దెబ్బ మీద దెబ్బ.. 1000 కోట్ల నరకం.. కొంపమునిగినట్టే..?

పాన్ ఇండియా నెంబర్ వన్ డైరెక్టర్ అంటేనే రాజమౌళి. ఎన్నడూ వివాదాలు చూడని తనకి ఇప్పుడు చుక్కలు చూపించే వివాదం ఎదురైంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 1, 2025 | 08:04 PMLast Updated on: Mar 01, 2025 | 8:04 PM

Intersting News About Rajamouli And Mahesh Babu Movie

పాన్ ఇండియా నెంబర్ వన్ డైరెక్టర్ అంటేనే రాజమౌళి. ఎన్నడూ వివాదాలు చూడని తనకి ఇప్పుడు చుక్కలు చూపించే వివాదం ఎదురైంది. ఏకంగా తన ఫ్రెండే ట్రైయాంగిల్ లవ్ స్టోరీ అంటూ తనని పర్సనల్ గా షాక్ కి గురిచేశాడు. ఇవేవి నిజం కాదని, శ్రీనివాసరావు అనే ప్రొడ్యూసర్ కమ్ మాజీ రాజమౌళి స్నేహితుడు డిప్రెషన్ లో ఉండి చేసిన పనే అంటున్నారు. రాజమౌళి అండ్ ఫ్యామిలీ ఈ విషయంలో ఏమాత్రం రియాక్ట్ కాలేదు. అంతా లైట్ తీసుకున్నారన్నారు. కాని నిజంగా ఇది లైట్ తీసుకునే విషయామా? తన శ్రీనివాసరావు నిజంగా రాజమౌళి స్నేహితుడేనా? అయితే తన కామెంట్స్ లో ఎంతో కొంతం నిజమో, లేదంటే కావాలని బురద చల్లిన వ్యవహారమో అనుకోలేమా? ముందు శ్రీనివాస్ రావు వీడియోని ఎవరూ పట్టించుకోలేదు. కాని ఇప్పుడిప్పుడే ఆ వీడియో సరికొత్తగా వైరలవుతుండటంతో జనాలు ఆలోచనలో పడుతున్నట్టు కనిపిస్తోంది. ఇదే రాజమౌళికి పర్సనల్ డ్యామేజ్ అనుకుంటే, మూలిగేనక్క మీద తాటికాయ పడినట్టు, మహేశ్ బాబు లుక్ లీకైంది.. ఒకేసారి రెండు దెబ్బలతో షాక్ లో ఉన్నట్టున్నాడు దర్శక ధీరుడు.

రాజమౌళి అంటేనే మార్కెటింగ్ మాస్టర్. పాన్ ఇండియా మార్కెట్ ని నిద్రలేపిన ఇన్వెంటర్. 200 కోట్ల మార్కెట్ మాత్రమే ఉన్న తెలుగు సినిమా రేంజ్ ని రెండు వేల కోట్ల స్థాయికి తీసుకెళ్లిన పాన్ ఇండియా నెంబర్ వన్ డైరెక్టర్. అంతేకాదు సౌత్ సినిమాకు, బాలీవుడ్ కి మధ్య ఉన్న అడ్డుగోడని తుక్కుతుక్కుకింద కూల్చేసిన దర్శక ధీరుడు..ఇలాంటి డైరెక్టర్ కి ఇప్పుడు పర్సనల్ గా, ప్రొఫేషనల్ గా దెబ్బ మీద దెబ్బ పడింది. అది రెండు రోజుల గ్యాప్ లోనే… తన స్నేహితుడని చెప్పుకునే శ్రీనివాసరావు అనే వ్యక్తి రాజమౌలి మీద పెద్ద నిందే వేశాడు. తను, రాజమౌళి ఒకే అమ్మాయిని ప్రేమిస్తే, తను త్యాగం చేశానన్నాడు. ఈ ట్రయాంగిల్ లవ్ లో రాజమౌళి భార్య రమా రాజమౌళి ప్రస్థావన కూడా వచ్చింది.

ముగ్గురం కలిసుద్దాం అని తను అనటం, కాదు గార్ళ్ ఫ్రెండ్ ని త్యాగం చేయమని రాజమౌళి అనటం… శ్రీనివాస రావు కూడా వేరే అమ్మాయిని పెళ్లిచేసుుంటే, నలుగురు కలిసి ఉందామనటం.. ఇవన్నీ తను చెప్పటం వెనక మానసిక సమస్యే ఉందన్నారు. రాజమౌళి సినిమాలకు ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ గా తను పనిచేశాడా? తను నిజంగా రాజమౌళి స్నేహితుడా అని ఎవరూ చూడట్లేదు..ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ లో ఏంతో కొంత నిజం లేక పోతే అంత ఖచ్చితంగా ఎలా చెబుతాడనే బ్యాచ్ కూడా స్వరం పెంచారు. కాని రాజమౌళి ఫ్యామిలీ మాత్రం ఈ మ్యాటర్ ని లైట్ తీసుకుంది. కొంతమందైతే శ్రీనివాస రావుకి మెంటల్ హెల్త్ బాలేక, ఇలా చేస్తున్నాడనంటున్నరు. అయినా ట్రాయాంగిల్ లవ్ స్టోరీ నడిపేంతగా అక్కడ కంటెంట్ ఉంటుందా? డైరెక్టర్ అయ్యాకే పెల్లిచేసుకున్న రాజమౌలికి ఎవరో త్యాగం చేస్తే తప్పా అమ్మాయి దొరకని పరిస్తితా అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు.

ఏదేమైనా ఒకవైపు మహేశ్ బాబు తో తను తీస్తున్న సినిమా తాలూకు లీకేజు, ఇదే సమయంలో తన పర్సనల్ లైప్ మీద బురద చల్లేలా శ్రీనివాస రావు వీడియో రెండూ పంచ్ ఇస్తున్నాయి. అసలు మహేశ్ బాబు లుక్ ని లీక్ చేసిన మహానుభావుడి సంగతి చూసేపనిలో ఫిల్మ్ టీం ఉంటే, ఇలాంట టైంలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ ని చెప్పి, తనని రాజమౌళి టార్చర్ పెడుతున్నాడనటంతో, నేషనల్ లెవల్లో వార్త వైరలైంది. ముందు ఎవరూ పట్టించుకోలేదు. కాని ఇప్పడు మాత్రం ఈ వార్త నిదానంగా నేషనల్ లెవల్లో ఫోకస్ అవుతోంది. జక్కన్న రియాక్ట్ అయితే తప్ప ఈ న్యూస్ కి బ్రేక్ పడేలా లేదు.