500 కోట్ల వాయిస్ ఇచ్చాడు.. ఆ డైలాగులు ఏంది సామి.. కింగ్డంను ఆక్రమించిన ఎన్టీఆర్..

లైగర్ రిజల్ట్ తర్వాత విజయ్ దేవరకొండ బాగా ఇబ్బంది పడ్డాడు. కెరియర్ లో వరుస ఫ్లాపులతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో వెళ్లిపోయాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 13, 2025 | 04:10 PMLast Updated on: Feb 13, 2025 | 4:10 PM

Intersting Facts About Vijaydevarakonda Movie

లైగర్ రిజల్ట్ తర్వాత విజయ్ దేవరకొండ బాగా ఇబ్బంది పడ్డాడు. కెరియర్ లో వరుస ఫ్లాపులతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో వెళ్లిపోయాడు. ఫ్యామిలీ స్టార్ సినిమా కాస్త ఫర్వాలేదనిపించినా… కెరీర్ కు హెల్ప్ చేసే హిట్టు మాత్రం కాదని చెప్పాలి. కానీ ఇప్పుడు మాత్రం తన 12వ సినిమాను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్నాడు ఈ హీరో. లైగర్ తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో ఎలాగైనా సరే హిట్టు కొట్టాలి.. అనుకుని టార్గెట్ పెట్టుకుని ప్రస్తుతం చేస్తున్న సినిమా కోసం వర్క్ చేసాడు. గౌతం తిననూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు లేటెస్ట్ గా టైటిల్ అనౌన్స్ చేస్తూ టీజర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ టీజర్ కు తెలుగులో ఎన్టీఆర్.. తమిళంలో సూర్య, హిందీలో రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. లేటెస్ట్ గా ఈ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా తెలుగులో ఎన్టీఆర్ వాయిస్ కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. “అలసట లేని భీకర యుద్ధం, అలలుగా పారే ఏరుల రక్తం. వలస పోయిన, అలసిపోయిన ఆగిపోయినది మహా ప్రాణం.. నేలపై దండయాత్ర మట్టి కింద మృతదేహాలు.. ఈ అలజడి ఎవరికోసం.. ఇంత బీభత్సం ఎవరికోసం.. అంటూ డైలాగ్స్ తో ఎన్టీఆర్ ఓ రేంజ్ లో హైప్ పెంచాడు.

టీజర్ చూస్తుంటేనే గూస్ బంప్స్ అన్నట్లుంది. ఇక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కోసం అనిరుద్ ప్రాణం పెట్టి కొట్టాడు. ఇక ఈ సినిమా టైటిల్ ను “కింగ్డమ్” అని అనౌన్స్ చేశారు మేకర్స్. సమ్మర్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం విజయ్ వేరే సినిమాలు కూడా పక్కన పెట్టేసాడు. ఇక టీజర్ లో విజువల్స్ కూడా కేజిఎఫ్ రేంజ్ లో ఉన్నాయి. చాలా గ్రాండ్ గా కొన్ని సీన్స్ ను ప్లాన్ చేసాడు. ఈ సినిమా కోసం తెలుగులో ఎన్టీఆర్ వాయిస్ పక్కగా ప్లస్ అవుతుంది. కన్నడలో కూడా ఇది కలిసి వచ్చే ఛాన్స్ ఉంది.

కచ్చితంగా ఈ సినిమా 500 కోట్లు వసూలు చేస్తుందని విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే వాయిస్ విని పండగ చేసుకుంటున్నారు. మూడు భాషల్లో స్టార్ హీరోలతో వాయిస్ ఓవర్ చెప్పించిన డైరెక్టర్.. డైలాగ్స్ కూడా అదే రేంజ్ లో ఇచ్చాడు. ఇక మే 30 నా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా గురించి.. ఇక్కడి నుంచి ప్రతి ఒక్కటి అప్డేట్ రానుంది. మరో నాలుగు నెలల్లో ఈ సినిమాను అత్యంత గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు షూటింగ్ కూడా త్వరలో కంప్లీట్ చేసి ప్రమోషన్ ఈవెంట్స్ ను ప్లాన్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఎలాగైనా ఈ సినిమాతో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా హిట్టు కొట్టి ఫామ్ లోకి రావాలని టార్గెట్ పెట్టుకున్నాడు. గీతగోవిందం సినిమా తర్వాత విజయ్ దేవరకొండకు అరేంజ్ హిట్ లేదు.