బక… బక.. బక.. బార్బారికా… 1000 కోట్ల టైటిల్…

రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త ప్రాజెక్ట్ టైటిల్ మీద ప్రచారం మొదలైంది. బక టైటిల్ ని ప్రశాంత్ వర్మ్ రిజిస్టర్ చేయటంతో, ఇదే రెబల్ స్టార్ మూవీ కోసం అని గుసగుసలు పెరిగాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 11, 2025 | 09:00 PMLast Updated on: Mar 11, 2025 | 9:00 PM

Intersting News About Prabhas And Prashanth Varma New Movie

రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త ప్రాజెక్ట్ టైటిల్ మీద ప్రచారం మొదలైంది. బక టైటిల్ ని ప్రశాంత్ వర్మ్ రిజిస్టర్ చేయటంతో, ఇదే రెబల్ స్టార్ మూవీ కోసం అని గుసగుసలు పెరిగాయి. బకాసురుడు కాన్సెప్ట్ కే బక టైటిల్ పెట్టి దాన్ని రిజిస్టర్ చేయించారనేది వినిపిస్తున్న టాక్. ఏది అఫీషియల్ కాదు. కాకపోతే టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమా ల టైటిల్లే చిత్ర విచిత్రంగా ఉంటున్నాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు తో రాజమౌళి తీసే మూవీ బార్బారికా అన్న ప్రచారం జరుగుతుంటే, సీన్ లోకి బక వచ్చాడు. ఆల్రెడీ ఎన్టీఆర్ సినిమా కోసం ఇండియాకి ఏమాత్రం సంబంధంలేని డ్రాగన్ టైటిల్ ని ఫిక్స్ చేశారు. కాకపోతే ప్రతీ టైటిల్ వెనక సాలిడ్ కథ ఉంది… మార్కెట్ కోసం కూడా ఈ టైటిల్ పెట్టాల్సి వస్తోంది. ఎన్టీఆర్, ప్రభాస్, మహేశ్ బాబు ఈ ముగ్గురు మొనగాళ్ల కొత్త సినిమా టైటిల్స్ వెనక, 1000 కోట్ల మార్కెట్ సీక్రెట్ ఉందని తేలింది.. అదేంటోచూసేయండి.

రెబల్ స్టార్ ప్రభాస్ ఫౌజీ ఫస్ట్ షెడ్యూల్ తర్వాత రాజా సాబ్ పెండింగ్ షూటింగ్ పూర్తి చేసేపనిలో ఉన్నాడు. ఆతర్వాత సందీప్ రెడ్డి వంగ మూవీ స్పిరిట్ పట్టాలెక్కుతుంది. ఆతర్వాత సలార్ 2, కల్కీ 2 ప్రాజెక్ట్స్ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. అంటే ఇవన్నీ అయిపోయేసరికి కనీసం రెండున్నర సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది.ఆతర్వాతే హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తీయబోతున్న ప్రభాస్ మూవీ మొదలౌతుంది. ఆల్రెడీ కథ రఫ్ గా ప్రభాస్ కి చెప్పటం తను గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగిందని తెలుస్తోంది. కాకపోతే ఈలోపే ప్రశాంత్ వర్మ బక అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించటంతో, ఇదే ప్రభాస్ మూవీ టైటిల్ అని ప్రచారం మొదలైంది.

బక అంటే బకాసురుడి పాత్ర పేరుతో సినిమా ప్లాన్ చేశాడట ప్రశాంత్ నీల్. తను ఏ సినిమా తీసినా మైథాలజీ తో కథకి, కనెక్షన్ ఉంటోంది. కాబట్టే బకాసురుడి కథని సినిమాగా తీయాలనుకున్న తను, బక టైటిల్ ని రిజిస్టర్ చేయించాడని టాక్ పెరిగింది.విచిత్రం ఏంటంటే మన ఇండస్ట్రీలోనే పాన్ ఇండియా మూవీలకు చిత్ర విచిత్రమైన టైటిల్స్ పెడుతున్నారు. చైనా లేదంటే సౌత్ ఏషియా దేశాల్లో మాత్రమే వాడే డ్రాగన్ పదాన్ని, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమాకు పెట్టాడు ప్రశాంత్ నీల్. కాకపోతే చైనా, భూటాన్, వియత్నం చుట్టూ తిరిగే కథ కాబట్టే ఆ టైటిల్ వాడుతున్నారనే మాట వినిపిస్తోంది.

ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి తీస్తున్న సినిమా పేరు కూడా ఇంతే విచిత్రంగా ఉండబోతోంది.
సూపర్ మహారాజా, గోల్డ్, గరుడ లాంటి టైటిల్స్ మొదట్లో వినిపించినా, ఫైనల్ గా మాత్రం బార్బారికా టైటిలే ఫిక్స్ అని తెలుస్తోంది.
మహాభారతంలో ఘటోత్కజుడి కొడుకే బార్బారికుడు… అయితే ఒక్క రోజులో మొత్తం మహాభారత యుద్ధాన్నేముగించే శక్తి ఉన్న తన పాత్ర ప్రేరణతో మహేశ్ బాబు సినిమా రాబోతోందట. అంతేకాదు హనుమంతుడి ప్రేరణగా కూడా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. సో బార్బారికుడు, హనుమంతుడు ఈ ఇద్దరి ప్రేరణగానే మహేశ్ బాబు పాత్ర ఉండబోతోంది. అందుకే టైటిల్ బార్బారికా అని ప్రచారం జరుగుతోంది .