇస్తున్నాడు. ఒకదాన్ని మించి ఒక సినిమాతో నష్టాల రికార్డులు నిర్మాతలకు చూపిస్తున్నాడు విజయ్. అప్పుడెప్పుడో 2018 లో వచ్చిన గీత గోవిందం, టాక్సీవాలా తర్వాత మనోడు నటించిన వరల్డ్ ఫేమస్ లవర్, డియర్ కామ్రేడ్, లైగర్, ఫ్యామిలీ స్టార్ సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి డిజాస్టర్ అయ్యాయి. మధ్యలో ఖుషి ఒక్కటే కాస్త పర్లేదనిపించింది. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న కింగ్ డమ్ సినిమాతో వస్తున్నాడు విజయ్. మే 30న ఈ సినిమా విడుదల కానుంది.
ఇది హిట్ అయితే కానీ విజయ్ ఫ్లాపులకు ఫుల్ స్టాప్ పడదు. దీని తర్వాత రాహుల్ సంక్రిత్యన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు విజయ్. ఇందులో రష్మిక హీరోయిన్ గా నటించబోతుంది. మొత్తానికి ఈ ఇద్దరి జోడి చూడడానికి బాగున్నా.. ప్రొఫెషనల్ గా మాత్రం ఈస్ట్ వెస్ట్ లా ఉంది అంటూ సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.