ఆ హీరో భార్యతో చిరంజీవి రొమాన్స్.. అనిల్ రావిపూడి అలా సెట్ చేస్తున్నాడన్నమాట..!

ఈ రోజుల్లో సీనియర్ హీరోల ఇమేజ్ కు సరిపోయే కథలు రాకుంటే ఇట్టే రాస్తున్నారు. ఎక్కడెక్కడ ఏ ఎమోషన్ పడాలి.. ఎక్కడ యాక్షన్ సీక్వెన్స్ పడాలి.. ఇలా పర్ఫెక్ట్ స్టోరీలు సిద్ధం చేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 17, 2025 | 12:20 PMLast Updated on: Mar 17, 2025 | 12:20 PM

Intersting News About Chiranjeevi And Anil Ravipudi Movie

ఈ రోజుల్లో సీనియర్ హీరోల ఇమేజ్ కు సరిపోయే కథలు రాకుంటే ఇట్టే రాస్తున్నారు. ఎక్కడెక్కడ ఏ ఎమోషన్ పడాలి.. ఎక్కడ యాక్షన్ సీక్వెన్స్ పడాలి.. ఇలా పర్ఫెక్ట్ స్టోరీలు సిద్ధం చేస్తున్నారు. కానీ ఒక్క విషయంలో మాత్రం దర్శకుల తల ప్రాణం తోకలోకి వస్తుంది. వాళ్లకు కథ రాసిన అంత ఈజీగా.. కథలో వాళ్ళు రాసుకున్న హీరోయిన్ ను బయట పట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా 60 ప్లస్ హీరోలకు జోడి దొరకడం బాగా కష్టమైపోతుంది. జూనియర్ హీరోయిన్లను తీసుకుందాం అనుకుంటేనేమో వాళ్ళు మరీ యంగ్ అయిపోతున్నారు.. సీనియర్ హీరోయిన్లతో ఆల్రెడీ రెండు మూడు సార్లు నటించారు. మళ్లీ వాళ్ళని రిపీట్ చేస్తే స్క్రీన్ మీద చూడడానికి అసలు కొత్తగా అనిపించదు. దాంతో ఈ విషయంలో తలలు పట్టుకుంటున్నారు దర్శకుడు.

తాజాగా చిరంజీవికి కూడా ఇలాంటి హీరోయిన్ సమస్యలు తప్పడం లేదు. ఆచార్యలో త్రిషని తీసుకొని మళ్ళీ పక్కన పెట్టేశారు.. కాజల్ పాపతో షూటింగ్ చేసి మరీ సీన్లు తీసేసారు. ఇక గాడ్ ఫాదర్ లో చిరంజీవికి హీరోయిన్ లేదు. వాల్తేరు వీరయ్యలో శృతిహాసన్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు చిరంజీవి. ఇక భోళా శంకర్ లో తమన్నాతోనే మళ్లీ నటించాడు. ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న విశ్వంభర సినిమాలో మరోసారి త్రిషతో జోడి కట్టాడు. ఇక త్వరలోనే సెట్స్ మీదకు రానున్న అనిల్ రావిపూడి సినిమా కోసం హీరోయిన్ వేట మొదలైంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ అఫ్ లాక్ చేశాడు అనిల్. వైజాగ్ లో కూర్చొని ఈ సినిమా స్క్రిప్ట్ మొదలు పెట్టాడు అనిల్ రావిపూడి. ఈ మధ్య చిరంజీవికి ఫస్ట్ అఫ్ చెప్తే సూపర్ గా నచ్చింది అని తెలుస్తుంది. మరో 20 రోజుల్లో సెకండ్ హాఫ్ కూడా పూర్తి కానుంది.

ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ కోసం బాగా వెతికేస్తున్నాడు అనిల్. చిరు కోసం బాలీవుడ్ హీరోయిన్, హీరో సిద్ధార్థ్ భార్య అదితిరావు హైదరీని ఒప్పించే పనిలో పడ్డాడు అనిల్. ఆమెకు కథ కూడా చెప్పినట్టు తెలుస్తుంది. అదితితో పాటు హ్యూమా ఖురేషి, ఐశ్వర్య రాజేష్ లాంటి హీరోయిన్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అన్నీ కుదిరితే జూన్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుంది. కేవలం మూడు నెలల్లో షూటింగ్ పూర్తి చేసి ఆరు నెలల్లో సినిమా విడుదల చేయాలి అనేది అనిల్ రావిపూడి ప్లాన్. దానికి ముందే అన్నీ పర్ఫెక్ట్ గా సెట్ చేసుకోవాలని చూస్తున్నాడు అనిల్. ఈ సినిమాలో చిరంజీవి ఫుల్ మాస్ క్యారెక్టర్ చేయబోతున్నాడు. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేనంత ఎగ్జైటింగ్ గా కనిపిస్తున్నాడు మెగాస్టార్. చాలా సంవత్సరాల తర్వాత తనకు మళ్ళీ ఒక ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు లాంటి సినిమా రాబోతుంది అంటున్నాడు. తన కామెడీ టైమింగ్ కు అనిల్ రావిపూడి యాడ్ అయితే బాక్సాఫీస్ మోత మోగిపోతుందనేది చిరంజీవి కాన్ఫిడెన్స్. 2026 సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. మరి మెగాస్టార్ నమ్మకాన్ని అనిల్ రావిపూడి ఎంతవరకు నిలబెడతాడో చూడాలి..!