పాన్ ఇండియా కింగ్ పేరుతో ఊరు… బాలీవుడ్ కి ఝలక్.
పాన్ ఇండియా కింగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టింది గోదావరి జిల్లాలో... బేసిగ్గా తను భీమవరం బుల్లోడు.. కాని ఇప్పుడు తను నేపాల్ కుర్రోడు అని తేలింది

పాన్ ఇండియా కింగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టింది గోదావరి జిల్లాలో… బేసిగ్గా తను భీమవరం బుల్లోడు.. కాని ఇప్పుడు తను నేపాల్ కుర్రోడు అని తేలింది. ప్రభాస్ ఊరు అసలు మొగల్తూరే కాదనే డిస్కర్షన్ పాన్ ఇండియా లెవల్లో కొత్తగా మొదలైంది. సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరలైంది. నేపాల్ లో ఏకంగా ప్రభాస్ పేరుతో ఓ ఊరే ఉంది. మరి అక్కడ ఫ్యాన్సే ఇలా పేరు పెట్టారా? ఆ పేరుంది కాబట్టే ఆ ఊరి పేరుని ఇలా సోషల్ మీడియాలో హైలెట్ చేశారా అన్నది, అసలు పాయింటే కాదు… అసలు డిస్కర్షన్ ఏంటంటే ఇది కూడా బాలీవుడ్ కి నచ్చట్లేదు. బేసిగ్గా సౌత్ సినిమాలు ఆడితేనే వాళ్లు తట్టుకోలేకపోతున్నారు. ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీ ఇలా మనోల్లకి నార్త్ లో ఫ్యాన్స్ క్లబ్స్ ఉన్నాయంటేనే బాలీవుడ్ బ్యాచ్ ఏడ్చి చస్తోంది. అలాంటిది తెలుగు హీరో పేరుతో ఒక ఊరంటే వాళ్ల వల్ల అవుతుందా… ఇంతకాలం ఈజిప్టులో హిందీ హీరో పేరతో గల్లి, లేదంటే జర్మనిలో ఇంకేదో రోడ్డుకి హిందీ స్టార్లపేర్లని తెగ నీలిగారు.. కట్ చేస్తే నేపాల్ లో ఏకంగా ప్రభాస్ పేరుతో ఊరుంది. ఇది కాకుండా మేడం టుస్సాడ్ మ్యూజియం లో తెలుగు హీరోల మైనపు బొమ్మల సంఖ్య పెరుగోతోంది. మొత్తంగా ఇవన్నీ బాలీవుడ్ బ్యాచ్ ని నిద్ర పోకుండా చేస్తున్నాయి. సో టోటల్ గా వాళ్ల కుల్లు వెనకున్న థ్రిల్లింగ్ స్టోరీ ఏంటో చూసేయండి.
రెబల్ స్టార్ ప్రభాస్ పేరుతో నేపాల్ ఓ ఊరే ఉంది. ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అది వైరలైంది. అంతవరకు ఓకే కాని, ఓ పేరుతో ఊరుండటం గొప్పా అన్న డౌట్ వస్తుంది. కాని అక్కడే ట్విస్ట్ ఉంది. మామూలుగా బాలీవుడ్ స్టార్లతో రోడ్లు, గల్లీలు, లేదంటే ఏవైనా రెస్టారెంట్ల పేర్లు ఉండటం కామన్. అంతెందుకు మన హీరోల పేర్లతో కూడా సెలూన్లు అప్పడప్పుడు పల్లెటూర్లలో కనిపిస్తాయి. కొందరైతే హీరోల ఫోటోనే షాప్ కి పెట్టి, అదే పేరుతో కటింగ్ సెలూన్లు రన్ చేయటం కూడా చూస్తాం..
