రవితేజ అన్నా.. ప్రతీసారి ఎక్కడ పడుతున్నావన్నా ఇట్లాంటి అమ్మాయిల్ని..?
ప్రతీసారి ఎక్కడ పడుతున్నావ్ రా ఇలాంటి జంబల్ హాట్ అమ్మాయిలను అంటూ డిజే టిల్లు సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది కదా..? ఇప్పుడు రవితేజను చూసి ఇదే అంటున్నారు అభిమానులు కూడా.

ప్రతీసారి ఎక్కడ పడుతున్నావ్ రా ఇలాంటి జంబల్ హాట్ అమ్మాయిలను అంటూ డిజే టిల్లు సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది కదా..? ఇప్పుడు రవితేజను చూసి ఇదే అంటున్నారు అభిమానులు కూడా. ప్రతీసారి ఎక్కడ్నుంచి తీసుకొస్తున్నావ్ అన్నా నీ సినిమాలో హీరోయిన్లను.. అలా ఉంటున్నారు అంటూ తెగ పొగిడేస్తున్నారు. కావాలంటే చూడండి.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్స్ అందరికీ.. వాళ్లు స్టార్స్ కాకముందు రవితేజనే ఆఫర్ ఇచ్చుంటాడు. కావాలంటే చెక్ చేసుకోండి.. ఇప్పుడు ఇండస్ట్రీని ఏలేస్తున్న శ్రీలీలకు ధమాకాతో ఫస్ట్ ఆఫర్ ఇచ్చింది రవితేజ.. అలాగే మీనాక్షి చౌదరి ఎవరో కూడా తెలియక ముందే ఆ అమ్మాయితో ఖిలాడీలో రొమాన్స్ చేసాడు మాస్ రాజా. దానికంటే ముందు డింపుల్ హయాతీతోనూ ఖిలాడిలో నటించాడు.. ఆ తర్వాతే డింపుల్‌కు వరస ఛాన్సులొచ్చాయి. ఇక అప్పట్లో ఇండస్ట్రీని ఊపేసిన రకుల్ ప్రీత్ సింగ్ ముందు కిక్ 2లో నటించిన తర్వాతే రామ్ చరణ్ టాంటి స్టార్ హీరోలు ఆమెకు అవకాశమిచ్చారు.
కొన్నేళ్లుగా ప్రతీ సినిమాలోనూ అదిరిపోయే హీరోయిన్లతో జోడీ కడుతున్నాడు రవితేజ. అవి హిట్టా ఫట్టా పక్కనబెడితే.. మాస్ రాజా సినిమా అంటే చాలు హీరోయిన్స్ మాత్రం అదిరిపోతున్నారు. రావణాసురలో అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాశ్, దక్షా నగార్కర్ లాంటి వాళ్లతో నటించాడు రవితేజ. ఇక టైగర్ నాగేశ్వరరావు కృతి సనన్ చెల్లి నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ లాంటి యంగ్ హీరోయిన్లతో రొమాన్స్ చేసాడు. మొన్నటికి మొన్న మిస్టర్ బచ్చన్‌లోనూ భాగ్యశ్రీ బోర్సేకు ఆఫర్ ఇచ్చింది మాస్ రాజానే. సినిమా ఫ్లాప్ అయిందేమో గానీ ఆ అమ్మాయి మాత్రం సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది భాగ్యశ్రీ. ప్రస్తుతం మాస్ జాతరలో మరోసారి శ్రీలీలతోనే జోడీ కడుతున్నాడు రవితేజ.
దీని తర్వాత కిషోర్ తిరుమలతో ఓ సినిమా చేయబోతున్నాడు ఈ సీనియర్ హీరో. ఇందులో హీరోయిన్స్ ఎవరో తెలుసా..? సౌత్ ఇండియన్ మోస్ట్ సెన్సేషనల్ బ్యూటీస్ మమితా బైజు అండ్ కయాడు లోహర్. ఇద్దరు కత్తుల్లాంటి హీరోయిన్లను తన సినిమా కోసం సెలెక్ట్ చేసుకున్నాడు మాస్ రాజా. కయాడు లోహర్ ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండింగ్. మొన్న డ్రాగన్ సినిమాలో నటించింది ఈ బ్యూటీ.. ఇక ప్రేమలు సినిమాతో పిచ్చెక్కింది మమితా. ఈ ఇద్దరూ ఇప్పుడు రవితేజతో ఒకే సినిమాలో నటించబోతున్నారు. దెబ్బకు కుర్రాళ్లంతా ఈ సినిమా కోసం క్యూ కడతారంతే. అందుకే రవితేజను చూసి అభిమానులే అంటున్నారు.. ఎక్కడ పడుతున్నావ్ అన్నా ఇలాంటి కత్తి లాంటి అమ్మాయిల్ని అని..! ఈ హీరోయిన్ సెలక్షన్ చూసాక.. ఆ మాట అనడంలో తప్పేం లేదుగా..!