ఎన్టీఆర్, బన్నీ హీరోయిన్లకు ఇదేం రోగం… ఆమె అలా.? ఈమె ఇలా..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప 2 హిట్ పడ్డాక రష్మిక కల్లు నెత్తికెక్కాయనంటున్నారు. వెంటనే చావాతో మరో బ్లాక్ బస్టర్ సొంతమవ్వటం వల్లే, టంగ్ స్లిప్ అయినట్టుందనంటున్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప 2 హిట్ పడ్డాక రష్మిక కల్లు నెత్తికెక్కాయనంటున్నారు. వెంటనే చావాతో మరో బ్లాక్ బస్టర్ సొంతమవ్వటం వల్లే, టంగ్ స్లిప్ అయినట్టుందనంటున్నారు. మొన్న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోయిన్ కూడా ఇలాంటి తప్పే చేసింది. నోరుంది కదాని మైకు ముందు వాడేసింది. దీంతో మైండ్ ఉంది కదాని, తన మైండ్ సెట్ మీద ఎటాక్ చేస్తున్నారు ట్రోలర్స్.. పూజా హెగ్డే ని మించేలా రష్మిక మీద కామెంట్లతో ట్రోలింగ్ జరుగుతోంది. అంతటికీ కారణం కన్నడ లేడీ అయ్యుండి, తను హైద్రాబాది అని చెప్పుకోవటమే.. మొన్న అల వైకుంఠపురంలో మూవీ తమిళ్ సినిమా అని అనేసింది పూజాహెగ్డే.. దెబ్బకి తెలుగు మూవీని పట్టుకుని, తమిళ్ సినిమా అంటావా అని గట్టిగా ఇచ్చిపడేశారు ఇక్కడి జనం . కట్ చేస్తే మరో కన్నడ లేడీ రష్మిక కూడా ఇలాంటి తప్పే చేసింది. పూజా తప్పకి ఇక్కడి జనం ట్రోల్ చేస్తే, రష్మిక తప్పుకి, తన సొంత కన్నడిగులే కసితీరా తిడుతున్నారు.
ఎన్టీఆర్ తో అరవింద సమేత వీరరాఘవలో మెరిసింది పూజా హెగ్డే… అదే ఎన్టీఆర్ తో జైలర్ డైరెక్టర్ ప్లాన్ చేసిన మూవీలో మెరవబోతోంది రష్మికా మందన్నా.. ఈ ఇద్దరు ఇప్పుడు ఈ మధ్యే వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అంతటికీ టంగ్ స్లిప్ అవటమే కారనం. ఒకరేమో సొంత ప్రాంతవాసులైన కన్నడిగల కామెంట్లు ఫేస్ చేస్తుంటే, మరొకరు లైఫ్ ఇచ్చిన తెలుగు జనాల నుంచి తిట్లు తింటున్నారు
రీసెంట్ గా పుష్ఫ 2 హిట్ తో గాల్లో తేలిపోయిన రష్మిక, కొత్తగా హిందీ మూవీ చావా హిట్ తో ఆకాశంలో విహరిస్తున్నట్టుంది. అందుకే తను పుట్టిన ప్రాంతమైన కర్ణాటకని మర్చిపోయి తనని, తాను హైద్రబాది అనేసింది.. ఇది కాంట్రవర్సీకి అసలు కారణం. హిందీ మూవీ చావా ప్రమోషన్ లో భాగంగా, తను హైద్రబాది అని పరిచయం చేసుకోవటంతో, కన్నడిగలు కామెంట్లతో దాడి చేస్తున్నారు.రష్మికను అంతా అనవసరంగా ట్రోల్ చేస్తుంటే, అయ్యో పాపం అనుకున్నాం… కాని తను ఇలా కర్ణాటక గడ్డని మర్చిపోయి, హైద్రబాదీగా పరిచయం చేసుకోవటం చూస్తుంటే, తనకి ఇంకా ట్రోల్ చేయాలంటూ ఓ నెటీజన్ పెట్టిన పోస్ట్ వైరలైంది. ప్రజెంట్ రష్మిక ట్రోలింగ్ వీడియోసే ట్రెండింగ్ లో ఉన్నాయి. కన్నడ జనం రష్మిక మీద కనికరం కూడా చూపించట్లేదు.
రీసెంట్ గా పూజా హెగ్డే కూడా ఇలానే కామెంట్లకు, ట్రోలింగ్ కి గురైంది. కారణం కూడా తను టంగ్ స్లిప్ అవటమే. తెలుగులో తనకి టాప్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన అల వైకుంఠపురంలో ని తను మర్చిపోయింది. అదో తమిల్ సినిమా అంటూ నార్త్ బ్యాచ్ కి ఇచ్చిన ఇంటర్వూల నోరు జారింది. తెలుగులో తప్ప పూజా హెగ్డేకి తమిళ్, కన్నడలో పెద్దగా హిట్లు లేవు. బ్లాక్ బస్టర్లు లేనే లేవు..అలంటప్పుడు అంత అమాయకంగా అల వైకుంఠపురంలో మూవీని ఎలా తమిళ్ సినిమా అనేసిందని తెలుగు జనం గట్టిగా ఇచ్చిపడేశారు. అదైపోయిన వెంటనే రష్మిక చావా ప్రమోషన్ కోసం హైద్రబాద్ నుంచి వచ్చాననగానే, తనని తాను హైద్రబాదిగా పరిచయం చేసుకోవటం ఏంటని కన్నడ జనం తిట్టిపోస్తున్నారు.నిజానికి తనేం హైద్రబాది అని చెప్పుకోలేదు, కన్నడ అమ్మాయినే కాని హైద్రబాద్ లో బిజీ అయ్యాను, అక్కడి నుంచి వస్తున్నానంటే సరిపోయేది… కాని ఐడెంటిటీని చెప్పుకునేప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఇలాంటి టంగ్ స్లిప్ ఇన్స్ డెంట్స్ తోనే తెలిసొస్తుంది…మొత్తానికి కన్నడ లేడీస్ కి, కామెంట్ల కష్టాలు మాత్రం ఒకే సారి వచ్చాయి.