2 రోజుల షూటింగ్ కు అన్ని లక్షలా..? వామ్మో హరీష్ శంకర్ బాగా కాస్ట్ లీ..!
ఈ మధ్య డైరెక్టర్స్ కేవలం డైరెక్షన్ మాత్రమే కాదు యాక్టింగ్ మీద కూడా ఫోకస్ చేస్తున్నారు. ఆమధ్య సీనియర్ దర్శకుడు వివి వినాయక్ ఓ సినిమా హీరోగా మొదలుపెట్టి ఆపేశాడు.

ఈ మధ్య డైరెక్టర్స్ కేవలం డైరెక్షన్ మాత్రమే కాదు యాక్టింగ్ మీద కూడా ఫోకస్ చేస్తున్నారు. ఆమధ్య సీనియర్ దర్శకుడు వివి వినాయక్ ఓ సినిమా హీరోగా మొదలుపెట్టి ఆపేశాడు. ఆ తర్వాత మరికొందరు దర్శకులు కూడా నటులుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తాజాగా హరీష్ శంకర్ కూడా మరోసారి నటుడుగా మారారు. ఈయన నటించడం ఇదే తొలిసారి కాదు. అప్పట్లో అందరివాడు, తరుణ్ నిన్నే ఇష్టపడ్డాను లాంటి సినిమాల్లో నటించాడు హరీష్. దర్శకుడుగా మారిన తర్వాత ఫోకస్ అంతా అక్కడే పెట్టాడు. చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ ఈయన కెమెరా ముందుకు రాబోతున్నాడు. సుహాస్ హీరోగా తెరకెక్కుతున్న ఓ భామ అయ్యో రామ సినిమాలో హరీష్ శంకర్ కూడా నటిస్తున్నాడు. ఈయన మీద రెండు రోజుల పాటు కొన్ని సన్నివేశాలు ఈ మధ్యే చిత్రీకరించారు దర్శక నిర్మాతలు. సాధారణంగా దర్శకులు గెస్ట్ రోల్స్ చేస్తే ఫ్రీగానే నటించారు అనుకుంటారు. హరీష్ శంకర్ కూడా అలాగే నటించాడు అని చాలామంది అనుకుంటున్నారు.
కానీ ఈ సినిమా కోసం ఆయన భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తుంది. కేవలం రెండు రోజుల షూటింగ్ కోసం ఆయన నాలుగు లక్షలు పారితోషికం డిమాండ్ చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. చివరికి నిర్మాతలు రోజుకు లక్షన్నర రూపాయల వరకు ఒప్పించి షూటింగ్ పూర్తి చేశారు. అంటే రెండు రోజుల షూటింగ్ కు మూడు లక్షలు వసూలు చేశాడు హరీష్ శంకర్. ఈ లెక్కన మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ఆర్టిస్ట్ అన్నమాట. ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది మాత్రమే రెండు లక్షలు ఒకరోజుకు చార్జ్ చేస్తున్నారు. హరీష్ శంకర్ కూడా కేవలం రెండు రోజులకు ఆ రేంజ్ లో తీసుకున్నాడు. సినిమాకు హరీష్ శంకర్ గెస్ట్ రోల్ హెల్ప్ అవుతుందని బలంగా నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు.
అందుకే పట్టుబట్టి మరీ ఈ దర్శకుడితో క్యారెక్టర్ చేయించారు. ఒకవేళ ఓ భామ అయ్యో రామ హిట్ అయితే ఆ తర్వాత నటుడుగా కూడా హరీష్ శంకర్ బిజీ అవుతాడేమో మరి..! దర్శకుడిగా ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నాడు హరీష్. కాకపోతే పవన్ కళ్యాణ్ ఉన్న బిజీకి ఈ సినిమా ఇప్పట్లో పూర్తవడం కష్టమే.. అసలు పూర్తవుతుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ ఖాళీ టైంలో నటుడిగా అలా ఒక రాయి వేసి వచ్చాడు హరీష్.