అది పెద్ద విషయం కాదు కానీ ప్రభాస్ పేరతో నేపాల్ లో ఒక ఊరు పేరుండటం విచిత్రంగా ఉంది. మూమూలుగా ఘజియా బాద్, గూర్కా లాండ్ , గుర్ గావ్, జామ్ నగర్ ఇలా ఊర్లు, లేదంటే పట్టనాల పేర్లుంటాయి. నేపాల్ కూడా హిందూ దేశం అవటం వల్ల అక్కడ ఇంచుమించు ఇలాంటి పేర్లే ఉంటాయి. కాని ఎలాచూసినా ఓ ఊరికి ప్రభాస్ అని పేరుని మాత్రం సాధారణంగా ఎక్స్ పెక్ట్చేయం. ఎవరో ఆ ఊరిలో ప్రభాస్ పేరుతో పుట్టి, గొప్ప పనిచేయటం వల్ల, అలాంటి పేరొచ్చిందంటే నమ్మొచ్చు. రంగారెడ్డి జిల్లాకు అలానే పేరొచ్చింది. అల్లూరి సీతారామరాజు జిల్లాకి అలానే పేరు పెట్టారు.
మరి ప్రభాస్ పేరుతో నేపాల్ లో న్యాచురల్ గానే ఊరుందా అంటే, ఛాన్సేలేదు. పక్కగా కావాలని పెట్టిన పేరుగానే తెలుస్తోంది. ఎవరో కావాలని అలా బోర్డు పెట్టి రెబల్ స్టార్ ఫ్యాన్స్ ని బ్లఫ్ చేస్తున్నారనే కామెంట్లు కూడా వస్తున్నాయి. కాని బాహుబలి రెండో పార్ట్ తర్వాతే కొండల మధ్యలో గుర్తింపు లేని ఊరుకి, ఇలా గుర్తింపు కోసమే ప్రభాస్ అని పేరు పెట్టుకున్నారని తెలుస్తోంది.ఇదే ఇప్పుడు బాలీవుడ్ కి మంటపెట్టేలా ఉంది. ఒకప్పుడు ఈజిప్ట్ కి ఏ ఇండియన్ వెల్లినా ఇండియన్స్ అంటే అమితాబ్ పేరుతోనే పిలిచేవాల్లు. అంటే ఈజిప్ట్ జనాలకు ప్రతీ ఇండియాన్ అమితాబే… ముస్లిం అనగానే ఖాన్ అని సంభోదించటం, చైనీస్ అంటే వాంగ్ లీ, చూంగ్ లీ అని వాల్ల పేర్లు ఇవే అయ్యుంటయనేలా రియాక్ట్ అవటం కామన్. అలానే ఇండియన్స్ అంటే అమితాబ్ అని అనుకుంటారుఈజిప్టు. అంతేకాదు అమితాబ్ పేరు మీద అక్కడ మూడు వాడలున్నాయి. జర్మనీలో షారుఖ్ పేరతో ఓ స్ట్రీట్ ఉంది.
ఇలా చూస్తే ప్రపంచ వ్యాప్తంగా తమ హీరోల పేర్లే ఇలా వాడలకు, రోడ్లకు పెట్టరని నీలిగే బాలీవుడ్ కి పంచ్ ఇచ్చేలా నేపాల్ లో ఓఊరికే ప్రభాస్ పేరు పెట్టుకున్నారు. ఆల్రెడీ మేడం టుస్సాడ్ మ్యూజియంలో ప్రభాస్ వ్యాక్స్ స్ట్యాచు పెట్టినప్పుడు ఇలానే కుళ్లుకుంది బాలీవుడ్ . తర్వాత మహేశ్, బన్నీ వచ్చి చేరారు. ఇప్పుడు చరణ్ వంతొచ్చింది. ఒకప్పుడు మేడం టుస్సాడ్స్ మ్యూజియం లో మైనపు బొమ్మలంటే కేవలం బాలీవుడ్ స్టార్స్ వే కనిపించేవి.ఇప్పుడు ప్రభాస్, మహేశ్, బన్నీ, ఇలా మనోళ్ల సంఖ్య పెరుగుతోంది. రజినీకాంత్ కి కూడా ఈ గౌరవం దక్కలేదు. సో మన హీరోల పేర్లతో విదేశాల్లో ఊర్లే వెలుస్తుంటే, టుస్సాడ్ మ్యూజియం లో మనోళ్ల విగ్రాహాలు పెరుగుతుంటే, బాలీవుడ్ తట్టుకోలేకపోతోంది. సోషల్ మీడియాలో ఇది రెబల్ స్టార్ ఫ్యాన్స్ మ్యానిపులేషన్ అంటూ ఏకంగా లక్ష కు పైనే స్టేట్ మెంట్లు పెట్టారంటే, అక్కడ వాల్లకి ఎంతగా కాలుతుందో తేలిపోతోంది.