తెలుగులో ఎన్టీఆర్, తమిళంలో సూర్య.. కొండా వాడకం వేరే లెవెల్ అంతే

ఏదేమైనా ఇప్పుడు సినిమాలను ప్రమోట్ చేయడానికి జనాలు చాలా కొత్తగా ఆలోచిస్తున్నారు. తమ సినిమాలు గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకోవాలని యంగ్ హీరోలు పోటీ పడుతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 11, 2025 | 12:35 PMLast Updated on: Feb 11, 2025 | 12:35 PM

Intersting Facts About Vijay Devarakonda Movie

ఏదేమైనా ఇప్పుడు సినిమాలను ప్రమోట్ చేయడానికి జనాలు చాలా కొత్తగా ఆలోచిస్తున్నారు. తమ సినిమాలు గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకోవాలని యంగ్ హీరోలు పోటీ పడుతున్నారు. సీనియర్ హీరోలు కూడా తమ సినిమాల ప్రమోషన్ కోసం గతంలో కంటే కాస్త ఇప్పుడు డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అవ్వటానికి చాలా ప్లానింగ్ తో ముందుకు వెళుతున్నారు జనాలు. చిన్న సినిమాలను కూడా గట్టిగా ప్రమోట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఇక భారీ బడ్జెట్ సినిమాలు ప్రమోషన్స్ అయితే వేరే లెవెల్ లో ఉంటున్నాయి. ప్రస్తుతం మన తెలుగులో వచ్చే సినిమాలు ఎక్కువగా భారీ బడ్జెట్ వే ఉండటంతో, ప్రమోషన్స్ కోసం ఎక్కువగా స్టార్ హీరోలను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ.. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు విజయ్. గత కొన్నాళ్లుగా ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న విజయ్, ఈ సినిమాతో ఎలాగైనా సరే గ్రాండ్ విక్టరీ కొట్టాలని టార్గెట్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో వాయిస్ ఓవర్ కోసం ఇప్పుడు స్టార్ హీరోలను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. తమిళంలో అక్కడి స్టార్ హీరో సూర్య వాయిస్ ఓవర్ తీసుకోవాలని మూవీ మేకర్స్ రెడీ అయిపోయారు. ఇక మన తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ తీసుకోవడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. అందుకోసం ఎన్టీఆర్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. తెలంగాణ యాసలో ఎన్టీఆర్ ఈ సినిమాకు వాయిస్ ఓవర్ చెప్పడానికి రెడీ అయ్యాడట. త్వరలోనే వాయిస్ ఓవర్ డబ్బింగ్ కూడా స్టార్ట్ అవుతుందని సమాచారం.

ఇక హిందీ విషయానికొస్తే.. అక్కడ రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రెడీ అయినట్లు ప్రచారం జరుగుతుంది. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ఈ వేసవిలోనే రిలీజ్ కానుంది. టైటిల్ టీజర్ తో ఒక పాట కూడా రిలీజ్ చేస్తారు. అప్పుడే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయనున్నారు. ఇక ఈ సినిమాకు తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే మ్యూజిక్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజిలోనే ఉంది. క్లైమాక్స్ లోని కొన్ని సీన్స్ ను షూట్ చేయాల్సి ఉంది. ఇక టైటిల్ ఎలా ఉంటుందనే దానిపై ఇప్పటివరకు ఎటువంటి లీక్ లేదు. రీసెంట్ గా టైటిల్ అనౌన్స్మెంట్ వస్తుందని మేకర్స్ ప్రకటించారు. దీంతో విజయ్ దేవరకొండ కెరీర్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమాపై అంచనాలు కూడా అదే లెవెల్ లో ఉన్నాయి.