త్రివిక్రమ్ లైట్ తీసుకున్నాడు… బన్నీ బ్రతిమాలినా యూజ్ లేదా…?

పుష్ప సినిమా గ్రాండ్ సక్సెస్ తర్వాత అల్లు అర్జున్ కెరీర్ చాలా స్పీడ్ గా ఉండాలి. ఇక అతను సెలెక్ట్ చేసుకునే సినిమాలు వరుస పెట్టి లైన్ అయిపోతూ ఉండాలి. కానీ అల్లు అర్జున్ మాత్రం ఎందుకో తెలియదు స్లో అయ్యాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 14, 2025 | 02:00 PMLast Updated on: Feb 14, 2025 | 2:00 PM

Intersting News About Allu Arjun And Trivikram

పుష్ప సినిమా గ్రాండ్ సక్సెస్ తర్వాత అల్లు అర్జున్ కెరీర్ చాలా స్పీడ్ గా ఉండాలి. ఇక అతను సెలెక్ట్ చేసుకునే సినిమాలు వరుస పెట్టి లైన్ అయిపోతూ ఉండాలి. కానీ అల్లు అర్జున్ మాత్రం ఎందుకో తెలియదు స్లో అయ్యాడు. అతను సినిమాలు ఏది ముందుకు వెళ్లడం లేదు. జనవరిలో మొదలవ్వాల్సిన త్రివిక్రమ్ డైరెక్షన్లో మూవీ కూడా ఇప్పటివరకు సెట్స్ మీదకు వెళ్లలేదు. అసలు ఆ సినిమా సెట్స్ మీదకు వెళుతుందా లేదా అనే క్లారిటీ కూడా జనాలకు రావడం లేదు. ఓవైపు వేరే హీరోలు అందరూ తమ సినిమాలతో బిజీ అయిపోతుంటే.. ఇతను మాత్రం పెద్దగా తన సినిమాపై ఫోకస్ చేసినట్లు కనపడలేదు.

ఓవైపు అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఏంటి అని జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తుంటే.. బన్నీ మాత్రం ఏ అనౌన్స్మెంట్ ఇవ్వడం లేదు. త్రివిక్రమ్ కాంబినేషన్ లో చేయబోయే సినిమాకు ఇప్పటికే స్క్రిప్ట్ వరకు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక ఈ సినిమాను జనవరిలో సెట్స్ మీదకు తీసుకెళ్లడం ఖాయమని చాలామంది భావించారు. కానీ ఇప్పటివరకు ఆ సినిమాపై త్రివిక్రమ్ గాని అల్లు అర్జున్ గాని… లేదంటే సినిమా నిర్మాతలు గాని ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. ఇక ఫిబ్రవరి థర్డ్ వీక్ లో ఈ సినిమా మొదలవుతుందని చాలామంది భావించారు.

కానీ ఇది కూడా ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది అనే క్లారిటీ వస్తుంది. ఇదే టైంలో తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ అల్లు అర్జున్ కు ఒక కథ చెప్పాడు. ఆ కదా బన్నీకి బాగా నచ్చేసింది. అల్లు అర్జున్ కు కూడా మంచి మార్కెట్ ఉండటంతో దాని తగ్గట్టుగానే ఆ కథను ప్రిపేర్ చేసుకుని రెడీ అయ్యాడు అట్లీ. దానికి అల్లు అర్జున్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లడం ఖాయమని భావిస్తున్నారు. అయితే ఈ సినిమాను డైరెక్ట్ గా బాలీవుడ్ లో ప్లాన్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది.

నార్త్ ఇండియాలో పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ కు అక్కడ హీరోలతో సమానంగా ఫాలోయింగ్ వచ్చింది. దీంతో దాన్ని కంప్లీట్ గా యూజ్ చేసుకోవాలని డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇక తమిళనాడు నేటివిటీకి తగ్గట్టుగా కూడా ఈ సినిమా ఉండే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకు ఎటువంటి క్లారిటీ ఇవ్వటం లేదు. బన్నీ రెడీ గానే ఉన్నా త్రివిక్రమ్ మాత్రం రెడీగా లేడు అనే ప్రచారం జరుగుతుంది. అయితే దీని వెనక ఏమైనా కారణాలు ఉన్నాయా అనేదానిపై కూడా క్లారిటీ రావడం లేదు. త్రివిక్రమ్ డ్రాప్ అయిపోయాడు అని కొంతమంది కామెంట్ చేస్తుంటే… మరి కొంత మంది మాత్రం అట్లీ కోసమే త్రివిక్రమ్ ను బన్నీ పక్కన పెట్టాడని మరి కొంతమంది కామెంట్ చేస్తున్నారు.