55వేల థియేటర్లు.. 5 వేల కోట్లు.. పాన్ వరల్డ్ టెన్షన్..
సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి తీస్తున్న ఎస్ ఎస్ ఎమ్ బీ 2026 దసరాకు వచ్చేలా ఉంది. ఈనెల 21న జరిగే పాన్ వరల్డ్ ప్రెస్ మీట్ కోసం ఆల్రెడీ ఇంటర్ నేషనల్ మీడియా ల్యాండైంది.

సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి తీస్తున్న ఎస్ ఎస్ ఎమ్ బీ 2026 దసరాకు వచ్చేలా ఉంది. ఈనెల 21న జరిగే పాన్ వరల్డ్ ప్రెస్ మీట్ కోసం ఆల్రెడీ ఇంటర్ నేషనల్ మీడియా ల్యాండైంది. ఫిల్మ్ టీం బైట్స్ తీసుకుంటోంది. మేకింగ్ విజువల్స్ కూడా తీసుకుంటోంది. ఎంతైనా 55 వేల థియేటర్స్ లో రిలీజ్ అయ్యే తొలి ఇండియన్ మూవీ… రిలీజ్ కిముందే 5 వేల కోట్లు రాబడుతున్న సినిమా… అలాంటి మూవీ టీం ప్రెస్ మీట్ పెడితే, ప్రపంచ మీడియా రాకుండా ఉంటుందా? అదే జరుగుతోంది. కాని ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఈ మంగళవారం సందీప్ రెడ్డి వంగతో, బుధవారం సుకుమార్ తో సూపర్ స్టార్ మహేశ్ బాబు చర్చించాడు… రాజమౌళితో సినిమా అంటే రెండేళ్లు లేదంటే మూడేల్లు టైం అటే పోతుంది. అందులోనూ ఇది రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సినిమా… కాబట్టి కనీసం 4 ఏళ్లవరకు మహేశ్ బాబు మరో సినిమా చేసే చాన్స్ లేదు. అయినా సుకుమార్, సందీప్ రెడ్డిని మహేశ్ కలవటం వెనక, సూపర్ టెన్షన్ కనిపిస్తోందా? ఇంతకి ఆ టెన్షన్ దేనికి? హావేలుక్
ఇండియాని షేక్ చేసేలా రాజమౌళి మూవీ ప్లానింగ్ షాక్ ఇచ్చేలా ఉంది. బాహుబలి1, బాహుబలి 2, త్రిబుల్ ఆర్ తో పాన్ ఇండియా నుంచి గ్లోబల్ మార్కెట్ లోకి వెల్లిన రాజమౌళి, పాన్ వరల్డ్ ని టార్గెట్ చేయటం మంచి విషయమే.. తన వల్ల సూపర్ స్టార్ మహేశ్ బాబుకి, పాన్ ఇండియా మార్కెట్ లోనే కాదు గ్లోబల్ మార్కెట్ లో దూసుకెళ్లే ఛాన్స్ వచ్చింది.అది కూడా తన ఫ్యాన్స్ తోపాటు టాలీవుడ్ కి కలిసొచ్చే విషయమే.. ఎటొచ్చి ఆతర్వతేంటనే ప్రశ్న ఇప్పుడే వేసుకుంటున్నాడు సూపర్ స్టార్. అది రాజమౌళి లాంటి దర్శక ధీరుడినే ఆశ్చర్య పరిచింది. రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగ, సుకుమార్ తో మహేశ్ బాబు మీటింగ్ జరగటం అందుకు కారణం.
సూపర్ స్టార్ మహేశ్ బాబు 29 వ మూవీ ఇప్పటికి మూడు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకుంది. కెన్యా షెడ్యూల్ షూటింగ్ కి రెడీ అవుతున్న టీం, ఈ మంథ్ 21న ఇంటర్నేషనల్ మీడియా ముందు భారీ ప్రెస్ మీట్ తో చాలా పెద్ద ఎనౌన్స్ మెంట్లే ఇవ్వబోతోంది.
అందులో హాలీవుడ్ దిగ్గజాలైన వాల్ట్ డిస్నీప్, డ్రీమ్ వర్క్స్ లాంటి బ్యానర్లు ఈ సినిమాను 55 వేల థియేటర్స్ లో రిలీజ్ చేస్తుండటం, ప్రీరిలీజ్ బిజినెస్ 5 వేల కోట్లు దాటడం, నెట్ ఫ్లిక్స్ అధినేథ కూడా ఈ ప్రెస్ మీట్ లో పార్టిసిపేట్ చేయటం లాంటి చాలా సర్ ప్రైజింగ్ ఈవెంట్స్ కనిపించబోతున్నాయి. దీనికి తోడు అవతార్ ఫేం జేమ్స్ కామెరున్, జురాసిక్ పార్క్ ఫేం స్టీవెన్ స్పిల్ బర్గ్ కూడా ఈ ప్రెస్ మీట్ కి అటెండ్ కాబోతున్నారు.
సో ఐమ్యాక్స్ కెమెరాతో తెరకెక్కుతున్న తొలి ఇండియన్ మూవీగా ఒకరికార్డు, 55 వేల థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న మూవీగా వరల్డ్ వైడ్ గా అటెన్షన్, రిలీజ్ కి ముందే 5 వేల కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేస్తున్న సినిమాగా మరో రికార్డు.. ఇన్ని స్పెషాలిటీస్ తో వస్తున్న సినిమా కాబట్టి, ఇందులో హీరోకి పండగే. ఐతే 2026 దసరాకు ఎస్ ఎస్ ఎమ్ బీ 29 ని రిలీజ్ చేయాలనుకుంటున్నాట. 2028 దసరాకు పార్ట్ 2 వస్తుందని తెలుస్తోంది. ఈ రెండు డేట్లు ఈనెల 21న జరిగే ప్రెస్ మీట్లలో ఎనౌన్స్ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
ఎలా చూసినా రెండు పాన్ వరల్డ్ హిట్లతో మహేశ్ బాబుకి గ్లోబల్ గా గుర్తింపు గ్యారెంటి. కాని ఆతర్వాతే ఏంటి? ప్రభాస్, చరణ్ లాంటి హీరోలు రాజమౌళి తో సినిమాలు చేసి, హిట్ మెట్టెక్కాక, ఫ్లాపులు మూటకట్టుకున్నారు. ఒక్క ఎన్టీఆర్ మాత్రమే ఆ సెంటిమెంట్ ని దేవరతో బ్రేక్ చేశాడు. అందుకే రాజమౌళి మూవీలు చేస్తుండటగానే, ఆతర్వాత ఏంటనే ప్రశ్నకు మహేశ్ ఇప్పుటి నుంచే సమాధానం వెతుకుతున్నాడు. సందీప్ రెడ్డి వంగ, సుకుమార్ ని కథల వేటలో ఉండమని చెప్పినట్టు తెలుస్తోంది. ఓరకంగా త్రిబుల్ ఆర్ తర్వాత కొరటాలతో దేవర చేసిన ఎన్టీఆర్ నే మించేలా, చాలా ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తున్నాడు సూపర్ స్టార్.