రౌడీ బాగుపడాలంటే… మళ్లీ రౌడీగానే మారాలా..?

విజయ్ దేవరకొండ ఎప్పుడో పెళ్లిచూపులతో హిట్ సొంతం చేసుకున్నాడు. గీత గోవిందం కూడా తనకి బ్లాక్ బస్టర్ మూవీగా మారింది. అంతవరకు ఓకే కాని, తనని అసలైన మొనగాడిగా చేసింది మాత్రం మధ్యలో వచ్చిన అర్జున్ రెడ్డినే...

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 6, 2025 | 08:30 PMLast Updated on: Mar 06, 2025 | 8:30 PM

Intersting News About Vijaydevarakonda

విజయ్ దేవరకొండ ఎప్పుడో పెళ్లిచూపులతో హిట్ సొంతం చేసుకున్నాడు. గీత గోవిందం కూడా తనకి బ్లాక్ బస్టర్ మూవీగా మారింది. అంతవరకు ఓకే కాని, తనని అసలైన మొనగాడిగా చేసింది మాత్రం మధ్యలో వచ్చిన అర్జున్ రెడ్డినే… ఆ సినిమా తో ప్రభాస్ తర్వాత పాన్ ఇండియానే దున్నేసే మరో తెలుగు హీరో అన్నారు. కాని అడ్రస్సే లేకుండా పోయాడు. అసలు తన సినిమా అప్ డేట్స్ ని కూడా పట్టించుకునే నాథుడే లేడు. రీసెంట్ గా దిల్ రాజు తన ప్రొడక్షన్ లో తీస్తున్న విజయ్ దేవరకొండ మూవీ టైటిల్ ని, టంగ్ స్లిప్ అయ్యి లీక్ చేశాడు. రౌడీ జనార్థన్ రెడీ అవుతోందన్నాడు. కాని ఎవరూ పెద్దగా ఇంటస్ట్రీ చూపించినట్టు లేరు. అసలు ఇలాంటి ఓ సినిమా గురించి సోషల్ మీడియాలో పట్టింపే లేదు. ఇలాంటి టైంలో సందీప్ రెడ్డి వంగ వచ్చి బాంబు పేల్చాడు. దెబ్బకు సౌత్ లో సౌండ్ నార్త్ వరకు రీసౌండ్ గా మారింది. ఒక్కసారిగా అర్జున్ రెడ్డి వైబ్స్ వచ్చేశాయి… అదేంటో చూసేయండి.

రౌడీ స్టార్ ఎక్కడో ఉండాల్సిన హీరో… కాని ఎక్కడికో పాతాళానికి వెళ్లాల్సి వచ్చింది. అసలు తన అడ్రస్సే గల్లంతైంది. ఒకప్పడు విజయ్ దేవరకొండ బెంగుళూర్ వెళితే, అక్కడ డాక్టర్ కోర్స్ చేసే ఆడలేడీస్, తన కారు వెంటపడి ఫ్లయ్యింగ్ కిస్సులిచ్చారు. అంత పిచ్చి పెరగటానికి కారణం ఒకటే అర్జున్ రెడ్డి హిట్. ఆ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ తోనే, విజయ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. మరో భాషలో ఆ సినిమా రిలీజ్ కాకున్నా విజయ్ దేవరకొండ అనే షాకింగ్ యాక్టర్ ఉన్నాడనేంతగా, అందరికి తన పేరు పరిచయం అయ్యింది. కట్ చేస్తే వెంటనే గీత గోవిందం కూడా హిట్ అవటంతో, ఇక బాహుబలి తో పాన్ ఇండియాని ప్రభాస్ షేక్ చేస్తే, దేశాన్ని మళ్లీ షేక్ చేసే మరో హీరో విజయే అవుతాడన్నారు.

కొండంత అంచనాలు తన మీద పెరిగిపోయాయి… కాని ఒక్కే ఒక్క లైగర్ డిజాస్టర్ తో పాతాలానికి పడిపోయాడు విజయ్. కట్ చేస్తే ఖుసీ, ఫ్యామిలీస్టార్ అన్నీ డిజాస్టర్లే… ఇప్పుడు తనని పాన్ ఇండియా లెవ్లలో పట్టించుకునే నాథుడే లేడు. మళ్లీ అర్జున్ రెడ్డి లాంటి మూవీ పడితే కాని ఈ రౌడీ స్టార్ లెక్క మారదు. ఫేట్ కూడా మారదు..ఇలా చాలమందికి ఎప్పటి నుంచో అనిపిస్తున్నట్టుంది. మరో అర్జున్ రెడ్డి లాంటి ప్రాజెక్ట్ తనకి పడితే బాగుండనే మాటే వినిపిస్తోంది. ఎగ్జాక్ట్ గా ఇలాంటి టైంలోనే బాంబు పేల్చాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. అది కూడా అర్జున్ రెడ్డి పేరే ఎత్తాడు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నామస్మరనే చేశాడు.

తన జీవితంలో, విజయ్ జీవితంలో గేమ్ ఛేంజింగ్ మూమెంట్ అంటే అర్జున్ రెడ్డి టీజర్ లాంచ్ చేసిన రోజే అన్నాడు. తను, విజయ్ కలిసి టీజర్ ని లాంచ్ చేశాక, తన ఫోన్ లో మెసేజులు, కాల్స్ తో షేక్ అయ్యిందన్నాడు. అలాంటి మూవీ పడ్డాకే తన జీవితం, విజయ్ జీవితం మారాయన్నాడు. ప్రజెంట్ ప్రభాస్ తో స్పిరిట్ ప్లాన్ చేస్తున్నతను, యానిమల్ పార్క్ తర్వాత మళ్లీ విజయ్ దేవరకొండతో సినిమా ప్లాన్ చేయొచ్చని తెలుస్తోంది. ఆన్ ఏయిర్ లో ఆ విషయం చెప్పలేదు కాని, ఆఫ్ దరికార్డ్ యాంకర్ కి తను చెప్పిందాని ప్రకారం చూస్తే స్పిరిట్, యానిమల్ సీక్వెల్ తర్వాత రౌడీ స్టార్ తో సందీప్ సినిమా ఉండొచ్చు… మరి బన్నీతో మూవీ సంగతి మాత్రం తేలలేదు.