5000 కోట్ల వసూళ్ల కటౌట్ కి… 1500 కోట్ల హీరో ఫిదా…

పాన్ ఇండియా లెవల్లో 5 హిట్లతో 5 వేల కోట్ల వసూళ్లు కొల్లగొట్టిన స్టార్ ప్రభాస్. అలాంటి ఈ పాన్ ఇండియా కింగ్ తో స్పిరిట్ మూవీ ప్లాన్ చేశాడు సందీప్ రెడ్డి వంగ.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 24, 2025 | 08:30 PMLast Updated on: Mar 24, 2025 | 8:30 PM

Intersting News About Prabhas Movie

పాన్ ఇండియా లెవల్లో 5 హిట్లతో 5 వేల కోట్ల వసూళ్లు కొల్లగొట్టిన స్టార్ ప్రభాస్. అలాంటి ఈ పాన్ ఇండియా కింగ్ తో స్పిరిట్ మూవీ ప్లాన్ చేశాడు సందీప్ రెడ్డి వంగ. అంతవరకు బానే ఉంది కాని, ఇందులో స్టార్ కాస్ట్ రివీల్ అవుతుంటేనే, మాస్ పూనకాలు మొదలౌతున్నాయి. అసలే సందీప్ రెడ్డి వంగ సినిమా అంటే, అందులో ప్రతీ పాత్రకి చాలా, స్పెసిఫిగ్గా నటుల్ని ఎంచుకుంటాడనే పేరుంది. యానిమల్ మూవీలో అనిల్ కపూర్, బాబీడియో, ఇలా ప్రతీ అంశంలో చాలా సెలెక్టీవ్ గా చూస్ చూసుకున్నాడు. అలాంటిది పాన్ ఆసియా లెవల్లో ప్లాన్ చేసుకున్న స్పిరిట్ లో స్టార్ కాస్ట్ అంటే ఎలా ఉంటుంది… మొన్నటి వరకు గాసిప్ అనుకున్న కొరియన్ హీరో డాన్ లీ ఎంట్రీ ఈ వారం కన్ఫామ్ అయ్యింది. ఇక మరో సెన్సేషన్ బాలీవుడ్ బ్యాడ్ బాయ్ ఇప్పుడు ప్రభాస్ కి అన్నగా కనిపించబోతున్నాడు. ఇలా ఒక్కో పాత్రలో ఎవరెవరు కనిపించబోతున్నారో, ఉగాదికి ముందే రివీల్ అయ్యేలా ఉంది. సినిమా లాంచ్ కి ముందే పాత్రలతో సెన్సేషన్ క్రియేట్ అయ్యేలా ఉంది.

రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ తీయబోతున్న మూవీ స్పిరిట్. ఆల్రెడీ ఇందులో కొరియన్ స్టార్ డాన్ లీ విలన్ అని ఆరునెలలుగా ప్రచారం జరుగుతోంది. అది ఆల్ మోస్ట్ నిజమే కాని, ఫిల్మ్ టీం అఫీషియల్ గా తేలిస్తేనే, ఎవరైనా ఓ నిర్ణయానికి రావొచ్చు. అంతా పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ సినిమాకు మూవ్ అవుతుందటే, సందీప్ రెడ్డి మాత్రం పాన్ ఆసియా అంటున్నాడు.పాన్ ఇండియాని షేక్ చేసిన తను స్పిరిట్ మూవీలో హీరోయిన్ గా దీపికా పదుకొనేని ఫిక్స్ చేసినా,మరో హీరోయిన్ గా ఇండోనేషియా లేడీని రంగంలోకి దింపబోతున్నాడట. మలేషియా, ఇండోనేషియా, కొరియా, జపాన్, చైనా ఇలా సౌత్ ఏసియాలో సినిమా ఆడాలంటే, అక్కడి ముఖాలు కొన్నైని సినిమాలో కనిపించాలి.

అందుకోసమే సెకండ్ హీరోయిన్ గా ఇండోనేషియన్ లేడీని తీసుకోబోతున్నారట. ఐతే కొరియా నుంచి విలన్, ఇండోనేషియా నుంచి సెకండ్ హీరోయిన్, మరి హీరో ఫ్యామిలీ పరిస్తితేంటి? స్పిరిట్ లో హీరో పోలీస్ ఆఫీసరే కావొచ్చు.. కాని తనకంటూ ఓ ఫ్యామిలీ ఉంటుంది కదా… అదే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఎవరి సినిమాలోనైనా హీరో, హీరోయిన్, విలనే ముఖ్యం, కాని సందీప్ రెడ్డి వంగ మూవీలో హీరో, హీరోయిన్ ఫ్యామిలీ స్ చాలాచాలా ముఖ్యం… అర్జున్ రెడ్డిలో ఎప్పుడో సినిమాలొదిలేసిన వెటరన్ హీరోయిన్ కాంచనని హీరోకి బామ్మగా తీసుకున్నాడు. యానిమల్ మూవీలో హీరో తండ్రిగా అనిల్ కపూర్, విలన్ గా అడ్రస్ లేని బాబీ డియోల్ ని తీసుకున్నాడు సందీప్ రెడ్డి వంగ.

ఇక సెకండ్ విలన్ గా పృథ్వీ ని తీసుకుంటే, స్పెషల్ క్యారెక్టర్స్ లో బాలీవుడ్ మాజీ విలన్ శక్తి కపూర్ ని, గన్ మేకర్ గా మరాఠీ నటుడు ఉపేంధ్ర లిమాయోని తీసుకున్నాడు. ఇరాన్ లో ఫేమసైన పాటని ఇందులో వాడాడు.. పంజాబీ ఫోక్ సాంగ్ ని కావాలిన ఇందులో వాడాడు.. ఇలా మాట, పాట, అలానే పాత్ర విషయంలో చాలా సెలెక్టీవ్ గా ఉన్న సందీప్ రెడ్డీ వంగ, స్పిరిట్ లో ప్రభాస్ కోసం సాలిడ్ ఫ్యామిలీని రెడీ చేశాడట.ఆరున్నర అడుగుల ఈ భారీ కటౌట్ కి ఫ్యామిలీ మెంబర్స్ అంటే తనకు తగ్గట్టే ఉండాలి. అందుకే బాలీవుడ్ వెటరన్ హీరో, ప్రజెంట్ సౌత్ లో విలన్ గా బిజీ అయిన సంజయ్ దత్ ని స్పిరిట్ లో ప్రభాస్ అన్నగా తీసుకున్నాడట. సిస్టర్ రోల్ లో కరీనా ఆల్ మోస్ట్ కన్ఫామ్ అంటున్నారు. మరి తల్లిగా, తండ్రిగా ఇంకెవరిని తీసుకున్నాడో మాత్రం లీక్ కావట్లేదు. క్లారిటీ లేదు. ఏదేమైనా ప్రభాస్ కి అన్నగా మాత్రం సంజయ్ దత్ నీ తీసుకోవటం సినిమాకు ఓరేంజ్ కిక్ ని ఇచ్చే ఛాన్స్ ఉంది.