5000 కోట్ల కథ చెబుతాడా..? వరల్డ్ మీడియా ఇంటర్వూలు స్టార్ట్.
సూపర్ స్టార్ మహేశ్ బాబు 29వ మూవీ తాలూకు ఇంటర్వూలు మొదలయ్యాయి. ఏకంగా బీబీసీ, సీఎన్ ఎన్, ఏబీసీ ఛానల్స్ రాజమౌళి టీం మెంబర్స్ తో 30 వరకు ఇంటర్వూలు ఆల్రెడీ తీసేసుకున్నారు.

సూపర్ స్టార్ మహేశ్ బాబు 29వ మూవీ తాలూకు ఇంటర్వూలు మొదలయ్యాయి. ఏకంగా బీబీసీ, సీఎన్ ఎన్, ఏబీసీ ఛానల్స్ రాజమౌళి టీం మెంబర్స్ తో 30 వరకు ఇంటర్వూలు ఆల్రెడీ తీసేసుకున్నారు. విచిత్రం ఏంటంటే ఈ సినిమా షూటింగ్ పది శాతం కూడా పూర్తికాలేదు. రిలీజ్ ఎప్పుడో తేలలేదు. కాని అదేదో ఇప్పుడే మూవీ విడుదలకాబోతోందన్నట్టు ఇంటర్వూ సెషన్ నడుస్తోంది. అదే టాలీవుడ్ సినీ జనాలకే ఈ వ్యవహారం అర్ధంకావట్లేదు.అయితే, ఇక్కడ రాజమౌళి మాస్టర్ ప్లాన్ మతిపోగొట్టేలా ఉంది. ఈనెల 21న వరల్డ్ మీడియా సమక్షంలో ప్రెస్ మీట్ పెడుతున్నాడు. ఆ ప్రెస్ మీట ప్రీరిలీజ్ ఈవెంట్ ని మించేలా ఉంటుందట. అదే రోజు టైటిల్, స్టార్ కాస్ట్,రిలీజ్ డేట్ ఎనౌైన్స్ చేయబోతున్న రాజమౌళి, స్టోరీ లైన్ ని కూడా రివీల్ చేయబోతున్నాడు. దానికే ముందుగా టెక్నీషియన్స్ తో పాటు, అవతార్ ఫేం జేమ్స్ కామెరున్ అండ్ కో తో ఇంటర్వూస్ ప్లాన్ చేశాడట. ఈ మొత్తం వరల్డ్ మీడియా ని మేనేజ్ చేసే బాధ్యత ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ తీసుకుందట.. కేవలం ప్రెస్ మీటే సినిమా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారంటే… ఇంతకి ఏం జరుగుతోంది? హావేలుక్
సూపర్ స్టార్ మహేశ్ బాబు 29వ మూవీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఓ ట్రెండ్ సెట్టర్ అయ్యేలా ఉంది. అదేదో రిలీజ్ తర్వాతో, పోస్టర్ వచ్చాకో, కాన్సెప్ట్ తెలిశాకో ఇదో ట్రెండ్ సెట్టర్ అంటే అర్ధముంది. కాని ఇది వరల్డ్ టాప్ మూవీస్ లో ఉండే ఛాన్స్ ఉందని, వరల్డ్ వైడ్ మీడియా అటెన్షన్ ని లాగేసుకునే సీన్ ఉందని , కేవలం మూడు షెడ్యూల్స్ షూటింగ్ జరిగాకే చెప్పటం అందరినీ షాక్ గురిచేస్తోంది.కాని ఇందులో చాలా వరకు నిజముంది. డమ్మీ మ్యాటర్స్ తో, రూమర్స్ తో కాలాన్ని, మార్కెట్ ని బ్లఫ్ చేసే పని రాజమౌళి చేయడు. బాహుబలితో సౌత్ నార్త్ అడ్డుగోడల్ని కూల్చాడు. త్రిబుల్ఆర్ తో గ్లోబల్ అటెన్షన్ లాక్కొచ్చాడు. ఆస్కార్ లో తెలుగు వెలుగులు చూపించాడు. ఇప్పుడు హాలీవుడ్ మార్కెట్ ని టార్గెట్ చేసేందుకు వరల్డ్ మీడియాను ప్రెస్ మీట్ కి 3 వారాల ముందే తీసుకొచ్చాడు. 30 ఇంటర్వూలకు పైగా ఇచ్చాడు.
ఈ ఇంటర్వూలు అన్నీ, ఏప్రిల్ 21న పెట్టే ప్రెస్ మీట్ కంటెంట్ కి యాడ్ చేసి, వరల్డ్ వైడ్ గా టాప్ టీవీ ఛానల్స్ లోన్యూస్ గా వదలబోతున్నారు. బేసిగ్గా ప్రెస్ మీట్ పెడితే, మీడియా రావటం, ప్రశ్నలు వేసి, ఆ కంటెంట్ ని న్యూస్ లో వేయటం కామన్. కాని ఇండియ నెంబర్ వన్ డైరెక్టర్అయిన రాజమౌళి రూటే సెపరేటు.అవతార్ ఫేం జేమ్స్ కామెరున్, జురాసిక్ ఫేం స్టీవెన్ స్పిల్ బర్గ్ లను రంగంలోకి దింపి, వాళ్లతో కలిసిప్రెస్ మీట్ ప్లాన్ చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా 55 వేల స్క్రీన్స్ లో రిలీజ్ కాబోయే మొదటి ఇండియన్ సినిమాగా, ఆల్రెడీ ఈమూవీకి వరల్డ్ వైడ్ మీడియా అటెన్షన్ వచ్చింది. డిస్నీప్, డ్రీమ్ వర్క్స్ లాంటి హాలీవుడ్ దిగ్గజాలే, ఈమూవీని వరల్డ్ వైడ్ గా డిస్ట్రిబ్యూట్ చేయబోతుండటం, నెంబర్ వన్ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ నుంచి రాజమౌళి ప్రాజెక్ట్ కి అన్ని విదాల సపోర్ట్ ఉండటంతో, సీనే మారిపోతోంది.
అసలు ఈ సినిమా టైటిల్ ఏంటి, ఎప్పుడు రిలీజ్, స్టార్ కాస్ట్ మొత్తం ఎంతమంది, అసలు స్టోరీ పాయింట్ ఏంటనేది చెప్పడానికే ఇంత గట్టి ఎరేంజ్ మెంట్స్ ని రెడీ చేస్తున్నాడు రాజమౌలి. ఆల్రెడీ 30 ఇంటర్వూస్ చేశారంటే, అంతా టెక్నీషియన్స్, స్టార్ కాస్ట్ నే అని తెలుస్తోంది. ఇవన్నీ ప్రెస్ మీట్ రోజు రివీల్ చేయటమే కాదు, యూరప్, నార్త్ అమెరికా, బ్రెజీల్, రష్యా, జపాన్, కొరియా ఇలా మొత్తంగా 120 వరకు వరల్డ్ వైడ్ మీడియా ముఖ్యలు ఈ ప్రెస్ మీట్ కి రాబోతున్నారు. కాబట్టే మూడు వారాలుగా రకరకాల ఇంటర్వూలు ముందే ప్లాన్ చేశారు. ఆల్రెడీ కొన్ని జరిగాయి.