సోషల్ మీడియాలో లీకైన ఆ వీడియో.. లబోదిబోమంటున్న రాజమౌళి..!
అతి జాగ్రత్తకు పోతే అసలుకే ఎసరొచ్చేలా కనిపిస్తుందిప్పుడు. మరీ ముఖ్యంగా రాజమౌళి విషయంలోనే ఇది జరుగుతుంది. మహేష్ బాబు సినిమాతో బిజీగా ఉన్న ఈయన.. SSMB29 లుక్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు.

అతి జాగ్రత్తకు పోతే అసలుకే ఎసరొచ్చేలా కనిపిస్తుందిప్పుడు. మరీ ముఖ్యంగా రాజమౌళి విషయంలోనే ఇది జరుగుతుంది. మహేష్ బాబు సినిమాతో బిజీగా ఉన్న ఈయన.. SSMB29 లుక్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఎంతంటే కనీసం ఇప్పటి వరకు మహేష్ బాబును బయట కూడా కనిపించకుండా ఆపగలిగాడు. ఎక్కడా ఏ చిన్న ఫోటో కూడా బయటికి రాలేదు. కానీ అరచేతిని అడ్డుపెట్టి సూర్యున్ని ఆపగలరా..? ఇప్పుడున్న సోషల్ మీడియా యుగంలో లుక్స్ రాకుండా దాచగలరా..? ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎక్కడో ఓ చోట అయితే లీక్ అవ్వక తప్పదు. ఇప్పుడూ ఇదే జరిగింది. మహేష్ బాబు లుక్ బయటికి వచ్చేసింది.. ఫోటో కాదు ఏకంగా వీడియోనే విడుదలైపోయిందిప్పుడు.
అది చూసి షాక్ అవ్వడం తప్ప మరో ఆప్షన్ లేకుండా పోయింది టీంకు. మరోవైపు అభిమానులు మాత్రం పండగ చేసుకుంటున్నారు. మహేష్ బాబును చూసి ఏమున్నాడ్రా బాబూ.. లుక్ అదిరిపోయిందిగా అంటూ కాలర్ ఎగరేస్తున్నారు. సినిమా ఓపెనింగ్‌కు ముందు మహేష్ బాబు బయట చాలా సార్లు కనిపించాడు. గడ్డం పెంచుకుని.. జుట్టు పెంచుకుని కొత్తగా మేకోవర్ అయ్యాడు. అయితే ఇదే సినిమా లుక్ అయ్యుంటుంది అని అంతా అనుకున్నారు. కానీ సినిమా కోసం మరోలా కనిపిస్తున్నాడు మహేష్. గడ్డం అయితే లేదు కానీ జుట్టు మాత్రం భారీగానే పెంచేసాడు సూపర్ స్టార్.
ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ సినిమా కాబట్టి సింహంలా జుట్టు పెంచి కనిపిస్తున్నాడు మహేష్. ఈయన జిమ్‌లో అద్దం ముందు నిలబడి ఉన్న వీడియో బయటికి వచ్చిందిప్పుడు. సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంది ఈ వీడియో. దీన్ని డిలీట్ చేయడానికి చాలా తంటాలు అయితే పడుతున్నారు కానీ ఇప్పటికే అది వైరల్ అయిపోయింది.. ట్రెండ్ కూడా అవుతుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లోనే జరుగుతుంది. మహేష్ బాబు కూడా ఈ షెడ్యూల్‌లో ఉన్నాడు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, జాన్ అబ్రహాం కీలక పాత్రల్లో నటిస్తున్నారు.