శ్రీలీల మహా ఖిలాడి.. బాలీవుడ్ కోసం అంత పని చేసిందా..?

శ్రీలీల.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాల అవసరమా చెప్పండి..! మరీ ముఖ్యంగా యూత్ అయితే శ్రీలీల పేరు వినగానే మత్తెక్కిపోతుంటారు. చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా వచ్చిన పేరు మాత్రం ఎక్కువ.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 22, 2025 | 02:15 PMLast Updated on: Feb 22, 2025 | 2:15 PM

Intersting News About Sri Leela

శ్రీలీల.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాల అవసరమా చెప్పండి..! మరీ ముఖ్యంగా యూత్ అయితే శ్రీలీల పేరు వినగానే మత్తెక్కిపోతుంటారు. చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా వచ్చిన పేరు మాత్రం ఎక్కువ. ఇన్నాళ్లు కేవలం తెలుగు ఇండస్ట్రీ మీద మాత్రమే ఫోకస్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు బాలీవుడ్ మీద కూడా ఓ కన్నేసింది. ఈ మధ్యే శ్రీలీల మొదటి బాలీవుడ్ సినిమా టీజర్ కూడా విడుదలైంది. కార్తీక్ ఆర్యన్ లాంటి క్రేజీ హీరోతో ఈ భామ ఎంట్రీ ఇవ్వబోతుంది. బాలీవుడ్ సెన్సేషనల్ ఫ్రాంచైజీ ఆషికీ 3తో నార్త్ ఆడియన్స్ ను పలకరించబోతుంది శ్రీలీల. దీపావళికి సినిమా కూడా విడుదల కానుంది.

ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ బాలీవుడ్ కోసం మాస్టర్ ప్లాన్ వేసింది శ్రీలీల. తెలుగులో ఈ ముద్దుగుమ్మ రేంజ్ మామూలుగా లేదు. ఒక్కో సినిమాకు 2 కోట్ల వరకు చార్జ్ చేస్తుంది. కానీ తన కెరీర్ కు ఉపయోగపడుతుంది అనే సినిమా కోసం మాత్రం రేటులో ఎప్పుడూ డిస్కౌంట్ ఇస్తూనే ఉంటుంది శ్రీలీల. పెళ్లి సందడి తర్వాత ధమాకా, గుంటూరు కారం లాంటి సినిమాలకు కాస్త తక్కువగానే తీసుకున్న శ్రీలీల.. వైష్ణవ్ తేజ్, రామ్, నితిన్ సినిమాలకు భారీగా వసూలు చేసింది. బాలీవుడ్ లో కూడా ఇదే ప్లాన్ అప్లై చేస్తుంది శ్రీలీల.

అక్కడ ఫస్ట్ సినిమా కోసం కేవలం 1.70 కోట్లు మాత్రమే తీసుకుంటున్నారని తెలుస్తోంది. దీనికి ప్రత్యేక కారణం కూడా లేకపోలేదు. ఈ సినిమా హిట్ అయితే శ్రీలీలకు వచ్చే క్రేజ్ మామూలుగా ఉండదు. ఇప్పటికే ముంబైలో ఈ ముద్దుగుమ్మ గురించే చర్చ బాగా జరుగుతుంది. బాలీవుడ్ నెక్స్ట్ బిగ్ థింగ్ అంటున్నారు. ఇలాంటి టైంలో రెమ్యూనరేషన్ గురించి బెట్టు చేస్తే వచ్చే ఆఫర్స్ కూడా రావు. అందుకే జెండా పాతిన తర్వాత వద్దన్నా డబ్బులు అవే వస్తాయని ఫిక్స్ అయిపోయింది ఈ భామ. పైగా గ్లామర్ షోకు కూడా శ్రీలీల పెద్దగా అడ్డు చెప్పదు. అందుకే ఫ్యూచర్ అంతా మనదే అనే నమ్మకంతోనే ప్రస్తుతం తక్కువ తీసుకున్నా.. నెక్స్ట్ వడ్డీతో కలిపి వసూలు చేసే ప్లాన్ లో ఉంది శ్రీలీల.