ఎన్టీఆర్ కోసం యానిమల్ మారాడు… స్పిరిట్ తర్వాత సినీసునామీ…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వల్ల బాలీవుడ్ లో రణ్ బీర్ కపూర్ కి పంచ్ పడుతోంది. టాలీవుడ్ లో ఐకాన్ స్టార్ అల్లున్ కి సినిమా కనిపిస్తోంది.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వల్ల బాలీవుడ్ లో రణ్ బీర్ కపూర్ కి పంచ్ పడుతోంది. టాలీవుడ్ లో ఐకాన్ స్టార్ అల్లున్ కి సినిమా కనిపిస్తోంది. ఒకే దెబ్బకు ఇద్దరు హీరోలకు కళ్లు బైర్లు కమ్ముతున్నాట్టున్నాయి. కావాలని చేయకున్నా సీన్, సిచ్చువేషన్ అలానే కనిపిస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ మూవీని లాంచ్ చేయబోతున్న సందీప్ రెడ్డి వంగ, సడన్ గా మనసు మార్చుకున్నట్టున్నాడు. ఈ సినిమా తర్వాత యానిమల్ సీక్వెల్ ప్లాన్ చేసిన తను, ఆ ప్రాజెక్టుని హోల్డ్ లో పెట్టాడు.తనతో సినిమా ఎనౌన్స్ చేసిన బన్నీని కూడా పక్కన పెట్టాడు. అంతటికీ కారణం ఎన్టీఆరే.. తనతో సందీప్ ప్రాజెక్టు ఓకే అవ్టమే అనితెలుస్తోంది. ఈ ఇద్దరి మధ్య ముంబైలో రెండు సార్లు, హైద్రబాద్ లో ఒకసారి కథ చర్చలు జరిగాయి. సందీప్ కండీషన్స్ అన్నీంటికి ఎన్టీఆర్ ఒప్పుకోవటంతో, ఈ క్రేజీ కాంబినేషన్ సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది. కాకపోతే ఎందుకు యానిమల్ సీక్వెల్ ని హోల్డ్ లో పెట్టీ సందీప్ రెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడో తేలట్లేదు. బన్నీని కూడా అవాయిడ్ చేయటానికి అసలు రీజనేంటో క్లారిటీ లేదు..
రెబల్ స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ మూవీని ఉగాదికి లాంచ్ చేయబోతున్న సందీప్ రెడ్డి వంగ, ఆతర్వాత ఏం చేస్తాడంటే, యానిమల్ సీక్వలె అనే సమాధానం వస్తుంది. కాని ఇప్పుడుల లెక్కలు మారాయి. ఎన్టీఆర్ తో ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు అన్ని డోర్లు తెరుచుకుంటున్నాయి. ఆల్ ఆఫ్ సడన్ గా ఇదేం జరగలేదు. యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ ని సందీప్ రెడ్డి వంగ పూర్తిగా పక్కన పెట్టలేదు..కాని స్పిరిట్ తర్వాత మాత్రం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో సందీప్ రెడ్డి వంగ సినిమా ఆల్ మోస్ట్ కన్ఫామ్ అయ్యింది. ముంబైలో ఫస్ట్ టైం ఇద్దరు కలిసుకున్నప్పుడు జస్ట్ అనుకోకుండా జరిగిన మీటింగ్ అనుకున్నారు. కాని రెండో సారి వార్ 2 సెట్స్ కెళ్లి సందీప్ రెడ్డి వంగ తనని కలిశాకే, సీరియస్ గా ఏదో ప్లానింగ్ జరుగుతోందనే ప్రచారం మొదలైంది.
కట్ చేస్తే హైద్రబాద్ లో కూడా వీళ్ల మీటింగ్ జరిగాకే, ఈ కాంబినేషన్ ఆల్ మోస్ట్ కన్ఫామ్ అనుకున్నారు. కాని ఎప్పుడు అనేది తేలలేదు. ఎలాగూ వార్ 2 పూర్తిచేశాక, డ్రాగన్, దేవర 2 తో ఎన్టీఆర్ బిజీ అవుతాడు. నెల్సన్ దిలీప్ తో కూడా తారక్ సినిమా ఓకే అయ్యింది. కాబట్టి ఆ తర్వాతే సందీప్ రెడ్డి వంగ తో ఎన్టీఆర్ మూవీ ఉంటుందనుకున్నారు.
కాని పరిస్థితి చూస్తే మాత్రం అలా లేదు. డ్రాగన్, తర్వాతే ఎన్టీఆర్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ వర్కవుట్ అయ్యేలా ఉంది. దీనికి కారణం ప్రభాసే… తను రాజా సాబ్, ఫౌజీ సినిమా షూటింగ్స్ తో బిజీ అవటం, హెల్త్ రీజన్స్ తో బ్రేక్ తీసుకోవటం జరిగింది. ఫలితంగా యానిమల్ హిట్ తర్వాత సందీప్ రెడ్డి వంగ ఏడాదిగా ఖాలీగా ఉన్నాడు. ఈలోపు స్పిరిట్ ప్రీప్రొడక్షన్ పనులు పూర్తి చేశాక, యానిమల్ సీక్వెల్ స్క్రిప్ట్ ని కూడా రెడీ చేశాడు. తర్వాత తారక్ తో మీటింగ్ తర్వాత ఆ కథ కూడా పూర్తిగా షేప్ కి వచ్చిందట.దీనికి తోడు రణ్ బీర్ కపూర్ యానిమల్ సీక్వెల్ చేసేందుకు రెండేళ్ల తర్వాతే డేట్లిచ్చేఛాన్స్ ఉంది. ఒక వైపు తను కమిటైన రామాయణం, అది కూడా మూడు భాగాలతో ప్లాన్ చేయటం… మూడు భాగాలను ఒకేసారి తీయాలని ఫిల్మ్ టీం కమిటవటంతో ఏడాదిన్నర టైం దానికే కేటాయించాల్సివచ్చేలా ఉంది. ఇక సంజయ్ లీలా భన్సాలీ లవ్ అండ్ వార్ ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కుతుండటంతో, రణ్ బీర్ కపూర్ రెండున్నరేళ్ల వరకు ఆ సినిమాలకే అంకితం..
సో స్పిరిట్ ని జూన్ లో మొదలు పెట్టి, ఇయర్ ఎండ్ కి పూర్తి చేసినా తర్వాత మళ్లీ సందీప్ రెడ్డి వంగ రణ్ బీర్ కపూర్ కోసం వేయిట్ చేయాలి. దానికంటే తారక్ తో సినిమా తీస్తే బెటర్ అనే నిర్ణయానికి వచ్చాడు.దీనికి తోడు కథ కూడా తారక్ కి కనెక్ట్ అవటంతో, అటు వైపు కూడా ప్లానింగ్ చేసేస్తున్నాడు. సో అలా సడన్ గా స్పిరిట్ తర్వాత తారక్ తో సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది.