300 కోట్ల బ్రహ్మరాక్షసుడికి… 3000 కోట్ల బంపర్ ఆఫర్…

రెబల్ స్టార్ ప్రభాస్ ని ఇప్పటి వరకు అంతా బాహుబలిగా చూశారు... రాముడిగా చూశారు... మాఫీయా డాన్ గా, కల్కి అవతారంగా చూస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 27, 2025 | 07:20 PMLast Updated on: Feb 27, 2025 | 7:20 PM

Intersting News About Prabhas Future Projects

రెబల్ స్టార్ ప్రభాస్ ని ఇప్పటి వరకు అంతా బాహుబలిగా చూశారు… రాముడిగా చూశారు… మాఫీయా డాన్ గా, కల్కి అవతారంగా చూస్తున్నారు. అలాంటి తను సడన్ గా బ్రహ్మ రాక్షసుడిగా మారిపోతే… అదే జరుగుతోంది. బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ బయపడ్డ పాత్రలో రెబల్ స్టార్ కనిపించబోతున్నాడు. కథ సిద్దమైంది. కథనం ఎప్పుడో రెడీ అయ్యింది. ఇక మిగిలింది పాన్ ఇండియా కింగ్ ఆ పాత్రలో దూరటమే.. ఇంతకి బ్రహ్మారాక్షసుడంటే అది కేవలం మైథాలజీ మూవీనా? కానే కాదు. అందుకే ఆ పాత్ర వేసేందుకు రణ్ వీర్ సింగ్ భయపడ్డాడు. విచిత్రం ఏంటంటే బ్రహ్మరాక్షస ప్రాజెక్ట్ ఆగిపోయిన వెంటనే, సీన్ లో కి నటసింహం బాలయ్య వచ్చాడు. తన వారసుడు మోక్షగ్న ఎంట్రీ కోసం ప్లాన్ చేసిన ప్రాజెక్టుని ప్రశాంత్ వర్మ చేతిలో పెట్టాడు. కాని ఇప్పుడీ సినిమా హోల్డ్ లో పడింది. రెబల్ స్టార్ బ్రహ్మరాక్షసుడిగా మారే టైం వచ్చేసింది…సడన్ గా ఈ మార్పుల వెనకున్న ట్విస్ట్ ఏంటి? టేకేలుక్

ఒకే భాణంతో బాక్సాఫీస్ మీద గురిపెట్టిన రాముడిగా వచ్చిన ప్రభాస్, సడన్ గా రావణుడైతే, అంతకంటే పెద్ద విలన్ గా మారితే… అదే జరుగుతోంది. బ్రహ్మ రాక్షసుడిగా మారబోతున్నాడు ప్రభాస్. హనుమాన్ మూవీ పాన్ ఇండియా లెవల్లో హిట్ అయ్యాక, బాలీవుడ్ బాట పట్టాడు ప్రశాంత్ వర్మ. కాకపోతే రణ్ వీర్ సింగ్ తో తను ప్లాన్ చేసిన బ్రహ్మరాక్షస్ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగింది. కారనం తను వేయాల్సి పాత్ర అతి వీర భయంకరంగా ఉండటం..పద్మావతిలో అల్లాఉద్దిన్ ఖిల్జీగా కనిపించి భయపెట్టిన రణ్ వీర్ సింగే భయపడేలా ఉందట బ్రహ్మరాక్షస పాత్ర. అందుకే తను నో చెబితే, ఇప్పుడు ప్రభాస్ ఆ రోల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. లుక్ టెస్ట్ చేయటం కూడా కేవలం ఫార్మాలిటీనే అని తెలుస్తోంది. ఇదేదో చిన్న స్టోరీలైన్ చెప్పి, తర్వాత కథ రాయటం కాదు.. ఆల్ మోస్ట్ రఫ్ గా కథ మొత్తం సిద్దమయ్యాకే రెబల్ స్టార్ కి వినిపించాడట ప్రశాంత్ వర్మ.

ప్రజెంట్ ది రాజా సాబ్, ఫౌజీ మూవీలతో బిజీ అయిన ప్రభాస్ తర్వాత స్పిరిట్ సినిమా సెట్లో అడుగుపెడతాడు. ఆతర్వాత కల్కీ సీక్వెల్, సలార్ సీక్వెల్ పూర్తిచేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే బ్రహ్మ రాక్షస ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. ఈలోపు ప్రశాంత్ వర్మ కూడా హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ ని కాంతారా హీరో తో తీసే అవకాశం ఉంది. అలానే నటసింహం బాలయ్య వారసుడు మోక్షగ్న తో అనుకున్న సినిమా కూడా హోల్డ్ లో ఉంది…సో అది కూడా పూర్తయ్యాకే ప్రభాస్ మూవీ స్టార్ట్ చేస్తాడని తెలుస్తోంది.ఇక్కడ సినిమా రెండున్నరేళ్ల తర్వాతే సెట్స్ పైకెళుతుందని తెలుస్తోంది. కాని అసలు ఈ మూవీ కంటెంట్ ఏంటనేదే అందరిలో ఆసక్తిని క్రియేట్చేస్తోంది. ఎందుకంటే రణ్ వీర్ సింగ్ భయపడి రిజెక్ట్ చేసిన రోల్ లో రెబల్ స్టార్ కనిపించబోతున్నాడంటే, అందులోనూ పూర్తి స్తాయి విలన్ అంటే ఆటోమేటిగ్గా అందరి అటెన్షన్ ఇటు వైపుంటుంది.

అయితే హనుమాన్ కి రాసి తీసిన ప్రశాంత్ వర్మ, దేవకి నందన వాసుదేవ కి కూడా మైథాలజీ నుంచే కథని తీసుకున్నాడు. మాడ్రన్ లైఫ్ కి అప్లై చేశాడు. సో రావణుడి లంకలోని ఓ ప్రత్యేక మైన బ్రహ్మరాక్షసుడి పాత్ర ప్రేరణగానే ప్రభాస్ మూవీ ఉండబోతోందట. ఒక ప్రభాస్, 15 మంది విలన్లు… విచిత్రం ఏంటంటే హీరో తో పాటు, 15 మంది విలన్లు కూడా తనలోనే ఉంటారు..ఓరకంగా చెప్పాలంటే స్ప్లిట్ పర్సనాలిటీ…అంటే ఆల్ మోస్ట్ అపరిచితుడు..కాకపోతే అక్కడ హీరోలో ముగ్గురు పాత్రలుంటే, ఇక్కడే ఏకంగా 16 మంది…అందులో 15 మందితో ఫైట్ చేసే ఒకే ఒక్క మంచివాడిగా రెబల్ స్టార్ కనిపిస్తాడట. సో పాత్రలో ఉన్న కాంప్లెక్సిటీ వల్లే రణ్ వీర్ సింగ్ భయపడితే, రెబల్ స్టార్ మాత్రం ముందుకొచ్చాడని తెలుస్తోంది.