మొహమాటమే లేదు డార్లింగ్.. 6 సినిమాలకు ఇచ్చిపడేస్తా…

రెబల్ స్టార్ ప్రభాస్ తను కమిటైన సినిమాల విషయంలో అసలు మొహమాటమే లేదంటున్నారు. మొన్నటి వరకు కొన్నిరోజులు ది రాజా సాబ్ షూటింగ్ , తర్వాత ఫౌజీ, ఇలా వెళ్లాడు. ఇప్పుడు మాత్రం తన కొత్త సినిమాల విషయంలో పాత రూల్స్ పక్కన పెట్టాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 5, 2025 | 09:10 PMLast Updated on: Feb 05, 2025 | 9:10 PM

Intersting News About Prabhas Upcoming Movies

రెబల్ స్టార్ ప్రభాస్ తను కమిటైన సినిమాల విషయంలో అసలు మొహమాటమే లేదంటున్నారు. మొన్నటి వరకు కొన్నిరోజులు ది రాజా సాబ్ షూటింగ్ , తర్వాత ఫౌజీ, ఇలా వెళ్లాడు. ఇప్పుడు మాత్రం తన కొత్త సినిమాల విషయంలో పాత రూల్స్ పక్కన పెట్టాడు. ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ రెండు నెలల గ్యాప్ లో రెండు సినిమాలను రిలీజ్ చేయించబోతున్నాడు. ఇది మాత్రం రెబల్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూసే… లాస్ట్ ఇయర్ కూడా ఇలానే సలార్, కల్కీ మధ్య తక్కువ గ్యాపే ఉంది. వచ్చే ఏడాది రెండు సినిమాలకు ముహుర్తం కూడా ఫిక్స్ అయ్యింది. 2028 వరకు వన్ ప్లస్ వన్ ఆఫర్ కంటిన్యూ అయ్యేలా ఉంది. మరి ఈ ఏడాది ది రాజా సాబ్ తో పాటు మరో మూవీ కూడా రెండు నెల్ల గ్యాప్ లో వస్తే, బాక్సాఫీస్ తట్టుకుంటుందా? టేకేలుక్

ది రాజా సాబ్ ఎప్పుడో మొదలైంది. ఇంకా 15 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్… రెండు వారాలుయూరప్ ట్రిప్పేస్తే పాటల షూటింగ్, ప్యాచ్ వర్క్ కూడా పూర్తవుతుంది. అలాంటి ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్ ప్రభాస్ మోకాలి చికిత్స కారనంగా వాయిదా పడింది. కాకపోతే ఇకమీదట పరిస్థితి అలా ఉండదట. ఏప్రిల్ 10కి రావాల్సిన ది రాజా సాబ్ జూన్ లో రిలీజ్ కాబోతోంది.

అదే ఏప్రిల్ 25 కి రిలీజ్ అనుకున్న ఆగస్ట్ లో రిలీజ్ కాబోతోంది. అంటే జూన్, ఆగస్ట్ ఇలా వరుసగా రెండు నెలల గ్యాప్ లో ప్రభాస్ రెండు సినిమాలతో దండెత్తడం కన్ఫామ్ అయ్యింది. కన్నప్ప మంచు విష్ణు మూవీనే అయినా, అందులో 20నిమిషాలు ప్రభాస్ ఉంటాడంటే, ఇక అది రెబల్ స్టార్ మూవీ అనుకోవాల్సిందే. అందులోనూ తను వేస్తున్న రుద్ర పాత్ర యాక్షన్ సీక్వెన్స్ తో కూడుకున్నదవటంతో, ఫ్యాన్స్ కి పండగ కన్ఫామ్ అవుతోంది

2024 లో సలార్, కల్కీ రెండీంటిదో ఎటాక్ చేశాడు ప్రభాస్. నిజానికి సలార్ 2023 లోనే వచ్చినా, ఇయర్ ఎండ్ లో రిలీజ్ అయ్యింది కాబట్టే, లాస్ట్ ఇయర్ ఎకౌంట్ లోనే ఈ రెండు సినిమాలు వస్తాయి. రెండు హిట్లతో 2 వేల కోట్లు కొల్లగొట్టిన ప్రభాస్, ఈ ఏడాది ది రాజా సాబ్ తో జూన్ లో, కన్నప్పతో ఆగస్ట్ లో ఎటాక్ చేయబోతున్నాడు. నిజానికి ఫౌజీ మూవీ దీపావళికి లేదంటే, క్రిస్మస్ కి రావొచ్చన్నారు

కాని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి 5 నెలలు పట్టే ఛాన్స్ ఉందనే కారనంతో, 2026 సంక్రాంతికే ఈ సినిమా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విచిత్రం ఏంటంటే 2026 లో కూడా ప్రభాస్ డబుల్ ఎటాక్ కి సిద్ధమౌతున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఫౌజీని, దసరాకు స్పిరిట్ ని రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. అంటే కనీసం 8 నెలల గ్యాప్ తో రెండు సార్లు ప్రభాస్ ఎటాక్ చేయటం కన్ఫామ్ అయ్యింది.

ఇక 2027 మీదా కూడారెండు సార్లు ప్రభాస్ దండయాత్ర చేసే ఛాన్స్ ఉంది. కల్కీ 2 వచ్చే ఏడాది మొదలై 2027, సమ్మర్ కి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తుంటే, సలార్ 2ని 2027 దసరాకు రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. మొత్తంగా ఒక్క స్టార్ పాన్ ఇండియా మూవీల విషయంలో, ఏడాదికి, రెండేళ్లకో సినిమా రిలీజ్ చేయటమే కష్టంగా ఉంది. అలాంటిది, రెబల్ స్టార్ మాత్రం ఏడాదికి 2 పాన్ ఇండియా ఎటాక్స్ తో వరుసగా మూడేళ్లు గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్నాడు.