50 వేల థియేటర్స్.. 5000 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్.. అప్పుడే 20%..

సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి తీస్తున్న పాన్ వరల్డ్ మూవీ ఎస్ ఎస్ ఎమ్ బీ 29.. వర్కింగ్ టైటిల్ తప్ప మరేది ఇంతవరకు కన్ఫామ్ కాలేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 21, 2025 | 08:01 PMLast Updated on: Mar 21, 2025 | 8:01 PM

Intersting News About Rajamouli And Mahesh Babu Movie 2

సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి తీస్తున్న పాన్ వరల్డ్ మూవీ ఎస్ ఎస్ ఎమ్ బీ 29.. వర్కింగ్ టైటిల్ తప్ప మరేది ఇంతవరకు కన్ఫామ్ కాలేదు. కాకపోతే హాలీవుడ్ దిగ్గజాలైన డ్రీమ్ వర్క్స్, డిస్నిప్ పిక్చర్స్ రంగంలోకి దిగి ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 50 వేల థియేటర్స్ లో రిలీజ్ చేసేలా డీల్ జరిగిందని మాత్రం తెలుస్తోంది. ప్రీరిలీజ్ బిజినెస్ కూడా 5 వేల కోట్ల వరకు జరగొచ్చనే టాక్ షాక్ ఇస్తోంది. ఇలాంటి టైంలో సడన్ గా రాజమౌళి బాంబుపేల్చాడు. ఏకంగా ఈ మూవీ 20శాతం వరకు షూటింగ్ ని పూర్తిచేశాడట. మొన్న హైద్రబాద్ లో బ్రేక్ కి ముందో షెడ్యూల్, బ్రేక్ తర్వాతో షెడ్యూల్ పూర్తిచేశాడు. ఇప్పడు ఒరిస్సా షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తైంది. ఫిల్మ్ టీం వచ్చేనెల కెన్యా బయలు దేరబోతోంది. ఎలాచూసినా రెండు మూడు సీన్లు తీశాడనుకోవచ్చు.. కాని ఏకంగా రెండు లొకేసన్స్ లో 20శాతం టాకీ పార్ట్ ని రాజమౌళి పూర్తి చేశాడంటే, ఈ ఏడాదిలోపే షూటింగ్ పూర్తవుతుందా? ఏడాదిన్నర తర్వాత సినిమా వస్తుందా? అంత ఛాన్స్ ఉందా? హావేలుక్

సూపర్ స్టార్ మహేవ్ బాబుతో రాజమౌలి తీస్తున్న ఎస్ ఎస్ ఎంబీ 29 మూవీ రెండో షెడ్యూల్ పూర్తయ్యేసరికే, షూటింగ్ 20శాతం ఫినిష్ అంటున్నారు. హైద్రబాద్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఒకే షెడ్యూల్ ని మూడు వారాల్లో పూర్తిచేశారు. ఒరిస్సాలో రెండో షెడ్యూల్ పూర్తి చేశారు. మహా ఐతే ఏ ఐదారు సీన్ల షూటింగో పూర్తయ్యుంటుందనుకోవచ్చు.కాని ఈ సినిమా తాలూకు టాకీ పార్ట్ లో 20శాతం షూటింగ్ ని ఈ రెండు షెడ్యూల్స్ లోనే పూర్తి చేయటం నిజంగా షాకింగే.. ఎందుకంటే రాజమౌళి లాంటి పర్ఫెక్షనిస్టుతో మహేశ్ బాబు మూవీ అంటే, కనీసం మూడు నాలుగేళ్లు పడుతుందని, అంతా మెంటల్ గా ప్రిపేరయ్యారు. కాని రెండు షెడ్యూల్స్ లోనే 20శాతం టాకీ పార్ట్ పూర్తి చేశాడంటే, ఈఏడాది లోపే టాకీ పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తిచేస్తాడా…

ఈ వేగం చూస్తుంటే అదే జరిగేలా కనిపిస్తోంది. కాని బాహుబలి, త్రిబుల్ ఆర్ తో పాన్ ఇండియా, పాన్ వరల్డ్ జర్నీ చేసిన రాజమౌళి, ఇప్పుడు తీస్తోంది గ్లోబల్ సినిమా… గ్లోబల్ మార్కెట్టే తన నెక్ట్స్ టార్గెట్.. అలాంటప్పడు తనిప్పుడు తీస్తున్న సినిమా దీనమ్మ జీవితం అనేలా ఉంటుందనే అంచానాలున్నాయి. తను కూడా అంత టేకిటీజీగా తీసే పరిస్థితిలేదు.కాని రెండు షెడ్యూల్స్ లో 20శాతం టాకీ పార్ట్ షూటింగ్ పూర్తైందంటే, ఆ వేగం కూడా షాకిస్తోంది.. మహేశ్ ఫ్యాన్స్ కి ఇది నచ్చే విషయమే కావొచ్చు. కాని రెండు షెడ్యూల్స్ ని వేగంగా తీసినంత మాత్రాన, మిగతా షూటింగ్ ని రాజమౌళి వేగంగా పూర్తి చేస్తాడనుకోలేం.. ఎందుకంటే హైద్రబాద్, ఓరిస్సాలో తీసిన సీన్లన్నీ పాత్రల ఇంట్రడక్షన్ సీన్లే అని తెలుస్తోంది.

హీరో ఇంట్రడక్షన్ గ్రాండ్ గానే ప్లాన చేసినా, ఆన్ లొకేషన్ లో మామూలు సీన్ తీసి, అసలు సీన్ గ్రీన్ మ్యాట్ లో ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కెన్యాలో నెక్ట్స్ షెడ్యూల్ ప్లాన్ చేసిన రాజమౌలి, ఎంతలేదన్నా ఎంత వేగంగా మూవీని తీసినా, కనీసం ఏడాదిన్న లేదంటే రెండేళ్లు ఈ ప్రాజెక్టుని పూర్తి చేయటానికి టైం తీసుకుంటాడనే అభిప్రాయం వినిపిస్తోంది. రెండు భాగాలుగా తెరకెక్కతున్న ఈ సినిమా 2026 లో రావటం నిజమే అయితే, ఏడాదిన్నలోపే షూటింగ్ పూర్తవుతుందని ఫిక్స్ అయిపోవచ్చు…