పవన్ కళ్యాణ్ లేడు.. రజినీకాంత్ లేడు.. అందర్నీ మడత పెట్టేసిన ఆ సూపర్ స్టార్..!

కొన్ని సినిమాలకు నిర్మాతలతో పని ఉండదు.. దర్శకులతో పని ఉండదు.. కేవలం హీరో కారణంగానే అవి ట్రెండింగ్ అవుతూ ఉంటాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 5, 2025 | 02:50 PMLast Updated on: Mar 05, 2025 | 2:50 PM

Intersting News About Hero Vijay

కొన్ని సినిమాలకు నిర్మాతలతో పని ఉండదు.. దర్శకులతో పని ఉండదు.. కేవలం హీరో కారణంగానే అవి ట్రెండింగ్ అవుతూ ఉంటాయి. అలాంటి సినిమానే జన నాయగన్. విజయ్ హీరోగా వినోద్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ఇందులో అంత ప్రత్యేకత ఏముంది అనుకోవచ్చు.. ఇది విజయ్ చివరి సినిమా. దీని తర్వాత పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్తున్నాడు ఈ హీరో. ఇప్పటికే తమిళ వెట్రి కలగం పార్టీ పెట్టి జనాల్లోకి వెళ్తున్నాడు విజయ్. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలనే టార్గెట్ గా చేసుకుని ముందుకు వెళుతున్నాడు దళపతి. విజయ్ జోరు చూస్తుంటే కచ్చితంగా రాబోయే ఎన్నికల్లో గేమ్ చేంజర్ అవుతాడని అర్థం అవుతుంది. ఇప్పటికిప్పుడు అధికారంలోకి వస్తాడా లేదా తెలియదు కానీ ఖచ్చితంగా అధికారం రావాలంటే తన అవసరం ఉండేలా రాజకీయాలు చేస్తున్నాడు విజయ్. ప్రజలు కూడా ఈయనను బలంగా నమ్మేలా కనిపిస్తున్నారు. అందుకే తనను నమ్మిన ప్రజల కోసం సినిమాలు వదిలేస్తున్నాడు ఈ హీరో.

విజయ్ చివరి సినిమా జన నాయగన్ సృష్టిస్తున్న రికార్డులు చూస్తుంటే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. మామూలుగానే విజయ్ సినిమా అంటే బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతుంది. కొన్ని సంవత్సరాలుగా ఈయన ఉన్న ఫామ్ చూసి బయర్లు ఎంత పెట్టడానికైనా వెనకాడడం లేదు. యావరేజ్ టాక్ వచ్చిన సినిమాలతో కూడా 400 కోట్లు తీసుకొస్తున్నాడు విజయ్. గతేడాది గోట్ 450 కోట్లు.. లియో 500 కోట్లు వసూలు చేశాయి. అంతకు ముందు వచ్చిన సినిమాలు కూడా కనీసం 300 కోట్లు వసూలు చేశాయి. దాంతో ఇప్పుడు విజయ్ చివరి సినిమా కోసం పోటీ పడుతున్నారు బయ్యర్లు. ముఖ్యంగా ఓవర్సీస్ లో జన నాయగన్ సినిమాను 80 కోట్లకు కోరుతున్నట్లు తెలుస్తోంది. తమిళ సినిమాల్లో ఇప్పటి వరకు ఇదే రికార్డు.

కేవలం తమిళనాడులో కూడా దాదాపు 150 కోట్ల బిజినెస్ జరుగుతుంది. ఇప్పటివరకు 100 కోట్ల బిజినెస్ దాటిన సినిమాలు కూడా అక్కడ లేవు. అలాంటిది విజయ్ చివరి సినిమా కోసం ఆల్ టైం బెట్ కాస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు. కచ్చితంగా ఈ సినిమాకు ఊహించిన దానికంటే ఎక్కువ కలెక్షన్స్ వస్తాయని.. అసలు ఎవరి ఊహకు అందరి రేంజ్ లో ఈ సినిమా కలెక్షన్స్ ఉంటాయని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. అందుకే నిర్మాతలు ఎంత చెప్తే అంత ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు బయ్యర్లు. ఇండియా ఓవర్సీస్ అని సంబంధం లేకుండా అన్నిచోట్ల రికార్డు బిజినెస్ చేస్తుంది చాలా నాయగన్. తెలుగులో కూడా ఈ సినిమా రైట్స్ కోసం పోటీ బాగానే ఉంది. ఇది భగవంత్ కేసరి రీమేక్ అంటున్నారు కానీ అలాంటిదేం లేదని ఫ్రెష్ కథతోనే ఈ సినిమా వస్తుంది అంటున్నారు విశ్లేషకులు. మొత్తానికి బిజినెస్ విషయంలో రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ ను కూడా ఇట్టే దాటేసాడు విజయ్. రేపటి రోజు ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయితే తమిళ ఇండస్ట్రీ కలలు కంటున్న 1000 కోట్ల సినిమా కూడా విజయ్ ఇస్తాడేమో.