సూపర్ లుక్ లీకైతే లీకైంది కాని.. క్యారెక్టర్ ఏంటో తేలింది..
సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి తీస్తున్న మూవీ తాలూకు లుక్ లీకైంది. లాంగ్ హేయిర్, రఫ్ గా గడ్డం లుత్ తో టూ మచ్ మాసీగా ఉన్నాడు మహేశ్ బాబు. ఇప్పుడీ లీక్ కావాలని వదిలారా? లేదంటే ఫిల్మ్ టీం లో ఎవరో ఒకరు కొంపముంచారా అన్నది వేరే విషయం...

సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి తీస్తున్న మూవీ తాలూకు లుక్ లీకైంది. లాంగ్ హేయిర్, రఫ్ గా గడ్డం లుత్ తో టూ మచ్ మాసీగా ఉన్నాడు మహేశ్ బాబు. ఇప్పుడీ లీక్ కావాలని వదిలారా? లేదంటే ఫిల్మ్ టీం లో ఎవరో ఒకరు కొంపముంచారా అన్నది వేరే విషయం… కాని ఈ ఒక్క లుక్ లీకయ్యాకే అసలు సంగతి తేలింది. హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ ప్రేరణగా ఈ సినిమా తెరకెక్కుతోందని మొన్నటి వరకు ప్రచారం జరిగింది. ఇప్పుడు అది కన్ఫామ్ అయ్యింది. అంతగా మహేశ్ బాబు లుక్ లో అలా ఎలా ఇండియానా జోన్స్ తో ఈసినిమాకున్న లింక్ లీకైంది..? అన్ని డిటేల్స్ ఏవి తన లుక్ లో కనిపించాయి…లాంటి డౌట్స్ ఎవరికైనా రావొచ్చు.. అక్కడే క్లారిటీ దొరుకుతోంది. ఇండియానా జోన్స్ కేటగిరీలో సినిమాలన్నీ అయిపోయాయి. ఇక మీదట ఈ ఫ్రాంచైజీలో మూవీలుండవనే లాస్ట్ టైం తేలింది. అక్కడ తీయటం కుదరదని, ఇక్కడ ఇప్పుడు అదే కథని పంపించేస్తోంది హాలీవుడ్ సంస్త… ఇంతకి ఇదే నిజమనటానికి, లీకైన సూపర్ స్టార్ మహేవ్ బాబు లుక్ కి ఉన్న లింకేంటి? టేకేలుక్
సూపర్ స్టార్ మహేశ్ బాబు తో రాజమౌళి తీస్తున్న మూవీ వర్కింగ్ టైటిల్ మహారాజా…. అసలు టైటిల్ మాత్రం ఏప్రిల్ 20కి ప్రెస్ మీట్ పెట్టి రివీల్ చేయబోతున్నారు. సో ఆరోజే హీరో లుక్ తోపాటు పోస్టర్ ని రిలీజ్ చేద్దామంటే, ఈలోపే ఓ అత్యుత్సాహవంతుడు సెట్లోనే మహేశ్ లుక్ ని ఫోన్ లో తీసి, బయటికి వదిలాడు.. ఇప్పుడా మహానుభావుడు ఎవరా అని వెతుకుతోంది ఫిల్మ్ టీం.సరే ఇది పీఆర్ స్టంటో, పబ్లిసిటి కోసంమో అనుకునే పరిస్థితి లేదు. అసలు సినిమా లాంచ్ కే మీడియాని పిలవని రాజమౌలి, ఇలా పబ్లిసిటీకోసం మహేశ్ లుక్ ని లీక్ చేయిస్తాడనుకోలేం. పక్కగా కావాలని ఫిల్మ్ టీంలో ఎవరో ఘటికుడు చేసిన పనే అనంటున్నారు. సరే లీకైతే అయిపోయింది. లాంగ్ హేయిర్ కాస్త కర్లీగా ఉండటం, మాసినట్టు గెడ్డం.. కాస్త హాలీవుడ్ హీరో లుక్ లో ఉన్నాడు మహేశ్ బాబు
అంతేకాదు ఇందులో సూపర్ స్టార్ మహేవ్ బాబు కళ్లు బ్లూ ఐస్ అని తెలుస్తోంది. అదే నిజమైతే, ఇండో అమెరికన్ గా ఇందులో మహేశ్ బాబు లుక్ ఉండబోతోందన్న వార్తే నిజమయ్యేలా ఉంది. అమెరికన్ తండ్రి, ఇండియన్ తల్లికి పుట్టిన వ్యక్తిగా మహేశ్ బాబు కనిపించబోతున్నాడట. తన జుట్టు రంగు, లీకైన తన లుక్ చూస్తుంటే, ఇదే అర్ధమౌతోంది.ఇక హాలీవుడ్ లో ఇండియాన జోన్స్ ఫ్రాంచైజీలో స్టీవెన్ స్పిల్ బర్గ్ 4 సినిమాలు తీశాడు. క్రిస్టల్ స్కల్స్ మాత్రమే తన చివరి సినిమా. ఆతర్వాత మొన్నొచ్చిన ఇండియానా జోన్స్ డయల్ ఆఫ్ డెస్టినీ మూవీ నే ఈ ఫ్రాచైజీలో చివరి సినిమా. అది కూడా స్టీవెన్ స్పిల్ బర్గ్ కాకుండా జేమ్స్ మ్యాన్ గోల్డ్ తీశాడు..
ఐతే ఐదో సీక్వెల్ తర్వాత ఇండియానా జోన్స్ ఆగిపోయింది కాబట్టి, ఆసినిమా రైట్స్ ని అందులోని పాత్రల తాలూకు రైట్స్ ని రాజమౌలి టీం కొనేసిందనే మాటలు వినిపించాయి. ఇప్పుడవి నిజమని తేలుతున్నాయి. ఎందుకంటే ఇండియానా జోన్స్ క్రిస్టల్ స్కల్ లో తనకొడుకుగా షియా లాబేవుఫ్ కనిపించాడు. ఐతే తనకి, ఇండియన్ మదర్ కి పుట్టిన వ్యక్తిగా మహేశ్ కనిపిస్తాడనే పుకారు చాలా రోజుల నుంచి వినిస్తోంది. కాస్త ఫన్నీగా అనిపించినా, ఇదినిజమేమో అనేలా ఇప్పుడుమహేశ్ బాబు లుక్ షాక్ ఇస్తోంది. అమెరికన్స్ జుట్టు లా మహేశ్ హేయిర్ స్టైల్ ఉండటం, తనకి నీలి కళ్లు ఉండటం ఇవన్నీ ఇండియానా జోన్స్ కి సినిమాను కనెక్ట్ చేయటమే అనంటున్నారు. ఇదే నిజమైతే, అసలు ప్రమోషనే లేకుండా, ఈ సినిమా ఏకంగా హాలీవుడ్ లోనే సెన్సేషన్ అవుతుంది…