SSMB29లో కట్టప్ప కూతురు… ఆమే మీద నమ్మకంతో 5000 కోట్ల రిస్క్..
7 ఖండాలు, 7 వింతల్లో షూటింగ్స్ ని ప్లాన్ చేసిన రాజమౌళి, మహేశ్ బాబు మూవీని ప్రపంచ వ్యాప్తంగా 55 వేల థియేటర్స్ లోరిలీజ్ అయ్యేలా షూటింగ్ కి ముందే రంగం సిద్దం చేశాడు.

7 ఖండాలు, 7 వింతల్లో షూటింగ్స్ ని ప్లాన్ చేసిన రాజమౌళి, మహేశ్ బాబు మూవీని ప్రపంచ వ్యాప్తంగా 55 వేల థియేటర్స్ లోరిలీజ్ అయ్యేలా షూటింగ్ కి ముందే రంగం సిద్దం చేశాడు. డిస్నీప్, డ్రీమ్ వర్క్స్ బ్యానర్స్ తో ఆల్రెడీ డీల్ కుదిరింది. 5 వేల కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ తోనే వస్తున్నట్టు తెలుస్తోంది. ఇవన్నీమంచి శకునాలే. కాని ఇందులో కొత్తగా తెలుస్తోన్న అంశం కట్టప్ప కూతుర్ని మహేశ్ బాబు మూవీలోకి దింపటం..
ఔను హాలీవుడ్ లో సెటిలైన బాలీవుడ్ లేడీ ప్రియాంక చోప్రా, ఇప్పుడు ఎస్ ఎస్ ఎమ్ బీ 29లో కట్టప్ప కూతురి పాత్ర వేస్తోంది. ఎగ్జాక్ట్ గా కట్టప్ప కూతురే ఈ సినిమాలో అడుగుపెట్టడం కాదుకాని, అచ్చంగా కట్టప్పలానే వెన్నుపోటు పొడిచే, లేడీ విలన్ గా ప్రియాంక కనిపించబోతోంది. ఐతే ఇది గతంలోనే ప్రచారం జరిగిన విషయం. కాని ఇప్పడు వచ్చిన అప్ డేట్ చూస్తే, రావణాసుడి చెల్లి శూర్పనక ప్రేరణగా, ఇందులో తన పాత్ర ఉంటుందట.
అసలు శూర్పనకే లేకపోతే, రావణాసురుడికి లేని పోనివి చెప్పి సీతని ఎత్తుకొచ్చే కార్యక్రమమే జరగదంటారు. సో ఘటోత్కఝుడి కొడుకు బార్బారికుడు, హనుమంతుడిని కలిపి సూపర్ స్టార్ మహేశ్ బాబు పాత్రని డిజైన్ చేస్తే, శూర్పనకని ఇందులో కట్టప్ప స్టైల్లో వాడబోతున్నారట. అంటే తన వల్లే ఇందులో హీరో ఇబ్బందుల్లో పడతాడు, తన వల్లే వెన్నుపోటుకు గురౌతాడు..
ఈపాయింట్ ఇప్పుడు ఇండస్ట్రీలో బాగా ఫోకస్ అవటానికి కారణం ఏప్రిల్ 21 కి దగ్గరకొస్తోంది. ఆరోజే జేమ్స్ కామెరున్, స్టీవెన్ స్పిల్ బర్గ్ లాంటి హాలీవుడ్ దిగ్గజాలతో కలిసి రాజమౌళి అండ్ టీం ప్రెస్ మీట్ పెట్టబోతోంది. ఆరోజు చెప్పబోయే బేసిక్ ప్లాట్, పాత్రలకు సంబంధించి ప్రిపరేషన్ జరిగిందట. ఆ ప్రిపరేషన్ లో భాగంగా ఆప్రెస్ మీట్ లో ఏం చెప్పబోతున్నారో రివీల్ అవుతోంది. దీని మీదే ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. మొత్తానికి 55 వేల థియేటర్స్ లో ప్రపంచ వ్యాప్ంగా రిలీజ్ కాబోతున్న మొదటి ఇండియన్ మూవీని, పూర్తిగా ప్రియాంక పాత్ర ఆధారంగా ప్లాన్ చేయటం అంటే, చాలా పెద్ద రిస్కే… ఆ రీస్కో చేస్తోంది ఫిల్మ్ టీం.