5000 కోట్ల బాంబు… వరల్డ్ మీడియా ల్యాండైంది…!
సూపపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా ఎస్ ఎస్ ఎమ్ బీ 29 విషయంలో 5000 కోట్ల బాంబు పేల్చబోతున్నాడు డైరెక్టర్ రాజమౌళి. ఏదో వరల్డ్ వైడ్ గా గట్టిగానే రీసౌండ్ చేసేలా ప్లాన్ చేశాడు.

సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా ఎస్ ఎస్ ఎమ్ బీ 29 విషయంలో 5000 కోట్ల బాంబు పేల్చబోతున్నాడు డైరెక్టర్ రాజమౌళి. ఏదో వరల్డ్ వైడ్ గా గట్టిగానే రీసౌండ్ చేసేలా ప్లాన్ చేశాడు. ఆల్రెడీ 55 వేల థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ అయ్యేలా హాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లను రంగంలోకి దింపుతున్నాడు. అవతార్ దర్శకుడు, జురాసిక్ పార్క్ క్రియేటర్ ని ప్రెస్ మీట్ కి పిలుస్తున్నాడు. ప్రీరిలీజ్ బిజినెస్ రూపంలో 5 వేల కోట్ల ఫస్ట్ ఇండియన్ మూవీ గా వరల్డ్ వైడ్ గా ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు అసలు ఆట షురూ అయ్యింది. మూడు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తయ్యాక, అసలైన ప్రెస్ మీట్ కి రంగం సిద్దమైంది. ఈనెల 21న ప్లాన్ చేసిన ఇంటర్ నేషనల్ ప్రెస్ మీట్ కోసమే ఏదో గట్టిగా నూరుతున్నాడు రాజమౌళి.ఆల్రెడీ వరల్డ్ మీడియా మూడు వారాల ముందే వచ్చింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఫలానా రోజు ప్రెస్ మీట్ అంటే, ఇంటర్నేషనల్ మీడియా జర్నలిస్టులు ఒకరోజో, రెండురోజుల ముందో రావాలి…మూడువారాలముందే పనేంటి? అక్కడే సూపర్ స్టార్ మహేశ్ బాబు 29 వ మూవీ వరల్డ్ మీడియాలో సంచనలం క్రియేట్ చేసేలా ఉందనేడౌట్ పెరిగుతోంది. అదేంటో చూసేయండి.
ఏప్రిల్ 21 సూపర్ స్టార్ మహేశ్ బాబు 29వ మూవీ ప్రెస్ మీట్ కి ఆల్ మోస్ట్ అంతా సిద్దం. ఆల్రెడీ ఇంటర్ నేషనల్ మీడియా మొత్తం ముందే ల్యాండైంది. 1000 కోట్ల బడ్జెట్ తో 7 ఖండాల్లో 7 వింతలున్న ప్రదేశాల్లో తెరకెక్కుతున్న మొదటి సినిమా ఇదే. అది కూడా ఇండియన్ సినిమా అవటమేకాదు, ఐ మ్యాక్స్ కెమెరాని వాడుతున్న ఫస్ట్ ఇండియన్ మూవీ కూడా ఇదే.టన్నుల కొద్ది బరువు, కోట్లల్లో ఖర్చు వస్తుంది కాబట్టే, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరూ ఐ మ్యాక్స్ కెమెరాని వాడలేదు. ఇలా ఎన్నో వింతలు విశేషాలున్న మహేశ్ బాబు మూవీని, అంతకంటే ఎక్కువ ఫోకస్ చేసేందుకు పెద్ద స్కెచ్చే వేశాడు రాజమౌళి .
ఆల్రెడీ ఇందులో సౌత్ ఆఫ్రికా వింతలు, మెక్సికల్ ఫైటర్లని వాడుతున్న తను, రిలీజ్ కి ముందే 5 వేల కోట్ల ప్రిరిలీజ్ బిజనెస్ అయ్యేలా చేయగలిగాడు. నెట్ ఫ్లిక్స్ ఏకంగా ఈమూవీ ఓటీటీ రైట్స్ ని 500 కోట్లకి డీల్ మాట్లాడేసుకుందనే ప్రచారం కూడా జరుగుతోంది.ఇప్పటి వరకు ఈ మూవీ తాలూకు లీకులు, ప్రచారాలు, రూమర్లనుకున్న వార్తలన్నీ నిజమయ్యాయి. అందుకే సినిమా లాంచ్ కి ప్రెస్ మీట్ పెట్టకున్నా, దేశమంతా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటోంది. అల్రెండీ హాలీవుడ్ డైరెక్టర్స్ జేమ్స్ కామెరున్, స్టీవెన్ స్పిల్ బర్గ్ ని ఒప్పించి ఈ ప్రెస్ మీట్ కి తీసుకురాబోతున్న రాజమౌళికి, ఆల్రెడీ హాలీవుడ్ బడా బ్యానర్ల సపోర్ట్ దక్కింది.
ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ల చైన్ ఉన్న హాలీవుడ్ బ్యానర్ డ్రీమ్ వర్క్స్, డిస్నీప్ సంస్థలు 5 వేల కోట్లకి ప్రీరిలీజ్ బిజినెస్ మాట్లాడుకుని, ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాయి. ఇలాంటి టైంలో వరల్డ్ వైడ్ గా అందరి అటెన్షన్ లాక్కునేలా ఓ భారీ ప్రెస్ మీట్ పెట్టి, హాలీవుడ్ కటౌట్లని రంగంలోకి దింపిదే ఉంటుంది.. ఆ సౌండ్ కి వరల్డ్ వైడ్ గా రీసౌండ్ వచ్చే చాన్స్ఉంది.అదే జరగబోతోంది. ఏప్రిల్ 21కి ఇంకా మూడు వారాల టైం ఉన్నా ఈలోపే బీబీసీ, సీఎన్ ఎన్, ఇలా 120 వార్తా సంస్థలనుంచి ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్లు ల్యాండయ్యారు. ఈమూవీ మేకింగ్, తోపాటు రాజమౌళి బేసిక్ 2 మినట్స్ ఇంటర్వూస్ తీసుకోవటం కూడా మొదలైందట. అంటే ప్రెస్ మీట్ రోజు ప్రపంచానికి రాజమౌళి టీం, అలానే అవతార్ డైరెక్టర్ ఏం చెబుతారో, అది ముందే వీళ్యు క్యాప్చర్ చేసి మ్యాటర్ రెడీగా ఉంచుతారట.
సో ఏప్రిల్ లో సోసల్ మీడియా నుంచి వరల్డ్ వైడ్ శాటిలైట్ వరకు ఈ న్యూస్ వైరలయ్యేలా సాలిడ్ ప్లాన్ చేశాడు రాజమౌళి. ఎంతైనా ఇండియ నెంబర్ వన్ డైరెక్టర్ పిలిస్తే, వరల్డ్ మీడియా రాకుండా ఉండదు. కాని మూడు వారాల ముందే ఈమూవీని ప్రమోట్ చేసేలా వాళ్లు కష్టపడుతున్నారంటే, కమర్శియల్ అప్రోచ్ కూడా ఉందేమో అన్న ప్రచారం కూడా జరుగుతోంది.