అవతార్ డైరెక్టర్ తో కలిసి మీముందుకి.. ఇంకా దాచలేం…

సూపర్ స్టార్ మహేశ్ బాబు 29 వ మూవీ తీస్తున్న రాజమౌళి గురించి తలుచుకుంటే, మలయాళ స్టార్ హీరోకి వణుకొస్తున్నట్టుంది. ఫ్రుద్వీరాజ్ సుకుమారన్ రీసెంట్ గా తన లూసీఫర్ 2 ప్రమోషన్ లో సౌత్, నార్త్ మీడియా అడిగిన ప్రశ్నలకు వణికిపోయాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 24, 2025 | 07:50 PMLast Updated on: Mar 24, 2025 | 7:50 PM

Intersting News About Rajamouli And Mahesh Babu Movie 3

సూపర్ స్టార్ మహేశ్ బాబు 29 వ మూవీ తీస్తున్న రాజమౌళి గురించి తలుచుకుంటే, మలయాళ స్టార్ హీరోకి వణుకొస్తున్నట్టుంది. ఫ్రుద్వీరాజ్ సుకుమారన్ రీసెంట్ గా తన లూసీఫర్ 2 ప్రమోషన్ లో సౌత్, నార్త్ మీడియా అడిగిన ప్రశ్నలకు వణికిపోయాడు. రాజమౌళి సినిమా గురించి ఏం చేప్పాలో, ఏం చెప్పొద్దో తేల్చుకోలేక, అలాని అడిగిన ప్రశ్నలకు సైలెంట్ గా ఉండలేక వణికాడు. కాకపోతే ఒక్క తియ్యటి మాట చెప్పి ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పిస్తున్నాడు. అదే టోటల్ టీం మీముందుకొస్తోందన్నాడు. అవతార్ డైరెక్టర్ జేమ్స్ కామెరున్ అండ్ కో తో కలిసి భారీ ప్రెస్ మీట్ ప్లాన్ చేస్తున్నా రాజమౌళి, ఇంతవరకు ఆ సంగతి అఫీషియల్ గా తేల్చలేదు. కానీ ఇందులో స్పెషల్ రోల్ వేస్తున్న ఫ్రుథ్వీరాజైనా కనీసం , ఆ సెన్సేషనల్ ప్రెస్ మీట్ గురించి అఫీషియల్ గా తేల్చాడు. మార్చి 20 మోస్ట్ లీ ఈ ప్రెస్ మీట్ ఉండొచ్చు… హాలీవుడ్ దిగ్గజాలైన డిస్నీప్, డ్రీమ్ వర్క్స్ బ్యానర్లు మహేశ్ బాబు సినిమాను 55 వేల థియేటర్స్ లో రిలీజ్ చేయబోతుండటమే కాదు, 5 వేల కోట్ల డీల్ కూడా జరుగుతోందనే వార్తలొస్తున్నాయి. ఇవన్నీ ప్రెస్ మీట్ రోజు కుండబద్దలు కొట్టేయబోతున్నాడు రాజమౌళి… ఆల్ మోస్ట్ ఆ ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌలి తీస్తున్న ఎస్ ఎస్ ఎమ్ బీ 29 ప్రాజెక్టు తాలూకు ఒక్కో అంశం వద్దన్నా లీకురూపంలోనే బయటికొస్తోంది. ఏ ముహుర్తాన నో డిస్ క్లోజర్ అగ్రిమెంట్ అని పెట్టాడో కాని, రాజమౌళి ప్లాన్ అస్సలు వర్కవుట్ కావట్లేదు. ఈ సారి ఏకంగా ఈ మూవీలో నటించే స్టారే మ్యాటర్ లీక్ చేశాడు. ఔను మొన్న మహేశ్ లుక్, తర్వాత సినిమా సెట్ల వీడియో, ఆతర్వాత షూటింగ్ వీడియో లీకైంది.ఇప్పుడు ఇందులో కీరోల్ వేస్తున్న మలయాళ స్టార్ ఫ్రుథ్వీరాజ్ నుంచి కూడా సినిమా తాలకూ మ్యాటర్ ఒకటి లీకైంది. తను మలయాలంలో తీసిన లూసీఫర్ కి ఇప్పుడు సీక్వెల్ వచ్చింది. మలయాళ స్టార్ మోహన్ లాల్ లీడ్ రోల్ లో తీసిన ఈ సీక్వెల్ పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతోంది. దీంతో సౌత్, నార్త్ మీడియా ముందు ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది

ఆ మూవీ ప్రమోషన్ కి వెళితే, మీడియా అంతా రాజమౌళి సినిమా మీదే ప్రశ్నల వర్షం కురిపించింది. ఆన్సర్ చెప్పలేడు, అలాని నోరు మూసుకోలేడు.. ఆ బెరుకు, భయం, ఏం చెబితే ఏమవుతుందో అన్న కంగారు తన సమాధానంలో కనిపించింది. మొత్తంగా చెప్పనంటూనే, మీడియా ముందుకి మొత్తం టీం వచ్చేనెల్లో రాబోతున్నమని తేల్చాడు.అవతార్ , టైటానిక్ లాంటి సినిమాలు తీసిన జేమ్స్ కామెరున్ లాంటి వాళ్ల ఎంట్రీని ఆఫ్ ద రికార్డు కన్ఫామ్ చేశాడు. ఇది పెద్ద రివీలేషన్. మొన్నటి వరకు ఇది కేవలం రూమరే. ప్రజెంట్ ఇది ఆల్ మోస్ట్ అఫీషియల్. ఏదేమైతేనేం సినిమాను సీక్రెట్ గా లాంచ్ చేసినా, రాజమౌళి మాత్రం ఇప్పుడు భారీ ప్రెస్ మీట్ కి సిద్ధపడ్డ విషయం అఫీషియల్ గా వెల్లడైంది

ఇది ఓరకంగా సర్ ప్రైజింగ్ గా ఎనౌన్స్ చేద్దామనుకున్న రాజమౌలికి పంచే.. ఇది సరిపోదని మహేశ్ బాబు కూడా యాడ్స్ కోసం తన లుక్ ని రివీల్ చేస్తున్నాడు. కూతురితో తను చేసిన యాడ్ వల్ల, రాజమౌళి సినిమాకోసం ప్రిపేర్ అయిన లుక్ మొత్తం రివీలైంది. అంటే ఫ్యాన్స్ తో దిగిన ఫోటోలోనే ఈ లుక్ రివీలైనా, యాడ్ వల్ల పూర్తి లుక్ రివీలైపోయింది.రాజమౌళి ఎంత కాలం సినిమా తీస్తాడో కాని, అంతకాలం మహేశ్ బాబుని సీక్రెట్ గా దాచిపెట్టలేడని తేలింది. డజన్ల కొద్ది యాడ్ ఎండోర్స్ మెంట్లు చేస్తున్న మహేశ్ మధ్యమధ్యలో యాడ్స్ చేయాలి కాబట్టి, ఎప్పటికీ మహేశ్ బాబు లుక్ సీక్రెట్ గా ఉండటం కుదరదు. కాబట్టి రాజమౌళి లాంటి డైరెక్టర్ కూడా మహేశ్ విషయంలో తగ్గక తప్పదు.