500 మందితో 2000 కోట్లు.. మరి 100 మందితో..

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డైలాగ్ కొడితే ఎలా ఉంటుంది. చెర్రీ చేసిన మగధీర మూవీలో ఎపిక్ సీన్ వందమందితో హీరో ఫైట్ చేయటం.. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ వందమందిని ఒక్కసారే పంపించంటాడు హీరో... అచ్చంగా ఇలానే

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 21, 2025 | 08:30 PMLast Updated on: Mar 21, 2025 | 8:30 PM

Intersting News About Ntr And Hrithik Roshan Movie

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డైలాగ్ కొడితే ఎలా ఉంటుంది. చెర్రీ చేసిన మగధీర మూవీలో ఎపిక్ సీన్ వందమందితో హీరో ఫైట్ చేయటం.. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ వందమందిని ఒక్కసారే పంపించంటాడు హీరో… అచ్చంగా ఇలానే వందమందితో ఫైట్ చేసే సిన్ ఎన్టీఆర్ మూవీలో డిజైన్ చేశారు. ఆల్రెడీ షూట్ చేశారు.అలాని మగధీరని ఫాలో అయ్యారని కాదు.. అక్కడ వందమందితో హీర ఫైట్ చేశాడు.. ఇక్కడ హీరో వందమందిని నలిపేస్తాడు… ఫైటింగ్ లో ఎమోషన్, లొకేషన్ వేరు కావొచ్చు.. కాని నెంబర్ సేమ్ కాబట్టే ఇప్పుడీ మ్యాటర్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేలా ఉంది. ఐతే త్రిబుల్ ఆర్ లో కూడా ఇలానే 2 వేల మంది ఒక్కడి మీద ఎగబడితే, అక్కడ హీరో ఎలా ఫైట్ చేశాడనే సీన్ ఇప్పటికీ గూస్ బంప్స్ తెప్పిస్తుంది… సో మొత్తంగా అన్ని విషయాల్లో ఎన్టీఆర్ ని రామ్ చరణ్ ఫాలో అవుతుంటే, ఒక్క ఫైట్ సీన్ విషయంలో రెండు చరణ్ మూవీలని ఫాలో అయినట్టున్నారు వార్ 2 మేకర్స్.. ఇంతకి ఆఫైట్ కోసం ఎంత ఖర్చు పెట్టారో తెలుసా… ? 50 కోట్లు… ? అంతగా అందులో ఏముందో చూసేయండి…

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ ని ఎప్పుడో పూర్తి చేశాడు. హ్రితిక్ పాదానికి గాయం అవటం వల్ల, కొంత ప్యాచ్ వర్క్, లాస్ట్ సాంగ్ లో చివరి 30 సెకన్ల పెండింగ్ షూటింగ్ వాయిదా పడింది. ఏప్రిల్ 20లోగా వార్ 2ప్రీ క్లైమాక్స్ ఫైట్, లాస్ట్ సాంగ్ షూటింగ్ ని పూర్తిచేయబోతున్నారు. ఏప్రిల్ థర్డ్ వీక్ నుంచి డ్రాగన్ సెట్లో ఎన్టీఆర్ అడుగుపెట్టబోతున్నాడంటే,ఆలోపే వార్ 2 షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది.అయితే వార్ 2 ప్రీ క్లైమాక్స్ సీన్ లో ఎన్టీఆర్ వందమందితో ఫైట్ చేసే సీన్ ని, మగధీర రేంజ్ లో ప్లాన్ చేశారట. వందమంది ఒక్కసారి తన మీద పడితే హీరో ఎలా ఫైట్ చేస్తాడనేలా వార్ 2 లో ఎన్టీఆర్ సీన్ ని సాలిడ్ గా తీశారట. ఈ సీన్ షూటింగ్ ఆల్రెడీ అయిపోయింది. నిర్మాత ఆదిత్య చోప్రా కి ఈ సీన్ తెగ నచ్చే, సోలో హీరోగా మరో ప్రాజెక్ట్ ఆఫర్ చేశాడని ఆమధ్య బాలీవుడ్ మీడియాలో న్యూస్ వైరలైంది.

ఐతే మగధీరాలో హీరో ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్ వందమందిని ఒక్కసారిగా పంపపమనటం, అలానే పంపాక వందమందిని చంపాక హీరో లోయలోకి దూకడం జరిగింది. కాని ఇక్కడ వార్ 2 లో కంప్లీట్ వందమంది తన మీద ఒకేసారి దాడి చేస్తే, ఆ గొడవ త్రిబుల్ ఆర్ లోచరణ్ ఎంట్రీ సీన్ లా ఉంటుంది…కాని దాన్నే హాలీవుడ్ యాక్షన్ సీక్వెన్స్ స్టైల్లో తీశారని తెలుస్తోంది.ఫలితంగా ఆ ఫైట్ సీన్ కి 55 కోట్లు ఖర్చయ్యిందట. సెట్ కి 10కోట్లయితే, హాలీవుడ్ నుంచి పిలిపించిన స్టంట్ మ్యాన్ లు, వాళ్ల రెమ్యునరేషన్లు, టెక్నికల్ ఎక్విప్ మెంట్ కి 15 కోట్ల వరకు ఖర్చయ్యిందట. ఇక ఆ ఫారిన్ ఫేస్ లని ఇండియన్ ఫైటర్స్ లాచూపించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ సాయం తీసుకోవటంతో దానికి మరో 30 కోట్లు ఖర్చయ్యాయని తెలుస్తోంది.

మొత్తానికి వార్ 2 లో ఎన్టీఆర్ వందమందితో ఫైట్ చేసే సిన్ 12 నిమిషాలుంటుందని సమాచారం అందుతోంది. ఇక ఏప్రిల్ 20 తర్వాత డ్రాగన్ సెట్లో అడుగుపెట్టబోతున్న తారక్, అక్కడ కూడా వచ్చీ రాగానే భారీ యాక్షన్ సీన్ తో బిజీ కాబోతున్నాడు. 12 రోజులు పాటు కార్ ఛేజింగ్ ఫైట్ సీన్ ని తెరకెక్కించబోతోంది ఫిల్మ్ టీం. మొత్తంగా త్రిబుల్ ఆర్ లో అమాయకంగా కనిపించే బలస్తుడిగా, దేవరలో మాస్ ఎటాకర్ గా కనిపించిన తారక్, వార్ 2 లో స్టైలిష్ అటాకర్ గా దుమ్ముదులపోతున్నట్టు తెలుస్తోంది. డ్రాగన్ లో అల్ ట్రా స్టైలిష్ ఫైట్లు ప్లాన్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది.