రవితేజ సుడిగాడబ్బా.. నెక్స్ట్ లైన్ లో ఉన్న డైరెక్టర్స్ ఎవరో తెలుసా..?

హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసే హీరోలలో రవితేజ అందరికంటే ముందుంటాడు. కాకపోతే ఇక్కడ సర్వైవ్ అవ్వాలంటే కచ్చితంగా హిట్స్ ఉండాల్సిందే.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 27, 2025 | 03:15 PMLast Updated on: Feb 27, 2025 | 3:15 PM

Intersting News About Raviteja Movies

హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసే హీరోలలో రవితేజ అందరికంటే ముందుంటాడు. కాకపోతే ఇక్కడ సర్వైవ్ అవ్వాలంటే కచ్చితంగా హిట్స్ ఉండాల్సిందే. ఇమేజ్ ఎంత ఉన్నా కూడా విజయాలు లేకపోతే మార్కెట్ పడిపోతుంది. రవితేజ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. నిజానికి ఈయనకు మార్కెట్ లేదు అని కాదు.. ఇప్పటికీ అదిరిపోయే మార్కెట్ మాస్ రాజా సొంతం. ఈయన ఇమేజ్ కు తగిన సినిమా పడితే బాక్సాఫీస్ మోత మోగడం ఖాయం. నాలుగేళ్ల కింద కరోనా టైంలో 50% ఆక్యుపెన్సి తోనే క్రాక్ సినిమా దాదాపు 75 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.. ఆ తర్వాత ధమాకా 100 కోట్లు వసూలు చేసింది.. వాల్తేరు వీరయ్య సినిమా విజయంలో రవితేజ పాత్ర మరువలేనిది. ఇలా మాస్ రాజాకు ఇప్పటికి మంచి మార్కెట్ ఉంది.. కాకపోతే దాన్ని యూస్ చేసుకునే కథలు మాత్రం రావడం లేదు.

రెమ్యూనరేషన్ కు టెంప్ట్ అయి కథలు ఓకే చేస్తున్నాడేమో తెలియదు కానీ.. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్స్ తో రవితేజ మార్కెట్ బాగా పడిపోయింది. అసలు హరీష్ శంకర్ తెరకెక్కించిన మిస్టర్ బచ్చన్ అయితే కనీసం 10 కోట్లు కూడా వసూలు చేయలేదు. ఇలాగే సినిమాలు చేస్తూ పోతే కనీసం రవితేజ సినిమా వచ్చిందే అనే విషయం కూడా ప్రేక్షకులు పట్టించుకోవడానికి ఇష్టపడరేమో. అందుకే గ్యాప్ తీసుకుంటున్నాడు మాస్ రాజా. ప్రస్తుతం మాస్ జాతర అనే సినిమా చేస్తున్నాడు. ఇది ఆయనకు 75వ సినిమా కావడంతో కాస్త కాన్సన్ట్రేషన్ ఎక్కువగానే పెడుతున్నాడు. భాను భోగవరపు ఈ సినిమాకు దర్శకుడు.

దీని తర్వాత సెన్సిబుల్ డైరెక్టర్ కిషోర్ తిరుమలతో అనార్కలి అనే సినిమా చేస్తున్నాడు.. ఇప్పటికే స్క్రిప్ట్ డైలాగ్స్ అన్ని లాక్ అయిపోయాయి. మాస్ జాతర విడుదల కాగానే ఈ సినిమా సెట్స్ మీదకు రానుంది. దీని తర్వాత మ్యాడ్ ఫేమ్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు రవితేజ. విజువల్ వండర్ గా ఈ సినిమా రాబోతుంది. ఈ మూడు సినిమాలతో కచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతాను అని నమ్మకంగా చెబుతున్నాడు మాస్ రాజా. డైరెక్టర్స్ చూస్తుంటే టాలెంట్ ఉన్నవాళ్లే. వాళ్ల టాలెంట్ కు తగ్గట్టు కథలు కూడా వర్కవుట్ అయితే రవితేజ కష్టాలు తీరినట్టే.