670 కోట్లు రాబట్టాక… 30 కోట్లతో 330 కోట్లకు వల…
వార్ 2 షూటింగ్ ఈనెల 15 లోపు పూర్తి కాబోతోంది. కేవలం సాంగ్ షూటింగ్ మాత్రమే పెండింగ్ అని తెలుస్తోంది. వచ్చే నెలనుంచి డ్రాగన్ షూటింగ్ తో బిజీ కాబోతున్నాడు తారక్.

వార్ 2 షూటింగ్ ఈనెల 15 లోపు పూర్తి కాబోతోంది. కేవలం సాంగ్ షూటింగ్ మాత్రమే పెండింగ్ అని తెలుస్తోంది. వచ్చే నెలనుంచి డ్రాగన్ షూటింగ్ తో బిజీ కాబోతున్నాడు తారక్. మరి ఈలోపు ఏం చేస్తాడంటే, జపాన్ లో రిలాక్స్ కాబోతున్నాడు. జపాన్ లో దేవర రిలీజ్ కాబోతోందని తేలింది. మార్చ్ 28న రిలీజ్ డేట్ వచ్చేసింది. ఆల్రెడీ ఎన్టీఆర్ కూడా ఈ సినిమా ప్రమోషన్ కోసం జపాన్ వెళుతున్నాడని వార్తలొచ్చాయి. కాని ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్ డేట్ ఏంటంటే 30 కోట్లు కేవలం జపాన్, ఇండోనేషియా ప్రమోషన్ కే కేటాయిస్తున్నారట. చైనాలో బాహుబలి కోసం ఇలానే ఖర్చు చేశారు. ఆమిర్ ఖాన్ తన దంగల్ ని 2 వేల కోట్ల మూవీగా మార్చేందుకు అప్పట్లో 50 కోట్లు ఖర్చు చేశాడు. సో ఆల్రెడీ ఇండియాలో హిట్ అయిన మూవీలు చైనాలోనో, జపాన్ లోనో దుమ్ముదులపాలంటే ఇలా ఖర్చుపెట్టాలా? దేవర ప్రమోషన్ కి పెట్టే 30 కోట్ల వెనక 1000 కోట్ల లెక్కలున్నాయా? అదేంటో చూసేయండి…
దేవర మార్చ్ 28న జపాన్ లో రిలీజ్ కాబోతోంది. 22న జపాన్ కి బయలుదేరనున్న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, అక్కడే 6 రోజులు 8 సిటీస్ తిరగబోతున్నాడు. ఇది రెండు రోజులుగా సోషల్ మీడియాని ఊపేస్తున్న వార్త… కొత్త అప్ డేట్ ఏంటంటే, దేవర జపానీస్ వర్షన్ ప్రమోషన్ కి ఏకంగా 30 కోట్లు ఖర్చు చేయబోతుండటం. ఏదో అక్కడున్న ఫ్యాన్స్ ని కూల్ చేయటానికో, లేదంటే అక్కడ ఎంతో కొంత మార్కెట్ పెంచుకోవటానికో సినిమాను ప్రమోట్ చేస్తున్నారనుకుంటే అర్ధం ఉంది. కాని దానికి 30 కోట్లు పిచ్చోల్లై ఖర్చుచేస్తారా…? ఛాన్సేలేదు. పక్కగా జపాన్ మార్కట్ వల్ల మన సినిమా స్థామినా పెరుగుతోంది. త్రిబుల్ ఆర్ మూవీ జపాన్ లో 81 కోట్లు రాబట్టింది. చాలా తక్కువే కా అని అనిపించొచ్చు.
కాని జపాన్ థియేట్రికల్ బిజినెస్ కాకుండా, సోషల్ మీడియా, ఓటీటీ, ఇలా కూడా అక్కడ మన సినిమాలకు 350 కోట్ల వరకు మార్కెట్ వ్యాల్యూ ఉంది. అంతెందుకు ఇండియాలో అత్యధికంగా వసూల్లు రాబట్టిన హిందీ మూవీ దంగల్ కి ఆ హోదా వచ్చిందే చైనా వసూళ్లతో…ఇండియాలో కేవలం 500 కోట్ల లోపే రాబట్టింది దంగల్ మూవీ. కాని చైనాలో 1500 కోట్ల వరకు వసూళ్లొచ్చాయి. అలా అది బాహుబలి తాలూకు 1850 కోట్ల వసూళ్లకంటే ఎక్కువ రాబట్టిన మూవీగా మారింది.
సో ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ బిజినెస్సే గొప్ప… తర్వాత యూఎస్, యూకేలో సెటిలైన తెలుగు వాళ్ల సంఖ్య పెరగటంతో, అక్కడ నుంచి కూడా రెవెన్యూ వస్తోంది.
ఓటీటీ, శాటిలైట్ తర్వాత ఇప్పడు జపాన్,చైనా, ఇండోనేషియా, మలేషియా కూడా ఇండియన్ సినిమాలకు అడ్డాగా మారుతున్నాయి. ఈ విషయంలో చైనాని ఆమిర్ ఖాన్ మూవీలు కబ్జా చేస్తే, జపాన్ ని ఒకప్పుడు రజినీకాంత్ సినిమాలు కబ్జా చేసేవి.. కాని ప్రభాస్, ఎన్టీఆర్, కి జపాన్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుండటంతో, ఆ మార్కెట్ ని నెగ్లెక్ట్ చేయలేని పరిస్తితి..అంతేకాదు జపాన్ మార్కెట్ ని డామినేట్ చేసే థియేటర్స్ చైన్ సిస్టమ్, ఓటీటీ బ్యాచ్ కొరియా, ఇండోనేషియాని కూడా కంట్రోల్ చేస్తారనే టాక్ ఉంది. సో జపాన్ లో మన మూవీ ఆడితే, వాల్ల సాయంతో కొరియా, ఇండోనేషియా మార్కెట్ లో కూడా ఈజీగా మన సినిమాను సేల్ చేసుకోవచ్చు.. అలా లెక్కేస్తే దేవరకి జపాన్, ఇండోనేషియాలో ఏమాత్రం మంచి టాక్ వచ్చినా 100 కోట్ల నుంచి 300 కోట్ల వసూల్లొచ్చే ఛాన్స్ ఉంది. అందుకే 1000 కోట్ల క్లబ్ లో కాస్త ఆలస్యంగా అయినా ఈ మూవీ అడుగుపెట్టేలా ఉందనంటున్నారు. ఆచాన్స్ ఉంది కాబట్టే, 30 కోట్ల పెట్టుబడి వారంరోజులు 8 జపాన్ నగరాల్లో ప్రమోషన్ కోసం తారక్ ఇంతగా కష్టపడేందుకు సిద్దపడ్డాడనంటున్నారు.